ఆర్థిక మంత్రిత్వ శాఖ
పెట్రోలియం మరియు సహజ వాయువు రంగంలో కీలక కార్యక్రమాలు
1 కోటి మంది లబ్ధిదారులకు ఉజ్వల పథకం
జమ్మూ కాశ్మీర్ లో గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంది.
స్వతంత్ర గ్యాస్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ఆపరేటర్ ఏర్పాటు
Posted On:
01 FEB 2021 1:52PM by PIB Hyderabad
కోవిడ్-19 దిగ్బంధం సమయంలో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగిపోయేలా ప్రభుత్వం కృతకృత్యమైందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. ప్రజా జీవనంలో ఈ రంగం ఎంతో కీలకమైనందున కింద పేర్కొన్న కీలక చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు:
అ. నేడు 8 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందిన ‘ఉజ్వల’ పథకాన్ని కోటిమందికి విస్తరణ
ఆ. రాబోయే మూడేళ్లలో నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ మరో 100 జిల్లాలకు విస్తరణ
ఇ. కేంద్రపాలిత జమ్ముకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతుంది.
ఈ. వివక్షకు తావులేని సార్వత్రిక లభ్యత ప్రాతిపదికన అన్ని సహజవాయు పైప్‌లైన్ల పరిధిలో సాధారణ రవాణా సామర్థ్యం బుకింగుకు సౌలభ్యం, సమన్వయం కోసం స్వతంత్ర గ్యాస్ రవాణా వ్యవస్థ నిర్వహణ సంస్థ ఏర్పాటు చేయబడుతుంది.

***
(Release ID: 1694211)
Visitor Counter : 306
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam