ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మరణాల సంఖ్య తగ్గుముఖం, వరుసగా 10 రోజులుగా రోజువారీ మరణాలు 150 లోపే

గత 24 గంటలలో మరణాలే నమోదు కాని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లొ చికిత్సలో ఉన్నవారు 5 వేల లోపే
ఇప్పటిదాకా కోవిడ్ టీకా లబ్ధిదారులు 58 లక్షలు, ప్రపంచంలో మూడో స్థానం

Posted On: 08 FEB 2021 11:06AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా 10 రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య  150 లోపే ఉంటోంది. గత 24 గంటలలో నమొదైన మరణాలు 84 మాత్రమే. సకాలంలో కోవిడ్ బాధితుల ఆనవాలు గుర్తించి,

నిర్థారణ పరీక్షలు జరిపి తీవ్రతను బట్టి ఆస్పత్రికి తరలించటమో, హోమ్ క్వారంటైన్ లో ఉంచటమో చేయటం ద్వారా మరణాల సంఖ్యను అదుపు చేయగలిగారు. అదే విధంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

 

కోవిడ్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సంబంధ మరణాల తగ్గింపు మీద దృష్టి పెడుతూనే ఇతర చికిత్సలు కూడా కొనసాగిస్తూ, అన్ని రకాల వైద్య సేవలూ అందుబాటులో ఉంచింది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు తోడుగా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

తగిన విధంగా ఉమ్మడి కృషి జరిపాయి. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: అందమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నాగర్ హవేలి, డామన్-డయ్యూ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం,

నాగాలాండ్,  లక్షదీవులు, లద్దాఖ్, సిక్కిం, రాజస్థాన్, మేఘాలయ, మధ్య ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం. దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య మరింత తగ్గి  గత 24 గంటలలో 1,48,609 కి చేరింది. ఇది మొత్తం

పాజిటివ్ కేసులలో కేవలం 1.37% మాత్రమే.  గత 24 గంటలలో తాజాగా 11,831 కొత్త కొవిడ్ పాజిటివ్ కెసులు నిర్థారణ కాగా  11,904 మంది కోలుకున్నారు. చికిత్సలో ఉన్నవారిలో 81% మంది కేవలం ఐదు రాష్ట్రాలకు చెందినవారే. కేరళలో మహారాష్ట్రలో

కలిసి మొత్తం 70% మంది ఉన్నారు.

 

33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలొ చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 5,000 లోపు ఉన్నారు.

జాతీయ స్థాయిలో కనబడుతున్న ధోరణికి అనుగుణంగా  రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా  చికిత్సలో ఉన్నవారి సంఖ్య తక్కువగా కనబరుస్తున్నాయి. మహారాష్ట్రలో చికిత్సలో ఉన్నకేసులు పెద్ద ఎత్తున తగ్గుతూ ఉండగా, ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది.

 

 

టీకాలు ప్రారంభమైన 24 వరోజున 2021 ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటలకు  58,12,362 మంది టీకాల లబ్ధిదారులున్నారు.

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

3,397

2

ఆంధ్ర ప్రదేశ్  

2,99,649

3

అరుణాచల్ ప్రదేశ్

12,346

4

అస్సాం

88,585

5

బీహార్

3,80,229

6

చండీగఢ్

5,645

7

చత్తీస్ గఢ్

1,68,881

8

దాద్రా, నాగర్ హవేలి

1,504

9

డామన్, డయ్యూ

708

10

ఢిల్లీ

1,09,589

11

గోవా

8,257

12

గుజరాత్

4,51,002

13

హర్యానా

1,39,129

14

హిమాచల్ ప్రదేశ్

54,573

15

జమ్మూ, కశ్మీర్

49,419

16

జార్ఖండ్

1,06,577

17

కర్నాటక

3,88,769

18

కేరళ

2,92,342

19

లద్దాఖ్

1,987

20

లక్షదీవులు

839

21

మధ్యప్రదేశ్

3,42,016

22

మహారాష్ట్ర

4,73,480

23

మణిపూర్

8,334

24

మేఘాలయ

6,859

25

మిజోరం

10,937

26

నాగాలాండ్

4,535

27

ఒడిశా

2,76,323

28

పుదుచ్చేరి

3,532

29

పంజాబ్

76,430

30

రాజస్థాన్

4,60,994

31

సిక్కిం

5,372

32

తమిళనాడు

1,66,408

33

తెలంగాణ

2,09,104

34

త్రిపుర

40,405

35

ఉత్తరప్రదేశ్

6,73,542

36

ఉత్తరాఖండ్

74,607

37

పశ్చిమ బెంగాల్

3,54,000

38

ఇతరములు

62,057

                      మొత్తం

58,12,362

 

గత 24 గంటలలో మొత్త  1304 శిబిరాలలో 36,804 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు

1,16,487 శిబిరాలు నిర్వహించారు.రోజూ టీకాలు వేయించుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

 

 

ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,05,34,505 కి చేరుకోగా,  కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా 10,385,896 కి చేరింది. కోలుకున్నవారి శాతం 97.20%. కొత్తగా కోలుకున్నవారిలో 80.53% మంది 6 రాష్ట్రాలకు చెందినవారే.

ఉన్నారు. కేరళలో అత్యధికంగా 5,948, మహారాష్ట్రలో 1,622 మంది, ఉత్తరప్రదేశ్ లో 670 మంది కోలుకున్నారు.

 

రోజువారీ కొత్త కేసులు కేరళలో అత్యధికంగా ఒక్కరోజులోనే 6,075 నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర

2,673, కర్నాటకలో 487 కొత్త కేసులు వచ్చాయి.

గత 24 గంటలలో 84 మంది కోవిడ్ బాధితులు మరణించారు. ఆరు రాష్ట్రాల్లోనే గత 24 గం టల్లో 79.76% మంది

చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 30 మంది మరణించగా, కేరళలో 19 మరణాలు నమోదయ్యాయి. 

                     

 

                                        

***                                                                                  


(Release ID: 1696136) Visitor Counter : 211