ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కుశుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 20 FEB 2021 10:01AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.
ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌ద్వారా ఒక సందేశ‌మిస్తూ ప్ర‌ధాన‌మంత్రి,"  అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రావ‌త‌ర‌ణదినోత్స‌వ శుభ‌స‌మ‌యంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కుచెందిన అద్భుత ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు గొప్ప సంస్కృతి, ధైర్య‌సాహ‌సాలు, భార‌త‌దేశ అభివృద్ధికి గ‌ట్టి నిబద్ధ‌త క‌లిగిన వారిగా ప్రసిద్ధి పొందిన‌వారు.  అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌గ‌తిలో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించడం కొన‌సాగించ‌గ‌ల‌ద‌ని ఆకాంక్షిస్తున్నాను." అని పేర్కొన్నారు.

***


(Release ID: 1699618) Visitor Counter : 168