ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్సలో ఉన్నబాధితులు 5 వేల లోపు
18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల నమోదు సున్నా కోవిడ్ టీకాలు అందుకున్నవారి సంఖ్య దాదాపు 83 లక్షల మంది
Posted On:
15 FEB 2021 12:19PM by PIB Hyderabad
ప్రస్తుతం భారతదేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,39,637 కి తగ్గింది. ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్ గా తేలినవారిలో 1.28% మాత్రమే. గత 24 గంటలలో 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 5,000 మందికి లోపే చికిత్స పొందుతూ ఉన్నారు. త్రిపుర, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి లో ప్రస్తుతం ఇద్దరేసి మాత్రమే కోవిడ్ చికిత్సలో ఉన్నారు.
కేరళ, మహారాష్ట్ర, కర్నాటక రాష్టాలలోనే మొత్తం చికిత్సలో ఉన్నవారిలో 76.5% మంది ఉన్నారు. అందులోనూ కేరళ, మహారాష్ట్ర కలిపి ఆ మొత్తంలో 74.72% కేసులు ఉన్నాయి.
గత 24 గంటలలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. ఇవి: అస్సాం, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మణిపూర్, నాగాలాండ్, లక్షదీవులు, మేఘాలయ, సిక్కిం, అండమాన్, నికోబార్ దీవులు, లద్దాఖ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, దాద్రా-నాగర్ హవేలి, డామన్- డయ్యూ
గతవారమంతా ఒక్క మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 10 ఉన్నాయి. అవి: అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూ, దాద్రా- నాగర్ హవేలి, లద్దాఖ్, లక్షదీవులు, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర
2021 ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 8 గంటలకు మొత్తం టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కలిపి దాదాపు 83 లక్షలకు చేరింది.
ఉదయం 8 గంటలకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం 1,73,729 శిబిరాల ద్వారా మొత్తం 82,85,295 మంది టీకాలు తీసుకున్నారు. వీరిలో 59,88,113 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా 24,561మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, మొదటి డోస్ మాత్రమే ఎంచుకున్న కోవిడ్ యోధులు 22,72,621 మంది ఉన్నారు. రెండో డోస్ కోవిడ్ ఈనెల 13న మొదలు కాగా, మొదటి డోస్ తీసుకున్నవారిలో 28 రోజులు నిండినవారికి రెండో డోస్ ఇవ్వటం మొదలైంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
డోసులు
|
|
1వ డోస్
|
2వ డోస్
|
మొత్తం డోసులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
3,646
|
0
|
3,646
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3,56,521
|
5,820
|
3,62,341
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
15,633
|
461
|
16,094
|
4
|
అస్సాం
|
1,27,658
|
2,215
|
1,29,873
|
5
|
బీహార్
|
4,92,152
|
0
|
4,92,152
|
6
|
చండీగఢ్
|
8,660
|
143
|
8,803
|
7
|
చత్తీస్ గఢ్
|
2,62,092
|
895
|
2,62,987
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
2,922
|
41
|
2,963
|
9
|
డామన్, డయ్యూ
|
1,121
|
30
|
1,151
|
10
|
ఢిల్లీ
|
1,89,351
|
1,856
|
1,91,207
|
11
|
గోవా
|
13,166
|
517
|
13,683
|
12
|
గుజరాత్
|
6,83,903
|
0
|
6,83,903
|
13
|
హర్యానా
|
1,95,764
|
588
|
1,96,352
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
81,482
|
475
|
81,957
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1,28,822
|
807
|
1,29,629
|
16
|
జార్ఖండ్
|
2,06,182
|
2,209
|
2,08,391
|
17
|
కర్నాటక
|
4,96,234
|
0
|
4,96,234
|
18
|
కేరళ
|
3,58,529
|
46
|
3,58,575
|
19
|
లద్దాఖ్
|
2,904
|
77
|
2,981
|
20
|
లక్షదీవులు
|
1,776
|
0
|
1,776
|
21
|
మధ్యప్రదేశ్
|
5,57,105
|
0
|
5,57,105
|
22
|
మహారాష్ట్ర
|
6,82,744
|
189
|
6,82,933
|
23
|
మణిపూర్
|
22,726
|
169
|
22,895
|
24
|
మేఘాలయ
|
13,998
|
91
|
14,089
|
25
|
మిజోరం
|
11,680
|
74
|
11,754
|
26
|
నాగాలాండ్
|
9,695
|
123
|
9,818
|
27
|
ఒడిశా
|
4,12,046
|
0
|
4,12,046
|
28
|
పుదుచ్చేరి
|
5,953
|
71
|
6,024
|
29
|
పంజాబ్
|
1,03,799
|
59
|
1,03,858
|
30
|
రాజస్థాన్
|
6,10,088
|
0
|
6,10,088
|
31
|
సిక్కిం
|
8,335
|
0
|
8,335
|
32
|
తమిళనాడు
|
2,46,420
|
1,154
|
2,47,574
|
33
|
తెలంగాణ
|
2,78,915
|
3,273
|
2,82,188
|
34
|
త్రిపుర
|
69,196
|
366
|
69,562
|
35
|
ఉత్తరప్రదేశ్
|
8,58,602
|
0
|
8,58,602
|
36
|
ఉత్తరాఖండ్
|
1,10,326
|
0
|
1,10,326
|
37
|
పశ్చిమ బెంగాల్
|
5,14,570
|
2,382
|
5,16,952
|
38
|
ఇతరములు
|
1,16,018
|
430
|
1,16,448
|
|
మొత్తం
|
82,60,734
|
24,561
|
82,85,295
|
టీకాలు ప్రారంభమైన 30వరోజు ( ఫిబ్రవరి14) నాడు 21,437మందికి 877 శిబిరాలలో టీకాలు వేశారు. వారిలో 20,504 మంది మొదటి డోస్ తీసుకున్నవారు కాగా, 933 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నవారున్నారు. దేశంలో రోజురోజుకూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా టీకాలు వేయించుకున్నవారిలో 69% మంది 10 రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే 8,58,602 మంది టీకా లబ్ధిదారులతో 10.4% వాటా పొందింది.
భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య ఈ రోజుకు 1,06,21,220 కు చేరింది. కోలుకున్నవారి శాతం 97.29% అయింది. గత 24 గంటలలో 9,489 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో కోలుకున్నవారిలో 79.5% మంది ఆరు రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక రోజులో 4,692 మంది (50%) కోలుకోగా, మహారాష్ట్రలో 1,355 మంది, కర్నాటకలో 486 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో కొత్తగా 11,649 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీరిలో 86.4% మంది ఆరు రాష్టాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా ఒక రోజులో 4,612 కేసులు రాగా మహారాష్ట్రలో 4,092 మంది, తమిళనాడులో 470 మంది నమోదయ్యారు.
గత 24 గంటలలో 90 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీరిలో 80% మంది కేవలం ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 40 మంది (44.44%) చనిపోగా, కేరళలో 15 మంది, తమిళనాడులో ఆరుగురు చనిపోయారు.
******
(Release ID: 1698086)
|