ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న- గ్రామీణ్ ప‌థ‌కం లో భాగం గా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో 6 ల‌క్ష‌ల మంది లబ్ధిదారుల‌కు ఆర్ధిక స‌హాయ రాశి ని ఈ నెల 20న  విడుద‌ల చేయ‌నున్న ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 19 JAN 2021 3:49PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ దాదాపు 2,691 కోట్ల రూపాయల ఆర్ధిక స‌హాయాన్ని ‘ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న- గ్రామీణ్’ (పిఎమ్ఎవై- జి) లో భాగం గా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో 6.1 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారుల‌కు బుధవారం, అంటే ఈ నెల 20న, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు.  ఈ సందర్భం లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా పాల్గొంటారు.  5.30 ల‌క్ష‌ల ల‌బ్దిదారుల‌కు తొలి కిస్తీ  ఆర్థిక సహాయం విడుద‌ల కు తోడు ఇప్ప‌టికే పిఎమ్ఎవై- జి లో ఒకటో కిస్తీ ఆర్థిక సహాయాన్ని అందుకొన్న 80 వేల మంది ల‌బ్ధిదారులకు కూడా రెండో కిస్తీ తాలూకు ఆర్థిక సాయం అందనుంది.


‘ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న‌- గ్రామీణ్‌’

‘‘2022వ సంవత్సరాని కల్లా అందరికీ గృహనిర్మాణం’’ అంటూ ప్ర‌ధాన‌ మంత్రి పిలుపునిచ్చారు.  దీనికోసం 2016వ సంవత్సరం నవంబ‌ర్ 20న పిఎమ్ ఎవై- జి అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించడమైంది.  ఈ ప‌థ‌కం లో భాగంగా ఇంతవ‌ర‌కు దేశ‌వ్యాప్తం గా 1.26 కోట్ల ఇళ్ల‌ ను నిర్మించడం జరిగింది.  పిఎమ్ ఎవై- జి లో భాగంగా మైదాన ప్రాంతాలలో ప్రతి ఒక్క ల‌బ్దిదారుకు ఇంటి నిర్మాణానికి గాను 1.20 ల‌క్ష‌ల రూపాయలు, పర్వత మయమైన రాష్ట్రాల (ఈశాన్య రాష్ట్రాలు/ దుర్గమ స్థానాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలైన జ‌మ్ము- కశ్మీర్, ల‌ద్దాఖ్, ఐఎపి, ఎల్‌డ‌బ్ల్యుఇ జిల్లా ల‌) వారికి 1.30 లక్షల మేర ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోంది.

పిఎమ్ ఎవై- జి ల‌బ్ధిదారులకు ఇంటికి అదనం గా మ‌హాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం (ఎమ్ జిఎన్ఆర్ ఇ జిఎస్‌) లో భాగం గా నైపుణ్యం లేని శ్రామికుల శ్రేణి లో సైతం సాయాన్ని అందించడం జరుగుతుంది.  దీనితో పాటు టాయిలెట్ నిర్మాణానికి స్వ‌చ్ఛ్ భార‌త్ మిశన్- గ్రామీణ్ (ఎస్ బిఎమ్- జి), ఎమ్ జిఎన్ఆర్ఇజిఎస్ లేదా మరే ఇత‌ర వనరుల నుంచి 12,000 రూపాయల ఆర్థిక సహాయ రాశి ని అందించడం జరుగుతుంది.  ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఇతర ప‌థ‌కాల‌తో కూడాను కలపడమైంది. దీనిలో భాగంగా లబ్ధిదారు కు ఎల్ పిజి కనెక్షన్ తాలూకు ప్రయోజనాన్ని అందదించడం కోసం ‘ప్ర‌ధాన‌ మంత్రి ఉజ్వ‌ల యోజన’, విద్యుత్తు క‌నెక్ష‌న్‌, సుర‌క్షిత మంచినీటి సరఫరా కై జ‌ల్‌ జీవ‌న్ మిశన్ తదితరాను కూడా ఇందులో చేర్చడం జరిగింది.



 

****



(Release ID: 1690203) Visitor Counter : 219