ఆర్థిక మంత్రిత్వ శాఖ
పింఛను, వడ్డీ రూపేణా ఆదాయం అందుకొంటున్న 75 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్ లకు పన్ను రిటర్ను దాఖలు చేయకుండా మినహాయింపు ఇవ్వడమైంది
తక్కువ ఖర్చు తో కూడిన గృహ నిర్మాణానికి, అద్దె ఇళ్ళ కు మరింత అండదండలు
వివాదాల పరిష్కారానికి వ్యక్తిగత హాజరు అక్కరలేని విధం గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది
మౌలిక సదుపాయల రంగం లో విదేశీ పెట్టుబడిని ఆకర్షించడం కోసం పన్నుల సంబంధిత సడలింపులు
అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్) కు పన్నుల సంబంధిత ప్రోత్సహకాలను బడ్జెటు లో ప్రకటించడమైంది
రిటర్ను పత్రాలను దాఖలు చేసే వారి సంఖ్య 6 సంవత్సరాల కాలం లో 3.31 కోట్ల నుంచి 6.48 కోట్ల కు పెరిగింది
Posted On:
01 FEB 2021 1:37PM by PIB Hyderabad
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ సోమవారం పార్లమెంటు లో ప్రవేశపెట్టిన 2021-22 కేంద్ర బడ్జెటు పన్నుల సంబంధిత పరిపాలన ను, వ్యాజ్యాల నిర్వహణ ను మరింత గా సరళం చేయాలని సంకల్పించడమే కాకుండా ప్రత్యక్ష పన్నుల పరిపాలన తాలూకు నియమావళి ని అనుసరించడాన్ని కూడా సులభతరం చేయాలని తలపెట్టింది.
ఆర్థిక మంత్రి బడ్జెటు ప్రసంగం లో సీనియర్ సిటిజన్ లకు ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు లో ఉపశమనాన్ని కల్పించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ కు గల కాల పరిమితి ని తగ్గించారు. వివాదాల పరిష్కారానికి ఒక సంఘాన్ని (డిస్ ప్యూట్ రెజల్యూశన్ కమిటీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత హాజరు అవసరం ఎదురవనటువంటి (ఫేస్ లెస్) ఐటిఎటి, ప్రవాసి భారతీయుల కు మినహాయింపు, ఆడిట్ నుంచి మినహాయింపు పరిమితి లో పెంపుదల.. వీటికి అదనం గా డివిడెండు రూపేణా ఆర్జించే ఆదాయానికి రాయితీ ని కూడా మంత్రి ప్రకటించారు. అలాగే, మౌలిక సదుపాయాల రంగం లోకి విదేశీ పెట్టుబడి ని ఆకర్షించడానికి కొన్ని చర్యలను కూడా ఆమె వెల్లడించారు. దీనితో పాటు, తక్కువ ఖర్చు కలిగి ఉండే గృహ నిర్మాణానికి సంబంధించి, కిరాయి ఇళ్ళకు మరికొన్ని రాయితీలను, ఐఎఫ్ఎస్‌సి కి పన్నుల సంబంధిత ప్రోత్సహకాలను, చిన్న చారిటబుల్ ట్రస్టులకు రాయితీ లు, దేశం లో అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)కు ప్రోత్సాహకరం గా ఉండే చర్యలను కూడా ఆమె ప్రకటించారు.
మహమ్మారి అనంతర కాలం లో ఒక నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవిస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, ఆ వ్యవస్థ లో భారతదేశానికి ఒక ప్రముఖ పాత్ర ఉండబోతోందని శ్రీమతి నిర్మల సీతారమణ్ తన బడ్జెటు ప్రసంగం లో పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో మన పన్నుల సంబంధిత వ్యవస్థ పారదర్శకమమైందిగాను, ప్రభావవంతమైందిగాను ఉండక తప్పదని, అంతేకాకుండా దేశం లో పెట్టుబడులను, ఉద్యోగాలను ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉందని ఆమె అన్నారు. అదే సమయం లో బడ్జెటు మన పన్ను చెల్లింపుదారుల పై కనీస భారాన్ని వేసేది గా ఉండాలని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థ హితం కోసం, పన్ను చెల్లింపుదారుల హితం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని, వాటిలో కార్పొరేట్ పన్ను రేటు ను తగ్గించడం, డివిడెండ్ డిస్ట్రిబ్యూశన్ టాక్స్ ను రద్దు చేయడం, చిన్న పన్ను చెల్లింపుదారులకు రిబేటు ను పెంచడం వంటివి భాగంగా ఉన్నాయని మంత్రి వివరించారు. ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేసిన వారి సంఖ్య 2014వ సంవత్సరంలో 3.31 కోట్లుగా ఉండగా, 2020వ సంవత్సరం లో ఈ సంఖ్య ఆకస్మికం గా పెరిగిపోయి 6.48 కోట్లకు చేరుకొందని ఆమె తెలిపారు.
సీనియర్ సిటిజన్ లకు ఊరట
స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం ఇది 75వ సంవత్సరం కావడం తో, ఈ బడ్జెటు 75 సంవత్సరాల వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్ లకు, అంతకంటే ఎక్కువ వయస్సు వారికి పన్నులకు సంబంధించినంత వరకు నియమాల పాలన తాలూకు భారాన్ని తగ్గించాలని సంకల్పించింది. పింఛను, వడ్డీ రూపేణా ఆదాయం మాత్రమే ఉన్నటువంటి ఈ కోవకు చెందిన సీనియర్ సిటిజన్ లను వారు ఆదాయపు పన్ను రిటర్ను ను సమర్పించడం నుంచి మినహాయించడం జరుగుతుంది. వారికి చెల్లింపులను జరిపే బ్యాంకు వారి ఆదాయంపై పన్ను ను తగ్గించి మిగతా డబ్బు ను బదలాయిస్తుంది.
ప్రవాసి భారతీయులకు పన్ను సంబంధి సడలింపు మరియు డివిడెండ్ లో రాయితీ
స్వదేశానికి తిరిగి వచ్చే ప్రవాసి భారతీయులకు ఆదాయపు పన్ను తో ముడిపడ్డ కఠిన మైన నిబంధనలను సరళతరం చేస్తూను, వారు విదేశాలలో ఉద్యోగవిరమణ చేసిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయానికి సంబంధించిన అంశాలను తేలికగా పరిష్కరించడం కోసం సరళమైన నియమాలను అమలు చేయడం గురించి బడ్జెటు లో ప్రస్తావించడం జరిగింది. విదేశీ రిటైర్మెంట్ ఖాతాలో జమ అయిన ఆదాయాల విషయంలో ఇది వర్తించనుంది. అంతేకాకుండా, ఆర్ఇఐటి/ఐఎన్‌విఐటి (REIT/InvIT) లకు చెల్లించే డివిడెండు ను టిడిఎస్ నుంచి మినహాయించాలని కూడా ప్రతిపాదించడం జరిగింది. విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ ల విషయానికి వస్తే డివిడెండ్ రూపేణా ఆర్జించిన ఆదాయం పై పన్ను మినహాయింపును లోయర్ ట్రీటీ రేటు ప్రకారం తగ్గించాలని కూడా బడ్జెటు లో ప్రతిపాదించడమైంది. డివిడెండు రూపేణా ఆదాయం తాలూకు అడ్వాన్స్ డ్ ట్యాక్స్ లయబిలిటీ ని డెక్లరేశన్ తరువాత గానీ, లేదా డివిడెండ్ చెల్లింపు తరువాత గానీ వర్తింప చేసేటట్లుగా బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. డివిడెండ్ రూపేణా ఆదాయాన్ని శేర్ హోల్డర్ లు సరైన విధంగా అంచనా వేయడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఈ మేరకు ప్రతిపాదించడమైందని మంత్రి చెప్పారు.
