ప్రధాన మంత్రి కార్యాలయం
వారాణసీ లో కొవిడ్ టీకామందు కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తో, ఆ టీకామందు ను వేసే వారితో ఈ నెల 22న మాట్లాడనున్న ప్రధాన మంత్రి
Posted On:
21 JAN 2021 4:20PM by PIB Hyderabad
వారాణసీ లో కొవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆ టీకామందు ను వేస్తున్న వారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 22న మధ్యాహ్నం 1.15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమం లో పాలుపంచుకొనే వారు టీకామందు కార్యక్రమం లో పాల్గొంటున్నందువల్ల వారికి కలిగిన ప్రత్యక్ష అనుభవాన్ని గురించి వివరించనున్నారు.
ప్రపంచం లోనే అతి పెద్దదైన స్థాయి లో చేపట్టిన టీకామందు ను ఇప్పించే కార్యక్రమం సాఫీ గా అమలయ్యేటట్లు చూడటం కోసం ప్రధాన మంత్రి శాస్త్రవేత్తల తోను, రాజకీయ నాయకుల తోను, అధికారుల తోను, ఈ కార్యక్రమం తో అనుబంధం కల ఇతర వర్గాల తోను అనేక సార్లు చేపట్టిన సంభాషణలకు, చర్చలకు తరువాయి గా తాజా ముఖాముఖి సమావేశం చోటు చేసుకోనుంది.
***
(Release ID: 1690941)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam