ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితులు మరింత తగ్గి 1.68 లక్షలకు చేరిక
24 రోజులుగా రోజువారీ కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో 37 లక్షలమందికి టీకాలు
Posted On:
31 JAN 2021 12:25PM by PIB Hyderabad
భారత దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజుకు అది 1,68,784 కు చేరింది. దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సపొందుతున్నవారు 1.57% కు తగ్గారు.
31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 5000 కంటే తక్కువ మంది కోవిడ్ చికిత్సలో ఉన్నారు. అండమాన్ నికోబార్ లో నలుగురు, డామన్, డయ్యూ, దాద్రా, నాగర్ హవేలీ లో ఆరుగురు మాత్రమే చికిత్సపొందుతూ ఉన్నారు.
చికిత్సపొందుతూ ఉన్నవారిలో 79.69% మంది 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు. కేవలం కేరళ, మహారాష్టలోనే యావద్దేశంలోని 69.42% మంది చికిత్సలో ఉండటం గమనార్హం.
దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య కోటీ నాలుగు లక్షలు దాటి ఈ రోజుకు 1,04,23,125 కు చేరింది. కోలుకున్నవారి శాతం 96.99% అయింది. గత 24 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు అధికంగా నమోదవుతూ ఉన్నారు. గత 24 గంటలలో 13,052 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 13,965 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.
కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 జనవరి 31 ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 37,44,334 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,727
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1,87,252
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
9,651
|
4
|
ఆస్సాం
|
38,106
|
5
|
బీహార్
|
1,46,015
|
6
|
చండీగఢ్
|
3,447
|
7
|
చత్తీస్ గఢ్
|
72,704
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
692
|
9
|
డామన్, డయ్యూ
|
391
|
10
|
ఢిల్లీ
|
56,818
|
11
|
గోవా
|
4,117
|
12
|
గుజరాత్
|
2,46,054
|
13
|
హర్యానా
|
1,25,898
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
27,734
|
15
|
జమ్మూ కశ్మీర్
|
26,634
|
16
|
జార్ఖండ్
|
40,726
|
17
|
కర్నాటక
|
3,15,370
|
18
|
కేరళ
|
1,58,687
|
19
|
లద్దాఖ్
|
1,128
|
20
|
లక్షదీవులు
|
807
|
21
|
మధ్యప్రదేశ్
|
2,98,376
|
22
|
మహారాష్ట్ర
|
2,69,064
|
23
|
మణిపూర్
|
3,987
|
24
|
మేఘాలయ
|
4,324
|
25
|
మిజోరం
|
9,346
|
26
|
నాగాలాండ్
|
3,993
|
27
|
ఒడిశా
|
2,06,424
|
28
|
పుదుచ్చేరి
|
2,736
|
29
|
పంజాబ్
|
57,499
|
30
|
రాజస్థాన్
|
3,29,611
|
31
|
సిక్కిం
|
2,020
|
32
|
తమిళనాడు
|
1,05,821
|
33
|
తెలంగాణ
|
1,68,606
|
34
|
త్రిపుర
|
29,796
|
35
|
ఉత్తరప్రదేశ్
|
4,63,793
|
36
|
ఉత్తరాఖండ్
|
28,791
|
37
|
పశ్చిమ బెంగాల్
|
2,43,069
|
38
|
ఇతరములు
|
52,120
|
మొత్తం
|
37,44,334
|
గత 24 గంటలలో 2,44,307 మంది ఆరోగ్య సిబ్బందికి 5,275 శిబిరాలలో టీకాలు వేశారు. ఇప్పటిదాకా మొత్తం
68,962 శిబిరాలు నిర్వహించారు. ప్రతిరోజూ టీకాలు వేయించుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కోవిడ్ టీకాలు ఇచ్చిన జనాభా సంఖ్య దృష్ట్యా అంతర్జాతీయంగా భారతదేశం జనవరి 29 నాటికి ఐదో స్థానంలో ఉంది. అనేక దేశాలు మనకంటే ముందుగా టీకాలివ్వటం మొదలైనప్పటికీ ఈ స్థాయిలో ఉన్నాం.
టీకాలు వేయించుకున్నవారిలో 63.34% మంది 8 రాష్టాలకు చెందినవారే కాగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఆతరువాత స్థానాల్లో రాజస్థాన్ కర్నాటక ఉన్నాయి.
కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 85.72% మంది 10 రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒకే రోజు 7,032 మంది కోలుకోగా 1,535 తో మహారాష్ట్ర రెండో స్థానంలోను, 547 మందితో కర్నాటక మూడో స్థానంలొనూ ఉన్నాయి.
కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులలో 83.72% మంది 7 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా 6,282 కేసులు, ఆ తరువాత మహారాష్ట్రలో 2,630, తమిళనాడులో 505 వచ్చాయి..
గడిచిన 24 గంటలలో 127మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. వారిలో 74.02% మంది ఆరు రాష్టాలకు చెందినవారు కాగా మహారాష్టలో అత్యధికంగా 42 మంది, ఆ తరువాత కేరళలో 18 మంది, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్ లో తొమ్మిదేసి మంది మరణించారు.
****
(Release ID: 1693725)
Visitor Counter : 250