ఆర్థిక మంత్రిత్వ శాఖ
జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కోసం నిధులను పెంచడానికి ప్రభుత్వం
జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కోసం నిధులను పెంచడానికి ప్రభుత్వంఅభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్ ఐ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
డెవలప్ మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ నుంచి రూ. 20,000 కోట్లప్రయోజనం
విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులద్వారా ఇన్విక్ట్ మరియు రైత్యొక్క రుణాలకు ఆర్థిక సాయం చేయడం కొరకు సంబంధిత చట్టాలకు తగిన సవరణలు చేయబడతాయి.
పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆస్థుల యొక్క మోనిటైజేషన్ కొరకు నేషనల్మోనిటైజేషన్ పైప్ లైన్ లాంఛ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది
Posted On:
01 FEB 2021 1:45PM by PIB Hyderabad
నవ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు కోసం వినియోగానికి వీలున్న ప్రభుత్వ మౌలిక సదుపాయ ఆస్తుల ద్రవ్యీకరణ చాలా ముఖ్యం. ఆ మేరకు సద్వినియోగం చేసుకునే వీలున్న మౌలిక వసతుల ఆస్తులను వాడుకునే దిశగా ‘‘జాతీయ ద్రవ్యీకరణ సమాహారం’’ (ఎన్ఎంపీ) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే దీని పనితీరు ప్రగతిపై పర్యవేక్షణతోపాటు పెట్టుడిదారులకు మార్గదర్శనం కోసం ‘ఆస్తుల ద్రవ్యీకరణ డాష్ బోర్డు’ను ఏర్పాటు చేస్తుంది. ఈ దిశగా కొన్ని ముఖ్యమైన చర్యలు కిందివిధంగా ఉంటాయి:
అ. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) చెరొక మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ (InvIT-ఇన్విట్)ను ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కృషి చేస్తాయి. ఆ మేరకు ప్రస్తుతంనిర్వహణలోగల రూ.5,000 కోట్ల అంచనా వాణిజ్య విలువగల ఐదు రహదారులు ‘ఎన్‌హెచ్ఏఐ-ఇన్విట్’కు, అలాగే రూ.7,000 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా ఆస్తులు ‘పీజీసీఐఎల్-ఇన్విట్’కు బదిలీ చేయబడతాయి.
ఆ. ఇదే తరహాలో ‘ప్రత్యేక సరకు రవాణా రైలుమార్గాలు’ పూర్తిచేయడంతోపాటు వాటి నిర్వహణ, కార్యకలాపాల ద్వారా సదరు ఆస్తుల ద్రవ్యీకరణ బాధ్యతను రైల్వేలు స్వీకరిస్తాయి.
ఇ. అలాగే తదుపరి దశలో కార్యకలాపాలు, నిర్వహణ రాయితీల కోసం విమానాశ్రయాల ద్రవ్యీకరణ సాగుతుంది.
ఈ. ఆస్తుల ద్రవ్యీకరణ కార్యక్రమం కోసం కేటాయించే ప్రధాన మౌలిక సదుపాయాల ఆస్తుల జాబితాలో- (i) ‘ఎన్‌హెచ్ఏఐ’ టోల్ రహదారులు (ii) ‘పీజీసీఐఎల్’ విద్యుత్ సరఫరా ఆస్తులు (iii) ‘గెయిల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్’కు చెందిన గ్యాస్ పైప్‌లైన్‌లు (iv) ఏఏఐ పరిధిలోగల 2వ, 3వ అంచె నగరాల్లోని విమానాశ్రయాలు (v) ఇతర రైల్వే మౌలిక సదుపాయాల ఆస్తులు (vi) కేంద్ర గిడ్డంగుల సంస్థ, నాఫెడ్ తదితర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకుగల గోదాము సంబంధిత ఆస్తులు (vii) క్రీడా మైదానాలు వంటివి ఉన్నాయి.
****
(Release ID: 1694250)
Visitor Counter : 356