ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టీకాల మీద అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే అవగాహనాకార్యక్రమానికి డాక్టర్ హర్ష వర్ధన్ శ్రీకారం

“తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం. సత్యమేవ జయతే”

పుకార్లు నమ్మకుండా అధికారిక సమాచారాన్నే నమ్మాల్సిందిగా ప్రజలకు పిలుపు

“టీకామందు కావాలని అన్నిదేశాలూ అడుగుతుంటే కొందరు రాజకీయ ప్రయోజనాలకోసం దుష్ప్రచారం చేస్తున్నారు”

Posted On: 21 JAN 2021 2:10PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మొదలైన కోవిడ్ టీకాల కార్యక్రమానికి కొంతమంది వెనుకాడటం, మరికొందరు దుష్ప్రచారానికి పూనుకోవటం మొదలైన నేపథ్యంలో  టీకాల మీద అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే అవగాహనా కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రచారానికి అవసరమైన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వికె పాల్ కూడా పాల్గొన్నారు. 

 

 

ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా పేరొందిన కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని 2021 జనవరి 16 న  ప్రధానమంత్రి ప్రారంభించటం తెలిసిందే.  ఈ కార్యక్రమంలో జనవరి 21 ఉదయం 7 గంటలవరకు 8 లక్షలమందికి పైగా ఆరోగ్య రంగ సిబ్బంది టీకాలు అందుకున్నారు.

ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతి పెద్ద దేశమైన భారత్ కు టీకాల కార్యక్రమం  ఒక పెద్ద సాధనగా కేంద్ర ఆరోగ్య మంత్రి అభివర్ణించారు. కోవిడ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించి సఫలమైన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని, అదే సమయంలో టీకామందు కూడా కనిపెట్టిందని గుర్తు చేశారు. దేశాన్ని కోవిడ్ మహమ్మారినుంచి కాపాడటానికి కంకణం కట్టుకున్న  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో  ఇది సాధించగలిగామన్నారు.రోజు దేశంలో కొత్త కోవిడ్ కేసులు బాగా తగ్గిపోయాయని, చికిత్సలో ఉన్నవారు కూడా తగ్గారని మంత్రి గుర్తు చేశారు. నిన్న కేవలం 15 వేల కొత్త కోవిడ్ కేసులు మాత్రమే వచ్చాయన్నారు..

వ్యాధుల నిర్మూలనలో టీకాల ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు.  పోలియో, మశూచి నియంత్రించటమన్నది కేవలం పెద్ద ఎత్తున టీకాలివ్వటం వల్లనే సాధ్యమైందన్నారు.  ఒకసారి టీకాలు అంటూ ఇస్తే వ్యక్తికి వ్యాధి రాకుండా ఉండటమే కాకుండా మరొకరికి సంక్రమింపజేసే అవకాశం కూడా ఉందదని ఆయన గుర్తు చేశారు.  అ విధంగా తన చుట్టు ఉన్న సమాజానికి కూడా సామాజిక లబ్ధిని పంచినట్టవుతుందన్నారు. ఈ కారణంవల్లనే మహిళలను, పిల్లలను మొత్తం 12 రకాల వ్యాధులనుంచి కాపాడే సార్వత్రిక టీకాల కార్యక్రమం మిషన్ ఇంద్రదనుష్ ను చేపట్టిన సంగతి గుర్తు చేశారు.  విధంగానే కోవిడ్ టీకా కూడా ఇతరులెవరికీ వ్యాధి వ్యాపించకుండా అడ్దుకోగలుగుతుందన్నారు.

ఉద్దేశపూర్వకంగా కొన్ని శక్తులు కోవిడ్ టీకాకు వ్యతిరేకంగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని  అడ్దుకోవాలని మంత్రి దాక్టర్ హర్ష వర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  “ఈ డుదుష్ప్రచారాన్ని అడ్దుకుందాం. ఆరోగ్య మంత్రిత్వశాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ,  మైగవ్ వెబ్ సైట్ లాంటి సరైన, విశ్వసనీయమైన, అధికారపూర్వకమైన సమాచారాన్ని మాత్రమే అందరికీ పంచుదాం. సత్యమే శక్తిమంతమైంది, అదే జయిస్తుంది. ఈ నేపథ్యంతో రూపొందించిన ప్రచార పోస్టర్లను అందరికీ అందుబాటులోకి తీసుకుపోవటం ద్వారా వాస్తవాన్ని ప్రజలకు చేరుద్దాం” అని పిలుపునిచ్చారు. 

 

టీకాల సమర్థత, సురక్షితం మీద వ్యాఖ్యానిస్తూ, పేరుమోసిన ఆస్పత్రుల డాక్టర్లమ్దరూ ఈ టీకాలు తీసుకున్న సంగతి, వాళ్ళు మెచ్చుకున్న సంగతి కూడా గుర్తు చేశారు. ఇది లక్ష్యాన్ని సాధిస్తుందని వారంతా ధీమాగా ఉన్న సమ్గతి ప్రస్తావిస్తూ, కేవలం కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలకోసమే పుకార్లు వ్యాపింపజేస్తున్నారన్నారు.  ఆ విధంగా ప్రజలను టీకాలపట్ల విముఖులుగా మార్చుతున్నారని ఆరోపించారు.   చిత్రమేంటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమకు కూడా టీకామందు కావాలని అడుగుతుండగా మనవాళ్లు కొంతమంది మాత్రం రాజకీయ ప్రయోజనాలకోసం దుష్ప్రచారానికి పూనుకోవటం వాళ్ళ దివాలాకోరుతనానికి అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని డాక్టర్లతో సహా అనేకమంది వైద్య రంగ  సిబ్బంది ఇప్పటికే కోవిడ్ టీకాలు తీసుకున్న విషయాన్ని, ఎలాంటి దుష్ప్రభావమూ కనబడకపోవటంతో వాళ్లు యథావిధిగా విధుల్లో చేరటాన్ని  మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

టీకాల కార్యక్రమాన్ని కోవిడ్ మీద అంతిమ పోరాటంగా శ్రీ అశ్విన్ కుమార్ చౌబే అభివర్ణించారు. కోవిడ్ మహమ్మారిని శాశ్వతంగా మట్టుపెట్టటానికి టీకాలు ప్రారంభించిన జనవరి 16వ తేదీ  దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. భారతదేశం ఇంత త్వరగా టీకామందు అందించటం కూడా అసాధారణమైన ఘనతగా అభివర్ణించారు. అసత్యాలు ప్రచారం చేసేవారి మాటలు నమ్మవద్దని, అందరికీ నిజాలతోకూడిన సమాచారం అందేలా కృషి చేయటం అందరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. 

 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, అదనపు కార్యదర్శి, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీ కుమారి వందనా గుర్నాని, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ మనోహర్ అజ్ఞాని,   ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డిజి హెచ్ ఎస్ డాక్టర్ సునీల్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఎల్ హెచ్ ఎం సి డైరెక్టర్ డాక్టర్ ఎన్ ఎన్ మాథుర్, సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఎస్వీ ఆర్య, ఆర్ ఎమ్ ఎల్ ఆస్పత్రి కి చెందిన డాక్టర్ రాణా, బి ఎం జి ఎఫ్, యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

 

****



(Release ID: 1690884) Visitor Counter : 262