ఆర్థిక మంత్రిత్వ శాఖ

నాణ్యమైన విద్య కోసం 15 వేల పాఠశాలలను జాతీయ విద్యా విధానం కిందఅన్ని అంశాలలో చేర్చాలని బడ్జెట్ ప్రతిపాదించింది

స్వచ్చంధ సంస్థలు / ప్రైవేట్ పాఠశాలలు / రాష్ట్రాల భాగస్వామ్యంతో 100కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పాటు చేయబడతాయి

భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రమాణాలు, గుర్తింపు, నియంత్రణ, నిధుల తయారీవంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది.

లడక్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు

Posted On: 01 FEB 2021 1:43PM by PIB Hyderabad


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానానికి (ఎన్‌ఈపీ) మంచి ఆదరణ లభించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎన్‌ఈపీలోని అన్ని అంశాలను చేర్చడానికి 15 వేలకు పైగా పాఠశాలలు నాణ్యతతో బలోపేతం అవుతాయని చెప్పారు. ఎన్జీవోలు/ప్రైవేటు పాఠశాలలు/రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రామాణాల ఏర్పాటు, గుర్తింపు, క్రమబద్ధీకరణ, నిధుల కోసం నాలుగు విభాగాలతో కూడిన అత్యున్నత సంస్థగా 'భారత ఉన్నత విద్య కమిషన్‌'ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. లద్దాఖ్‌లోని వారికి ఉన్నత విద్య అందేలా, లేహ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.

 

education.jpg

***


(Release ID: 1694149) Visitor Counter : 272