ప్రధాన మంత్రి కార్యాలయం

హ‌రిపుర లో రేప‌టి కార్య‌క్ర‌మం మ‌న దేశానికి నేతాజీ బోస్ అందించిన తోడ్పాటుకు ఒక ప్ర‌శంస అవుతుంది:  ప్ర‌ధాన మంత్రి

రేప‌టి రోజున నేతాజీ సుభాశ్ చంద్ర‌ బోస్ జ‌యంతి సంద‌ర్భం లో ఆయ‌న‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 22 JAN 2021 5:39PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతాజీ సుభాశ్ చంద్ర‌ బోస్ గారికి రేపు నేతాజీ జ‌యంతి సంద‌ర్భం లో శ్ర‌ద్ధాంజ‌లి స‌మ‌ర్పించారు.  ‘‘రేప‌టి రోజున మ‌హ‌నీయుడు నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ గారి జ‌యంతి కి గుర్తుగా #ParakramDivas భార‌త‌దేశం జ‌రుపుకోనుంది.  దేశ‌వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాల లో భాగం గా ఒక ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మాన్ని గుజ‌రాత్ లోని హ‌రిపుర లో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది.  మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆరంభ‌మ‌య్యే ఆ కార్య‌క్ర‌మం లో భాగ‌స్తులు కండి.

నేతేజీ సుభాశ్ చంద్ర‌ బోస్ గారితో హ‌రిపుర ఒక ప్ర‌త్యేక అనుబంధాన్ని క‌లిగి ఉంది.  1938వ సంవ‌త్స‌రం లో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ని నేతాజీ బోస్ చేప‌ట్టిన ఘ‌ట్టం చ‌రిత్రాత్మ‌క‌మైన హ‌రిపుర స‌ద‌స్సు లోనే చోటు చేసుకొంది.  హ‌రిపుర లో రేపు నిర్వ‌హించే కార్య‌క్ర‌మం మ‌న దేశాని కి నేతాజీ బోస్ అందించిన తోడ్పాటుకు ఒక ప్ర‌శంస‌గా నిలుస్తుంది.

నేతాజీ బోస్ జ‌యంతి కి ఒక రోజు ముందు నా మ‌న‌స్సు 2009 జ‌న‌వ‌రి 23వ తేదీని త‌ల‌చుకొంటోంది.  ‘ఇ-గ్రామ్ విశ్వ‌గ్రామ్ ప్రాజెక్టు’ను హ‌రిపుర నుంచి ప్రారంభించింది ఆ రోజునే.  ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్ ఐటి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న లో ఒక పెద్ద విప్ల‌వాన్ని ఆవిష్క‌రించింది.  సాంకేతిక విజ్ఞానం తాలూకు ఫ‌లాల‌ ను రాష్ట్రం లోని సుదూర ప్రాంతాల పేద‌ల వ‌ద్ద‌కు తీసుకుపోయిన కార్య‌క్ర‌మం అది.

1938వ సంవ‌త్స‌రం లో నేతాజీ బోస్ ను తీసుకువెళ్ళిన ర‌హ‌దారి మీదుగా ఒక పెద్ద ఊరేగింపుతో హ‌రిపుర ప్ర‌జ‌లు న‌న్ను తీసుకువెళ్ళి, నా మీద చూపించిన ఆప్యాయ‌త‌ను నేను ఎన్న‌టికీ మ‌ర‌చిపోలేను.  ఆ ఊరేగింపులో అలంక‌రించిన ఒక ర‌థాన్ని 51 ఎద్దుల‌తో మోయించారు.  హ‌రిపుర లో నేతాజీ బ‌స చేసిన ప్ర‌దేశాని కి కూడా నేను వెళ్ళాను.

నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ గ‌ర్వప‌డేట‌టువంటి ఒక బ‌ల‌మైన ధైర్యం గ‌ల స్వ‌యం స‌మృద్ధియుత‌మైన భార‌త‌దేశం.. దేని మాన‌వ ప్ర‌ధాన‌మైన దృక్ఫ‌థం రాబోయే కాలం లో ఒక మెరుగైన ప్ర‌పంచం ఆవిష్క‌ర‌ణ‌కు తోడ్ప‌డుతుందో అటువంటి ఒక భార‌త‌దేశాన్ని నిర్మించే దిశ‌ లో కృషి చేయ‌డానికి నేతాజీ ఆలోచ‌న‌లు మ‌రియు ఆద‌ర్శాలు మ‌న‌కు ప్రేర‌ణ‌ను అందిస్తూనే ఉండాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను.’’

 

****

 



(Release ID: 1691282) Visitor Counter : 156