ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అత్యంత వేగంగా 18 రోజుల్లో 40 లక్షల టీకాలకు చేరిన భారత్
మొత్తం కోవిడ్ కేసుల్లో చికిత్సలో ఉన్నవారు 1.5 శాతానికి తగ్గుదల
గత 24 గంటల్లో ఒక్క మరణమూ నమోదు కాని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
Posted On:
03 FEB 2021 11:38AM by PIB Hyderabad
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మీద పోరులో భారత్ అనేక మైలురాళ్ళు అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. టీకాలు ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే 40 లక్షల టీకాలు పూర్తి చేయటం కూడా ఒక రికార్డు. భారత్ దీన్ని కేవలం 18 రోజుల్లో సాధించగలిగింది.
ప్రజలకు టీకాలు ఇవ్వటంలో భారతదేశం 2021 ఫిబ్రవరి 1 నాటికి అంతర్జాతీయంగా మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా ఉంది. ఇదే వేగాన్ని భారత్ కొనసాగిస్తోంది.
మిగిలిన అంశాల్లో కూడా భారత్ కోవిడ్ మీద తన యుద్ధాన్ని ప్రకటించింది. గత 24 గంటలలో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా, నాగర్ హవేలి, డయ్యూ డామన్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, లక్షదీవులు, లద్దాఖ్, సిక్కిం, మణిపూర్, పుదుచ్చేరి, గోవా, ఒడిశా, అస్సాం. కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం, మరణాలు బాగా తగ్గుముఖం పట్టటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గింది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 1,60,057 కి తగ్గింది. మొత్తం కేసుల్లోంచి వారి వాటా 1.49 శాతానికి చేరింది.
గత 24 గంటలలో కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారి సంఖ్య 11,039 కాగా కొత్తగా కోలుకున్నవారిసంఖ్య 14,225. దీంతో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3,296 తగ్గింది. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,62,631. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 97.08% కావటం అంతర్జాతీయంగా అత్యధికం. చికిత్సలో ఉన్నవారికీ, కొలుకున్నవారికీ మధ్య తేడా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 1,03,02,574. అయింది. 31 రాష్టాలు, కేండ్ర పాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5,000 కంటే తక్కువ నమోదయ్యాయి.
8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారపు సగటు పాజిటివ్ నిష్పత్తి జాతీయ సగటు 1.91% కంటే ఎక్కువ ఉంది. కేరళలో అత్యధికంగా 12% నమోదుకాగా చత్తీస్ గఢ్ లో 7% నమోదైంది.
2021 ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 8 గంటలకు 41 లక్షలకు పైగా (41,38,918) లబ్ధిదారులు కోవిడ్ టీకాలు వేయించుకున్నారు.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,727
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1,87,252
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
9,791
|
4
|
ఆస్సాం
|
42,435
|
5
|
బీహార్
|
2,22,153
|
6
|
చండీగఢ్
|
4,019
|
7
|
చత్తీస్ గఢ్
|
79,676
|
8
|
దాద్రా నాగర్ హవేలి
|
867
|
9
|
డామన్, డయ్యూ
|
469
|
10
|
ఢిల్లీ
|
74,068
|
11
|
గోవా
|
5,422
|
12
|
గుజరాత్
|
2,87,852
|
13
|
హర్యానా
|
1,27,893
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
39,570
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
26,634
|
16
|
జార్ఖండ్
|
55,671
|
17
|
కర్నాటక
|
3,16,368
|
18
|
కేరళ
|
2,24,846
|
19
|
లద్దాఖ్
|
1,234
|
20
|
లక్షదీవులు
|
807
|
21
|
మధ్య ప్రదేశ్
|
2,98,376
|
22
|
మహారాష్ట్ర
|
3,18,744
|
23
|
మణిపూర్
|
4,739
|
24
|
మేఘాలయ
|
4,694
|
25
|
మిజోరం
|
9,932
|
26
|
నాగాలాండ్
|
4,093
|
27
|
ఒడిశా
|
2,08,205
|
28
|
పుదుచ్చేరి
|
3,077
|
29
|
పంజాబ్
|
61,381
|
30
|
రాజస్థాన్
|
3,39,218
|
31
|
సిక్కిం
|
2,647
|
32
|
తమిళనాడు
|
1,20,745
|
33
|
తెలంగాణ
|
1,70,043
|
34
|
త్రిపుర
|
32,196
|
35
|
ఉత్తరప్రదేశ్
|
4,63,793
|
36
|
ఉత్తరాఖండ్
|
43,430
|
37
|
పశ్చిమ బెంగాల్
|
2,88,245
|
38
|
ఇతరములు
|
55,606
|
మొత్తం
|
41,38,918
|
గత 24 గంటలలో 1,88,762 మంది ఆరోగ్య సిబ్బంది 3845 శిబిరాలలో టీకాలు వేయించుకున్నారు. ఇప్పటిదాకా 76,576 కోవిడ్ టీకా శిబిరాలు నిర్వహించారు. టీకాల లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 85.62% మంది కేవలం 8 రాష్టాలకు చెందినవారే. కేరళలో అత్యధికంగా 5747 కేసులు రాగా మహారాష్ట్రలో 4011, తమిళనాడు లో 521 నమోదయ్యాయి.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 83.01% కేవలం 6 రాష్ట్రాలకు చెందినవే. కేరళలో అత్యధికంగా 5,716 కేసులు రాగా మహారాష్ట్రలో 1,927, తమిళనాడులో 510 నమోదయ్యాయి.
గత 24 గంటలలో 110 కోవిడ్ మరణాలు నమొదయ్యాయి. ఇందులో 66.35% ఐదు రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న 30 మంది మరణించగా, ఆ తరువాత స్థానంలో కేరళ (16) ఉంది.
***
(Release ID: 1694752)
Visitor Counter : 245
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam