ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు కోటి మంది అదనం

దాదాపు 8 నెలల తరువాత 145 కు పడిపోయిన రోజువారీ మరణాలు

Posted On: 18 JAN 2021 12:07PM by PIB Hyderabad

భారత్ కోవిడ్ మీద పోరులో మరో చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. మొత్తం కోలుకున్న కోవిడ్ బాధితులు నేడు చికిత్సలో ఉన్నవారికంటే కోటి మంది ఎక్కువయ్యారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య  1,02,11,342 కాగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య  2,08,012 గా నమోదైంది.  రెండింటికీ మధ్య తేడా  1,00,03,330 కి చేరింది. కోలుకున్నవారి సంఖ్య ఇప్పుడు చికిత్సలో ఉన్నవారికంటే 50 రెట్లు ఎక్కువగా ఉంది.

 

దీంతో భారత్ లో కోలుకున్నవారి శాతం 96.59%. కు చేరింది. గడిచిన 24 గంటలలో  14,457 మంది కోవిడ్ నుంచి బైటపడ్దారు.  అదే సమయంలో కొత్తగా నిర్థారణ అయిన కోవిడ్ బాధితుల సంఖ్య 13,788 అయింది..

భారత్ లో రోజువారీ పాజిటివ్ కేసులు వేగంగా తగ్గిపోతుండగా  మరణాలు సైతం వేగంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటలలో 150 లోపు కోవిడ్ మరణాలు (145) నమోదయ్యాయి. దాదాపు 8 నెలల తరువాత (కచ్చితంగా చెప్పాలంటే 7 నెలల 23 రోజులు) ఇంత తక్కువ మరణాలు నమోదయ్యాయి.  

వివిధ రాష్ట్రాలలో నమోదైన రోజువారీ మరణాలను ఈ చిత్రపటంలో చూదవచ్చు. 15 రాష్ట్రాల్లో సున్నా మరణాలు నమోదయ్యాయి. 13 రాష్ట్రాల్లో మరణాలు 5 లోపు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో మాత్రమే 10-20 మధ్య మరణాలుండగా 20 కి పైగా రాష్ట్రాలలో రెండేసి మరణాలు నమోదయ్యాయి.  

 

కొత్తగా కోలుకున్నవారిలో 71.70%  మంది ఏడు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా  4,408 మంది కోలుకున్నారు. 2,342 మంది మహారాష్ట్రలో, 855 మంది కర్నాటకలో కోలుకున్నారు.   

 

కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 76.17% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే కాగా, కేరళలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు 5,005 రాగా, ఆ తరువాత స్థానంలో మహారాష్ట్రలో 3,081 మంది, కర్నాటకలో 745 కేసులు  వచ్చాయి.  

 

గత 24 గంటలలో నమోదైన మరణాలలో 83.45% కేవలం ఏడు రాష్ట్రాలలోనే జరిగాయి. అందులో మహారాష్టలో అత్యధికంగా 50 మంది మరణించగా  కేరళలో 21 మంది, పశ్చిమ బెంగాల్ లో 12 మంది చనిపోయారు.   

 

      

****


(Release ID: 1689683) Visitor Counter : 212