ప్రధాన మంత్రి కార్యాలయం

త‌మిళ నాడు డాక్ట‌ర్ ఎమ్‌.జి.ఆర్‌. వైద్య విశ్వ‌విద్యాల‌యం 33వ స్నాత‌కోత్సవం సంద‌ర్భం లో ఈ నెల 26న‌ ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 24 FEB 2021 7:39PM by PIB Hyderabad

శుక్ర‌వారం నాడు అంటే ఈ నెల 26న ఉద‌యం 11 గంట‌ల కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌మిళ నాడు డాక్ట‌ర్ ఎమ్‌.జి.ఆర్‌. వైద్య విశ్వ‌విద్యాల‌యం 33వ స్నాత‌కోత్సవం సందర్బం లో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.  స్నాత‌కోత్స‌వం లో మొత్తం 17,591 మంది అభ్య‌ర్థుల‌ కు డిగ్రీల‌ ను, డిప్లొమాల ను ప్ర‌దానం చేయ‌డం జ‌రుగుతుంది.  ఈ కార్య‌క్ర‌మం లో త‌మిళ నాడు గ‌వ‌ర్న‌రు కూడా పాల్గొంటారు.

విశ్వవిద్యాల‌యం‌ గురించి

ఈ విశ్వ‌విద్యాల‌యానికి త‌మిళ నాడు పూర్వ ముఖ్య‌ మంత్రి డాక్ట‌ర్ ఎమ్‌.జి. రామ‌చంద్ర‌న్ పేరు ను పెట్టారు.  దీనికి మొత్తం 686 సంస్థ లు అనుబంధం గా ఉన్నాయి. వాటి లో వైద్య విద్య, దంత వైద్య విద్య, ఫార్మ‌సి, న‌ర్సింగ్‌, ఆయుష్‌, ఫిజియోథెర‌పి, ఆక్యుపేశన‌ల్ థెర‌పి ల‌తో పాటు ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాని కి సంబంధించిన ఇత‌ర విభాగాలు కూడా ఉన్నాయి.  త‌మిళ నాడు రాష్ట్రం నలు మూలల నెల‌కొన్న ఈ సంస్థ‌ల లో 41 వైద్య క‌ళాశాల‌ లు, 19 దంత వైద్య క‌ళాశాల‌ లు, 48 ఆయుష్ క‌ళాశాల‌ లు, 199 న‌ర్సింగ్ కాలేజీ లు, 81 ఫార్మ‌సీ కాలేజీ లు ఉండ‌గా, మిగిలిన సంస్థల లో స్పెశాలిటీ పోస్ట్-డాక్ట‌ర‌ల్ మెడిక‌ల్ ఇన్స్ టిట్యూశన్ లు/ఇత‌ర ఆరోగ్య సంబంధిత విద్యా సంస్థ‌ ల వంటివి ఉన్నాయి.



 

***


(Release ID: 1700745) Visitor Counter : 148