మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2021 ఏడాదికి, జేఈఈ, నీట్ సిలబస్ యథాతథం
Posted On:
19 JAN 2021 12:44PM by PIB Hyderabad
2021 ఏడాదికి, జేఈఈ, నీట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. గతానికి భిన్నంగా, జేఈఈ, నీట్‌లో సమాధానాలు రాయడానికి ఆప్షన్లు ఉంటాయి.
జేఈఈ (మెయిన్)-2021 సిలబస్ గతేడాదిలాగే ఉంటుంది. అయితే, మొత్తం 90 ప్రశ్నల్లో (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 30 చొప్పున) అభ్యర్థులు 75 ప్రశ్నలకు (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) సమాధానం రాయాల్సివుంటుంది. జేఈఈ (మెయిన్)-2020లో, 75 ప్రశ్నలిచ్చి (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) అన్నింటికీ సమాధానాలు రాయమన్నారు.
నీట్ (యూజీ)-2021 ఖచ్చితమైన విధానాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని బోర్డులు సిలబస్ తగ్గించిన నేపథ్యంలో, జేఈఈ (మెయిన్) తరహాలోనే నీట్ (యూజీ)-2021 పరీక్ష పత్రంలోనూ ఆప్షన్లు ఉంటాయి.
***
(Release ID: 1690003)
Visitor Counter : 253
Read this release in:
Odia
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Punjabi