ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సమగ్ర ఇంద్రధనుష్ (ఐఎంఐ) 3.0
కొవిడ్-19 మహమ్మారి వల్ల వాక్సిన్ తీసుకోని గర్భిణిలు, పిల్లలను గుర్తించి వారికి మోదాతు ప్రకారం టీకాలు
మొదటిరోజున 29,000 మంది గర్భిణిలు, 5,000 మంది పిల్లలకు టీకాలు
Posted On:
23 FEB 2021 1:43PM by PIB Hyderabad
సాధారణ రోగనిరోధక కార్యక్రమంలో వాక్సిన్ తీసుకోవడంలో విఫలమైన గర్భిణిలు, పిల్లలను గుర్తించి వారికి మోదాతు ప్రకారం వాక్సిన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమగ్ర ఇంద్రధనుష్ (ఐఎంఐ)ను అమలు చేయడం ప్రారంభించాయి. 2021 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభం అయిన ఈ కార్యక్రమం 15 రోజుల పాటు అమలు జరుగుతుంది. గర్భిణిలు, పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రూపొందిన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
2021 ఫిబ్రవరి 19వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రతి ఒక్క శిశువుకు వ్యాధి నిరోధక కార్యక్రమ పరిధిలోనికి తీసుకుని రావడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రాల ఉన్నతస్థాయి నాయకత్వం సహకరిస్తున్నది. ఉత్తరప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 21వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజస్ధాన్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ, మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రభు రాం చౌదరి తమతమ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 22వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కామరూప్ జిల్లాలో ఇటుక బట్టీలో వాక్సిన్ వేస్తున్న దృశ్యం
జోర్హాట్ జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమం
15 రోజులలో రెండు రౌండ్ల టీకాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 29 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో పట్టణ/ గ్రామీణ ప్రాంతాలలో గుర్తించిన 250 జిల్లాల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తారు. కోవిడ్-19 వల్ల తమ ప్రాంతాలకు చేరుకోలేక టీకాలను తీసుకోలేక పోయిన వారిని గుర్తించి వారికి టీకాలను ఇవ్వడం జరుగుతుంది. (ఐఎంఐ) 3.0 ప్రమాణాల ప్రకారం ఈ ప్రాంతాలను మూడు తరగతులుగా విభజించి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 313 జిల్లాలను లో రిస్క్ జిల్లాలుగాను, 152 జిల్లాలను మీడియం రిస్క్, 250 జిల్లాలను హై రిస్క్ జిల్లాలుగాను గుర్తించారు.
కార్యక్రమాన్ని అమలు చేసే సమయంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. ఎక్కువ మంది ఒక ప్రాంతంలో గుమికూడకుండా చూడడానికి కార్యక్రమాన్ని విడతల లేదా దశలవారీగా అమలు చేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో ఒకసారి పది మందికి మించకుండా లబ్ద్ధిదారులకు మాత్రమే టీకాలు ఇచ్చేలా చర్యలను తీసుకోవాలని సూచించడం జరిగింది.
కోవిడ్ వల్ల టీకాలను తీసుకోలేక పోయిన గర్భిణులు, పిల్లలను గుర్తించి వారికి ఐఎంఐ3.0 తొలి దశలో టీకాలను ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 22వ తేదీ సాయంకాలం అయిదు గంటల వరకు అందిన సమాచారం (తాత్కాలిక సమాచారం) ప్రకారం 29,000 మంది పిల్లలు, 5000 మంది గర్భిణులకు టీకాలను ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన శాఖలు, భాగస్వాములు, యువజన సంఘాలు, పౌరసంఘాల సహకారంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఐఎంఐ 3.0ని అమలు చేస్తోంది. కోవిడ్ వల్ల టీకాలను తీసుకోలేక పోయిన వారికి ప్రయోజనం కలిగించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
****
(Release ID: 1700200)
Visitor Counter : 298