ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 17న‌ నాస్‌కామ్ టెక్నాల‌జీ ఎండ్ లీడ‌ర్‌శిప్ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


Posted On: 15 FEB 2021 3:34PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాల‌జీ ఎండ్ లీడ‌ర్‌శిప్ ఫోర‌మ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధ‌వారం అంటే ఈ నెల 17న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల 30 నిముషాల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించ‌నున్నారు.

 

ఎన్‌టిఎల్ఎఫ్ గురించిన వివ‌రాలు

ఎన్‌టిఎల్ఎఫ్ 29వ స‌మ్మేళనాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సమ్మేళనం నేశన‌ల్ అసోసియేశన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ స‌ర్వీసెస్ కంపెనీస్ (ఎన్ఎఎస్ఎస్‌సిఒఎమ్) తాలూకు ప్ర‌ధాన కార్య‌క్ర‌మం. శేపింగ్ ద ఫ్యూచ‌ర్ టువార్డ్స్ ఎ బెట‌ర్ నార్మ‌ల్‌అనే అంశం ఈ సంవ‌త్స‌ర స‌మ్మేళనానికి ఇతివృత్తం గా ఉంది. ఈ స‌మ్మేళనం లో 30కి పైగా దేశాల కు చెందిన 1600 మంది ప్రతినిధులు పాలుపంచుకోనున్నారు. మూడు రోజులు కొనసాగే చ‌ర్చ‌ల లో 30కి పైగా ఉత్ప‌ాదనలను ప్ర‌ద‌ర్శించ‌డం జరుగుతుంది.

***


(Release ID: 1698191) Visitor Counter : 224