ఆర్థిక మంత్రిత్వ శాఖ

రైల్వేలకు రూ.1,10,055 కోట్లు కేటాయించగా అందులో రూ.1,07,100 కోట్లుమూలధన పెట్టుబడికోసం కేటాయించారు.

2030 నాటికి భారతీయ రైల్వే వ్యవస్థ భవిష్యత్ అవసరాలను తీర్చేవిధంగాజాతీయ రైల్వే ప్రణాళిక

వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డిఎఫ్ సి) మరియు ఈస్టర్న్డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ 2022 జూన్ నాటికి ప్రారంభించబడుతుంది.

భవిష్యత్తులో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను విస్తరించేందుకుప్రణాళికలు - ఇది ఈస్ట్ కోస్టల్ కారిడార్, ఈస్ట్-వెస్ట్ కారిడార్ మరియు నార్త్ సౌత్కారిడార్ ను ప్రారంభం.

గరిష్ట విస్టా డోమ్ ఎల్‌హెచ్‌బి  రైలు కోచ్ పర్యాటక రైలు మార్గాల్లో ప్రోత్సహం

అధిక రద్దీ కలిగిన రైల్వే రూట్లలో నడిచే రైళ్లకు, మరింత ఎక్కువగాఉపయోగించే రూట్లకు స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ అభివృద్ధి

Posted On: 01 FEB 2021 1:49PM by PIB Hyderabad

 

   భారతీయ రైల్వేలు ‘‘భారత జాతీయ రైలు ప్రణాళిక-2030’’ను రూపొందించాయి. దేశంలో 2030కల్లా ‘‘భవిష్యత్ సంసిద్ధ’’ రైల్వే వ్యవస్థ రూపకల్పనే ఈ ప్రణాళిక లక్ష్యం. ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’కు తగినట్లుగా పారిశ్రామిక రంగానికి రవాణా వ్యయం తగ్గించడమే ఈ ప్రణాళికలో ప్రధాన వ్యూహం. మరోవైపు 2022 జూన్ నాటికి పశ్చిమ, తూర్పు ‘ప్రత్యేక సరకు రవాణా మార్గాలు’ (డీఎఫ్‌సీ) ప్రారంభం కాగలవని అంచనా.

 

railway.jpg

   ఇక ప్రయాణికుల సదుపాయాలు, భద్రత దిశగా కింది చర్యలు ప్రతిపాదించబడ్డాయి:

అ. పర్యాటకులకు మెరుగైన ప్రయాణానుభవం కోసం సుందరంగా రూపొందించిన ‘విస్టా డోమ్ ఎల్‌హెచ్‌బీ’ బోగీలను ప్రవేశపెట్టడం

ఆ. రైల్వేశాఖ తీసుకున్న భద్రత చర్యలు కొన్నేళ్లుగా సత్ఫలితాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత పటిష్ఠం చేసేదిశగా అధిక సాంద్రత, అధిక వినియోగంలోగల రైళ్ల రాకపోకల నెట్‌వ‌ర్క్‌ పరిధిలో మానవ తప్పిదం వల్ల రైళ్లు ఢీకొనే ముప్పు నివారణకు చర్యలు చేపడుతుంది. ఈ మేరకు దేశీయంగా అభివృద్ధి చేసిన స్వయంచాలక రక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.

ఇ. ప్రస్తుత కేంద్ర బ‌డ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.1,10,055 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించబడింది.


(Release ID: 1694247) Visitor Counter : 310