ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
94 లక్షల టీకాలతో ప్రపంచంలో మూడో స్థానంలో భారత్
పెరుగుదలబాటలో సాగుతూ 97% పైగా కోలుకున్న కోవిడ్ కేసులు గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ మరణమూ నమోదు కాని 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
Posted On:
18 FEB 2021 10:52AM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్న వారి సంఖ్యాపరంగా అమెరికా, బ్రిటన్ మొదటి రెండు స్థానాల్లో ఉందగా భారత్ మూడో స్థానంలో ఉంది. 2021 ఫిబ్రవరి 18 ఉదయం8 గంటలకల్లా కోవిడ్ తీకాలందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కలిసి 94 లక్షలు దాటారు. ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారాన్ని బట్టి మొత్తం 1,99,305 శిబిరాలు నిర్వహించగా 94,22,228 మందికి టీకాలు వేశారు. వారిలో 61,96,641 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా3,69,167 మంది రెండో డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, 28,56,420 మమ్ది మొదటి డోస్ తీసుకున్న కోవిడ్ యోధులు ఉన్నారు.
రెండవ డోస్ కోవిడ్ టీకాల కార్యక్రమం ఫిబ్రవరి 13న మొదలైంది. మొదటి డో స్తీసుకొని 28 రోజులు దాటినవారికి రెండో డోస్ ఇస్తూ వచ్చారు. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం ఫిబ్రవరి 2న మొదలైంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
మొత్తం డోస్ లు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
4,045
|
182
|
4,227
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3,76,308
|
35,475
|
4,11,783
|
3
|
ఆరుణాచల్ ప్రదేశ్
|
16,613
|
1,574
|
18,187
|
4
|
అస్సాం
|
1,31,651
|
5,573
|
1,37,224
|
5
|
బీహార్
|
5,02,903
|
15,192
|
5,18,095
|
6
|
చండీగఢ్
|
10,583
|
277
|
10,860
|
7
|
చత్తీస్ గఢ్
|
3,08,551
|
9,829
|
3,18,380
|
8
|
దాద్రా-నాగర్ హవేలి
|
4,143
|
94
|
4,237
|
9
|
డామన్-డయ్యూ
|
1,480
|
94
|
1,574
|
10
|
ఢిల్లీ
|
2,28,911
|
7,651
|
2,36,562
|
11
|
గోవా
|
13,692
|
354
|
14,046
|
12
|
గుజరాత్
|
6,99,443
|
17,801
|
7,17,244
|
13
|
హర్యానా
|
2,01,675
|
8,009
|
2,09,684
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
87,499
|
4,306
|
91,805
|
15
|
జమ్మూ-కశ్మీర్
|
1,59,765
|
2,501
|
1,62,266
|
16
|
జార్ఖండ్
|
2,32,671
|
7,541
|
2,40,212
|
17
|
కర్నాటక
|
5,10,696
|
54,397
|
5,65,093
|
18
|
కేరళ
|
3,79,034
|
16,153
|
3,95,187
|
19
|
లద్దాఖ్
|
3,856
|
290
|
4,146
|
20
|
లక్షదీవులు
|
1,809
|
115
|
1,924
|
21
|
మధ్యప్రదేశ్
|
5,97,537
|
0
|
5,97,537
|
22
|
మహారాష్ట్ర
|
7,64,965
|
16,835
|
7,81,800
|
23
|
మణిపూర్
|
32,748
|
777
|
33,525
|
24
|
మేఘాలయ
|
21,221
|
470
|
21,691
|
25
|
మిజోరం
|
12,976
|
585
|
13,561
|
26
|
నాగాలాండ్
|
16,502
|
1,750
|
18,252
|
27
|
ఒడిశా
|
4,21,142
|
18,248
|
4,39,390
|
28
|
పుదుచ్చేరి
|
6,959
|
395
|
7,354
|
29
|
పంజాబ్
|
1,12,231
|
3,051
|
1,15,282
|
30
|
రాజస్థాన్
|
7,44,741
|
15,334
|
7,60,075
|
31
|
సిక్కిం
|
9,509
|
251
|
9,760
|
32
|
తమిళనాడు
|
2,95,338
|
14,039
|
3,09,377
|
33
|
తెలంగాణ
|
2,79,534
|
53,701
|
3,33,235
|
34
|
త్రిపుర
|
75,565
|
2,361
|
77,926
|
35
|
ఉత్తరప్రదేశ్
|
9,16,568
|
18,394
|
9,34,962
|
36
|
ఉత్తరాఖండ్
|
1,23,656
|
3,063
|
1,26,719
|
37
|
పశ్చిమ బెంగాల్
|
5,57,880
|
15,866
|
5,73,746
|
38
|
ఇతరములు
|
1,88,661
|
16,639
|
2,05,300
|
మొత్తం
|
90,53,061
|
3,69,167
|
94,22,228
|
టీకాల కార్యక్రమం మొదలైన 33వ రోజైన 2021 ఫిబ్రవరి 18న మొత్తం 4,22,998 మందికి 7,932 శిబిరాలలో టీకాలిచ్చారు. వారిలో 3,30,208 మంది మొదటి డోస్ తీసుకున్నవారు కాగా 92,790 మంది రెండో డోస్ తీసుకున్నావారు. రెండో డోస్ తీసుకున్నవారిలో 58.20% మంది కేవలం 7 రాష్టాలలో కేంద్రీకృతమై ఉన్నారు. కేవలం ఒక్క కర్నాటకలోనే 14.74% (54,397 డోసులు) తీసుకున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అది 1,06,56,845కు చేరింది. కోలుకున్న వారి శాతం 97.32% గా నమోదైంది. కోలుకున్నవారు పెరుగుతూ ఉండటం, మరణాలు తగ్గుముఖంపట్టటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 1,37,342 మంది కాగా వీరు మొత్తం పాజిటివ్ కేసులలో 1.25% మాత్రమే. 11,987 మంది కోవిడ్ బాధితులు గత 24 గంటలలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

గత 24 గంటలలో కొత్త పాజిటివ్ కేసుల విస్తరణ కూడా ఆశాజనకంగా ఉంది. గత 24 గంటలలో రెండు రాష్ట్రాలలో మాత్రమే 1000 కి మించి కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి.

గత 24 గంటలలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఢిల్లీ, ఒడిశా, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, లక్షదీవులు, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, లద్దాఖ్, నాగాలాండ్, మిజోరం, అండమాన్-నికొబార్ దీవులు, త్రిపురమ్ డయ్యూ-డామన్, దాద్రా-నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్

గత 24 గంటలలో ఒక రాష్ట్రం మాత్రమే 20 కంటే ఎక్కువ మరణాలు నమోదు చేసుకుంది.

రోజువారీ కొత్త పాజిటివ్ కేసులు కూడా గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 1న 1.89% ఉండగా నేటికి అది 1.69% కు తగ్గింది. .
కేరళ, మహారాష్ట్ర కలసి కొత్త కేసుల్లో 75% వాటా, కోలుకున్నవారిలో 72% మరణాలలో 55% పొందాయి. కొత్తగా కోలుకున్నవారిలో 85.14% ఆరు రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యారు. కేరళలో ఒక్క రోజులోనే 4,832 మంది కోలుకోగా మహారాష్ట్రలో 3,853 మంది, కర్నాటకలో 537 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో కొత్తగా 12,881 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.వాటిలో 86.61% ఆరు రాష్ట్రాలవే. కేరళలో అత్యధిక కేసులు రావటం కొనసాగుతోంది. అక్కడ గత 24 గంటల్లో 4,892 కేసులు రాగా మహారాష్ట్రలో 4,787, తమిళనాడులో 454 కేసులు వచ్చాయి.

గత 24 గంటలలో 101 మంది కోవిడ్ వల్ల మరణించారు. ఈ మరణాలలో 76.24% ఐదు రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్టలో అత్యధికంగా 40 మంది, ఆ తరువాత కేరళలో 16 మంది, పంజాబ్ లో 10 మంది చనిపోయారు.

****
(Release ID: 1699015)
|