ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేయడంలో స్టార్టప్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి : పిఎం శ్రీ మోదీ
Posted On:
16 JAN 2021 9:10PM by PIB Hyderabad
కరోనా సంక్షోభ సమయంలో ఆత్మనిర్భర్ భారత్ కు స్టార్టప్ లు అందించిన సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. “ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ శిఖరాగ్రం”లో వీడియో కాన్ఫరెన్సింగ్ లో ఆయన మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వాటిలో 45 శాతం స్టార్టప్ లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందినవేనని అన్నారు.
స్థానిక అవకాశాలకు అనుగుణంగా ప్రతీ ఒక్క రాష్ట్రం స్టార్టప్ లను ప్రోత్సహిస్తూ ఇంకుబేట్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అలాగే దేశంలోని 80 శాతం జిల్లాలు ఇప్పుడు స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నట్టు తెలిపారు. ప్రజలు తమ ఆహారం విషయంలో చైతన్యవంతులైనందు వల్ల ఆహారం, వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలున్నట్టు ఆయన చెప్పారు. భారతదేశం ఈ రంగాల వృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నదంటూ ఇందుకోసం రూ.1 లక్ష కోట్లతో అగ్రి ఇన్ ఫ్రా ఫండ్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కొత్త అవకాశాలను ఆసరా చేసుకుని స్టార్టప్ లు రైతులతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని మరింత నాణ్యమైన ఉత్పత్తులను తేలిగ్గా వ్యవసాయ క్షేత్రాల నుంచి టేబుల్స్ కు చేరడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ఆత్మనిర్భరం కావడంలో స్టార్టప్ ల సేవలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. శానిటైజర్లు, పిపిఇ కిట్లు, వాటికి సంబంధించిన సరఫరా వ్యవస్థలను పెంచడంలో స్టార్టప్ ల పాత్ర కీలకమని ఆయన అన్నారు. అలాగే నిత్యావసరాలు, ఔషధాలను ఇంటింటికీ డెలివరీ చేయడం, కరోనా రణరంగంలో ముందు వరుసలో నిలిచిన పనివారి రవాణాలో, ఆన్ లైన్ స్టడీ మెటీరియల్ సరఫరాలో కూడా స్టార్టప్ లు కీలకంగా నిలిచాయని ఆయన చెప్పారు. ప్రతి కూడా పరిస్థితుల్లో కూడా అవకాశాలు అన్వేషించుకోవడం, సంక్షోభ సమయంలో సమాజంలో విశ్వాసం నింపడంలో కూడా స్టార్టప్ ల పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు.
***
(Release ID: 1689556)
Visitor Counter : 96
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam