ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ చికిత్సపొందుతున్నవారి సంఖ్య భారత్ లో మరింత తగ్గుదల
చికిత్సలో ఉన్నవారిలో 65% రెండు రాష్ట్రాల్లోనే
గత 24 గంటల్లో కోవిడ్ మరణాలు 131, ఎనిమిది నెలల్లో అత్యల్పం
Posted On:
25 JAN 2021 10:54AM by PIB Hyderabad
భారతదేశంలో కోవిడ్ చికిత్సపొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1.84 లక్షలకు (1,84,182) అయింది. దీంతో
మొత్తం కేసుల్లో వీరి వాటా 1.73% కు కుంచించుకు పోయింది. చికిత్సలో ఉన్నవారిలో అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర
రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ఈ రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం కేసుల్లో 64.71% పైగా ఉండటం విశేషం. కేరళలో
39.7% , మహారాష్ట్రలో 25% చికిత్సపొందుతున్నవారిలో ఉన్నారు.
గత 24 గంటలలో చికిత్సపొందుతున్న వారిలో నికరంగా 226 కేసులు తగ్గాయి. కొత్తగా పాజిటివ్ కేసులుగా నమోదై
మొత్తం పాజిటివ్ కేసులకు గత 24 గంటలలో 13,203 మంది తోడయ్యారు. మరోవైపు 13,298 మంది గత 24 గంటలలో
కోలుకున్నారు. అదే సమయంలో గడిచిన 24 గంటలలో 131 మంది కోవిడ్ వల్ల మరణించారు. ఈ సంఖ్య గత 8 నెలల్లో
తక్కువ కావటం గమనార్హం.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 19,23,37,117 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో
ప్రతి పది లక్షల జనాభాలో పరీక్షలు మెరుగ్గా జరిగాయి. జాతీయ సగటు అయిన 1,39,374 కంటే ఎక్కువగా నమోదైన రాష్ట్రాలు.
15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా నిష్పత్తి ప్రకారం జాతీయ సగటు కంటే తక్కువ పరీక్షలు జరిగాయి.
2021 జనవరి 25 ఉదయం 8 గంటలవరకు 16,15,504 మంది లబ్ధిదారులకు జాతీయ టీకాల కార్యక్రమం కింద టీకాలు
అందాయి. గత 24 గంటలలో మొత్తం 694 శిబిరాలలో 33,303 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం
28,614 శిబిరాలు నిర్వహించారు.
క్రమ సంఖ్య.
|
రాష్ట్రం/
కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,019
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1,47,030
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
6,511
|
4
|
ఆస్సాం
|
13,881
|
5
|
బీహార్
|
76,125
|
6
|
చండీగఢ్
|
1,502
|
7
|
చత్తీస్ గఢ్
|
28,732
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
345
|
9
|
డామన్, డయ్యూ
|
283
|
10
|
ఢిల్లీ
|
25,811
|
11
|
గోవా
|
1,561
|
12
|
గుజరాత్
|
78,466
|
13
|
హర్యానా
|
72,204
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
13,544
|
15
|
జమ్మూ కశ్మీర్
|
11,647
|
16
|
జార్ఖండ్
|
14,806
|
17
|
కర్నాటక
|
1,91,449
|
18
|
కేరళ
|
53,529
|
19
|
లద్దాఖ్
|
558
|
20
|
లక్షదీవులు
|
633
|
21
|
మధ్యప్రదేశ్
|
38,278
|
22
|
మహారాష్ట్ర
|
99,885
|
23
|
మణిపూర్
|
2,319
|
24
|
మేఘాలయ
|
2,236
|
25
|
మిజోరం
|
3,979
|
26
|
నాగాలాండ్
|
3,443
|
27
|
ఒడిశా
|
1,52,371
|
28
|
పుదుచ్చేరి
|
1,478
|
29
|
పంజాబ్
|
31,327
|
30
|
రాజస్థాన్
|
93,525
|
31
|
సిక్కిం
|
960
|
32
|
తమిళనాడు
|
61,720
|
33
|
తెలంగాణ
|
1,10,031
|
34
|
త్రిపుర
|
14,252
|
35
|
ఉత్తరప్రదేశ్
|
1,23,761
|
36
|
ఉత్తరాఖండ్
|
10,514
|
37
|
పశ్చిమ బెంగాల్
|
84,505
|
38
|
ఇతరములు
|
40,284
|
మొత్తం
|
16,15,504
|
మొత్తం కోలుకున్నవారి సంఖ్య కోటీ మూడు లక్షలు దాటి 1,03,30,084 కి చేరింది. అంటే శాతం పరంగా
కోలుకున్నవారి శాతం 96.83% అయింది. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం మరింత
తగ్గుతూ1,01,45,902 కి చేరింది. కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 79.12% మంది 9 రాష్ట్రాల్లో కేంద్రీకృతమైనట్టు
తెలుస్తోంది. వారిలో కేరళలో అత్యధికంగా 5,173 మంది, మహారాష్ట్రలో 1,743 మంది, గుజరాత్ లో 704 మంది ఒకరోజులో
కోలుకున్నారు.
కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా తేలినవారిలో 81.26% మంది కేవలం 6 రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యారు. వీరిలో అత్యధికంగా
కేరళలో అత్యధికంగా 6,036 మంది కొత్తగా పాజిటివ్ గా తేలారు. మహారాష్ట్రలో 2,752 కొత్త కేసులు, కర్నాటకలో
573 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటలలో 131 మంది మరణించగా ఏడు రాష్ట్రాలలోనే 80.15% మరణాలు నమోదయ్యాయి. వారిలో
మహారాష్ట్రలో అత్యధికంగా 45 మంది చనిపోగా కేరళలో 20 మంది, ఢిల్లీ లో 9 మంది మరణించారు.
****
(Release ID: 1692147)
Visitor Counter : 269
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam