ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ జో బైడెన్ ప‌ద‌వీస్వీకారం సంద‌ర్భం లో ఆయ‌న‌ కు అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 20 JAN 2021 10:42PM by PIB Hyderabad

శ్రీ జో బైడెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి బాధ్య‌త‌ల‌ ను స్వీక‌రించిన సంద‌ర్భం లో ఆయ‌న ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘‘యునైటెడ్ స్టేట్స్  ఆఫ్ అమెరికా అధ్య‌క్షుని గా @JoeBiden ప‌ద‌వీబాధ్య‌త‌ల ను స్వీక‌రించిన సంద‌ర్భం లో ఇవే నా ఆప్యాయ‌త భరిత అభినంద‌న‌లు.  భార‌త‌దేశం-యుఎస్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని బ‌ల‌వత్తరంగా తీర్చిదిద్దడానికి ఆయ‌న‌ తో క‌ల‌సి కృషి చేయాలని నేను ఆశావహం గా ఎదురుచూస్తూ ఉన్నాను.  

ప్రపంచ శాంతి భ‌ద్ర‌త‌ల ను ముందుకు తీసుకు పోవ‌డం కోసం ఒకే రకమైనటువంటి సవాళ్లను మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి యుఎస్ఎ నాయకత్వం ఫలప్రదమైన పదవీకాలాన్ని పూర్తి చేసుకోవాలంటూ నేను నా యొక్క శుభాకాంక్ష‌ల‌ను వ్యక్తం చేస్తున్నాను.

భార‌త‌దేశం-యుఎస్ భాగ‌స్వామ్యం ఉమ్మ‌డి విలువ‌ల‌ పై ఆధార‌ప‌డి ఉంది.  మ‌న‌ దగ్గర ఒక బలమైన‌, బ‌హుళ పార్శ్వాల‌ తో కూడిన‌ ద్వైపాక్షిక కార్య‌క్ర‌మ ప‌ట్టికంటూ ఉంది; మరి అది వృద్ధి చెందుతున్న ఆర్థిక బంధంతోను, ఉత్సాహంతో నిండిన ప్ర‌జల తోను ముందంజ వేస్తోంది.  భార‌త‌దేశం-యుఎస్ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ఉన్నత శిఖ‌రాల‌ కు తీసుకు పోవ‌డం కోసం @JoeBiden తో క‌ల‌సి కృషి చేయ‌డానికి నేను కంక‌ణం క‌ట్టుకొన్నాను’’ అని అనేక ట్వీట్ ల‌లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

Narendra Modi
@narendramodi
My warmest congratulations to @JoeBiden on his assumption of office as President of the United States of America. I look forward to working with him to strengthen India-US strategic partnership.
10:22 PM · Jan 20, 2021
100.1K
15.4K people are Tweeting about this
 
 

 

***
 



(Release ID: 1690775) Visitor Counter : 133