తక్కువ వ్యయం తో కూడిన ఇళ్ళ నిర్మాణం/ అద్దె ఇళ్ళు
తక్కువ ఖర్చు తో కూడిన ఇంటి ని కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణం పై వడ్డీ లో 1.5 లక్షల రూపాయల వరకు తగ్గింపు క్లెయిము కోసం అర్హత కాలాన్ని 2022వ సంవత్సరం మార్చి నెల 31 వరకు పొడిగించడం జరుగుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. తక్కువ ఖర్చు లో రూపుదిద్దుకొనే ఇళ్ళ సరఫరా ను పెంచడం కోసం మంత్రి ఆ తరహా ప్రాజెక్టులకు పన్ను విరామాన్ని క్లెయిము చేసుకొనే అర్హత కాల పరిమితి ని మరొక సంవత్సరం పాటు, అంటే 2022 మార్చి నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. ప్రవాసి శ్రామికుల కు తక్కువ అద్దె తో ఇళ్ళ లభ్యత ను ప్రోత్సహించడానికి గాను నోటిఫై చేసినటువంటి అఫార్డబుల్ రెంటల్ హౌసింగ్ పథకాలకంటూ ఒక కొత్త పన్ను మినహాయింపు ను మంత్రి ప్రకటించారు.
స్టార్ట్-అప్ లకు పన్నుల సంబంధిత ప్రయోజనాలు
దేశం లో అంకుర సంస్థలను (స్టార్ట్-అప్స్) ప్రోత్సహించడం కోసం శ్రీమతి నిర్మల సీతారమణ్ స్టార్ట్-అప్స్ కు పన్ను విరామాన్ని (ట్యాక్స్ హాలిడే) ను క్లెయిము చేసేందుకు అర్హత ను మరొక సంవత్సర కాలం పాటు- అంటే 2022వ సంవత్సరం మార్చి నెల 31 తేదీ వరకు - పొడిగించినట్లు ప్రకటించారు. స్టార్ట్-అప్ లకు ప్రోత్సాహక నిధులను అందించేందుకు ఆ తరహా సంస్థల లో పెట్టుబడి కి మూలధన లాభాల సంబంధ మినహాయింపు ను మరొక సంవత్సరం పాటు, అంటే 2022 వ సంవత్సరం మార్చి నెల 31 వరకు పొడిగిస్తూ ఆమె ప్రతిపాదన చేశారు.
శ్రామిక సంక్షేమ నిధులకు ఉద్యోగుల చందా ను సకాలం లో జమ చేయడం
వివిధ సంక్షేమ నిధులకు ఉద్దేశించిన ఉద్యోగుల వాటా సొమ్ము ను డిపాజిట్ చేయడం లో జాప్యం ఉద్యోగుల విషయంలో వడ్డీ/ఆదాయం పరంగా శాశ్వత నష్టానికి దారితీస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. ఉద్యోగి వంతు చందా ను యాజమాన్య సంస్థ లు సకాలం లో డిపాజిట్ చేసేందుకు వీలు గా ఉద్యోగి తాలూకు చందా ను ఆలస్యంగా జమ చేయడాన్ని యాజమాన్య సంస్థ కు డిడక్షన్ ను ఎన్నటికీ అనుమతించడం జరగదు అంటూ మంత్రి ఓ ప్రకటన ను చేశారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ను మళ్లీ మొదలుపెట్టే సమయాన్ని తగ్గించడమైంది
ఆదాయపు పన్ను ప్రొసీడింగ్స్ తాలూకు పునః ప్రారంభ కాల పరిమితి ని ప్రస్తుతం ఉన్న ఆరు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ బడ్జెటు లో పేర్కొనడం జరిగింది. పన్ను నియమాల పాలన లో భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యం తో ఈ మేరకు ప్రతిపాదించడం జరిగింది. తీవ్రతరమైన పన్ను ఎగవేత కేసు ల విషయం లో- వేటిలో అయితే ఒక సంవత్సర కాలం లో 50 లక్షల రూపాయలు గానీ, అంతకంటే ఎక్కువ మేరకు గానీ ఆదాయాన్ని దాచి ఉంచిన పక్షంలో- అసెస్‌మెంటు ను 10 సంవత్సరాల వరకు కూడాను మళ్లీ మొదలుపెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇందుకుగాను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆమోదాన్ని పొందవలసి ఉంటుంది.
వివాద పరిష్కార సంఘం, నేశనల్ ఫేస్ లెస్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆప్పెలేట్ ట్రైబ్యునల్ సెంటర్
పన్నుల వసూలు వ్యవస్థ లో వ్యాజ్యాలను తగ్గించాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి ఆదరణ బాగుందని ఆమె చెప్పారు. 2021 జనవరి 30 నాటికి ఒక లక్షా పది వేల మంది పన్ను చెల్లింపుదారులు ఈ పథకం లో భాగం గా 85 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన పన్నుల సంబంధిత వివాదాలను పరిష్కరించుకొనేందుకు మొగ్గు చూపారని మంత్రి తెలిపారు. చిన్న పన్ను చెల్లింపుదారుల తాలూకు వ్యాజ్యాలను కూడా తగ్గించడం కోసం వివాదాల పరిష్కార సంఘాన్ని (డిస్ ప్యూట్ రెజల్యూశన్ కమిటీ) ఏర్పాటు చేయనున్నట్లు శ్రీమతి సీతారమణ్ ప్రతిపాదించారు. 50 లక్షల రూపాయల వరకు పన్ను విధించదగ్గ ఆదాయం కలిగిన మరియు 10 లక్షల రూపాయల వరకు డిస్‌ప్యూటెడ్ ఇన్‌కమ్ కలిగిన ఎవరైనా సరే ఈ సంఘాన్ని సంప్రదించడానికి అర్హులు అవుతారని, ఇది జవాబుదారుతనం, పారదర్శకత్వం కలిగి ఉండి, ప్రభావశీలమైన విధంగా పని చేసేటందుకు గాను ఫేస్‌లెస్ (స్వయం గా హాజరు కానక్కరలేనటువంటిది) గా ఉంటుదని మంత్రి చెప్పారు. నేశనల్ ఫేస్ లెస్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆప్పెలేట్ ట్రైబ్యునల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
డిజిటల్ లావాదేవీ ల కోసం పన్నుల ఆడిట్ పరిమితి ని పెంచడం జరిగింది
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం పూర్తిగా డిజిటల్ మాధ్యమం ద్వారానే వారి లావాదేవీలన్నిటినీ నిర్వహిస్తున్న వ్యక్తి కి నియమాల అనుసరణ సంబంధిత భారాన్ని తగ్గించడం కోసం 95 శాతం లావాదేవీలను డిజిటల్ మాధ్యమాల ద్వారా చేపడుతున్న వ్యక్తులకు ట్యాక్స్ ఆడిట్ పరిమితి ని 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచాలని బడ్జెటు లో ప్రతిపాదించడమైంది.
విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
మౌలిక సదుపాయాల రంగం లో విదేశీ పెట్టుబడి ని ఆకర్షించడానికి ప్రైవేటు నిధుల సేకరణ పై నిషేధాన్ని, వాణిజ్య సరళి కార్యకలాపాలపై ఆంక్షలను, మౌలిక సదుపాయాలలో ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన షరతులను సడలించాలని బడ్జెటు ప్రతిపాదించింది. జీరో కూపన్ బాండ్ల ను జారీ చేయడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల సేకరణ ను అనుమతించడానికి టాక్స్ ఎఫీశియంట్ జీరో కూపన్ బాండ్స్ ను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించుకొనేందుకు నోటిఫైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ లను అర్హమైనవిగా ప్రకటించాలని బడ్జెటు లో ప్రతిపాదించడమైంది.
ఐఎఫ్ఎస్‌సి కి పన్నుల సంబంధిత ప్రోత్సాహకం
గిఫ్ట్ సిటీ (GIFT City) లో ఇంటర్‌నేశనల్ ఫినాన్శల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్‌సి) ని ప్రోత్సహించడం కోసం మరిన్ని పన్ను ప్రోత్సాహకాలను బడ్జెటులో ప్రతిపాదించడం జరిగింది. వీటిలో ఎయర్ క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీ ల ఆదాయాల పై మూలధన ప్రయోజనాలకు పన్ను విరామాన్ని ఇవ్వడం, ఈ రంగంలోని విదేశీ లెసర్ సంస్థలకు చెల్లించిన విమాన లీజు సంబంధిత కిరాయిల కు పన్నుల లో మినహాయింపు, ఐఎఫ్ఎస్‌సి లో విదేశీ ఫండుల రీ లొకేశన్ కు పన్నుల సంబంధిత ప్రోత్సాహకాల కల్పన, ఐఎఫ్ఎస్‌సి లో ఏర్పాటైన విదేశీ బ్యాంకు ల తాలూకు ఇన్వెస్ట్ మెంట్ డివిజన్ లో పెట్టుబడి పెట్టినందుకు పన్ను సంబంధిత మినహాయింపు ను అనుమతించడం వంటివి భాగం గా ఉన్నాయి.
చిన్న ట్రస్టులకు ఊరట
విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్న చిన్న చారిటబుల్ ట్రస్టుల కు నియమపాలన సంబంధిత భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యం తో ఈ ట్రస్టుల కు వివిధ పన్నుల నియమావళి పరమైన వర్తింపు నుంచి మినహాయింపు కోసం ప్రస్తుతం అమలు అవుతున్న 1 కోటి రూపాయల పరిమితి ని 5 కోట్ల రూపాయలకు పెంచాలని ప్రతిపాదించడమైంది.
ఫేస్ లెస్ (స్వయం గా హాజరుకానక్కరలేనటువంటి) ఐటిఎటి
ఇన్‌కమ్ ట్యాక్స్ ఆప్పెలేట్ ట్రైబ్యునల్ ను ఫేస్ లెస్ (స్వయం గా హాజరుకానక్కరలేనటువంటి)గా మార్చాలని కూడా మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ప్రతిపాదించారు. ట్రైబ్యునల్ కు, అప్పీలుదారుకు మధ్య జరిగే అన్ని విధాలైన కమ్యూనికేశన్ కూడాను ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా జరిగేందుకు ఒక నేశనల్ ఫేస్ లెస్ ఇన్‌కమ్ ఆప్పెలేట్ ట్రైబ్యునల్ సెంటర్ ను మంత్రి ప్రతిపాదించారు.
రిటర్న్ ల ప్రి - ఫిల్లింగ్
రిటర్నుల దాఖలు ను సులభతరం చేయడం కోసం, లిస్టెడ్ సెక్యూరిటీస్ నుంచి అందే మూలధన లాభాలు, డివిడెండ్ రూపేణా ఆదాయం, పోస్టాఫీసు, బ్యాంకు ల నుంచి అందే వడ్డీ వగైరాల వివరాలను సైతం సమయాని కంటే ముందుగానే రిటర్ను రూపంలో సమర్పించే పద్ధతి ని బడ్జెటు లో ప్రతిపాదించడమైంది. జీతం రూపంలో వచ్చే ఆదాయం, పన్ను చెల్లింపు, మూలం వద్దే పన్ను తగ్గింపు (టిడిఎస్) తదితర వివరాలు ఇప్పటికే ప్రి- ఫిల్డ్ రిటర్ను లలో చేరి ఉన్నాయి.
***
(Release ID: 1694130)
Visitor Counter : 419
Read this release in:
Marathi
,
Gujarati
,
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Malayalam