ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 18న అహ‌మ్మ‌దాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో ద‌శ‌కు, సూర‌త్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల‌మీదుగా శంకుస్థాప‌న‌లు

Posted On: 16 JAN 2021 8:22PM by PIB Hyderabad

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల‌మీదుగా అహ‌మ్మ‌దాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో ద‌శ‌కు, సూర‌త్ మెట్రో రైలు ప్రాజెక్టుకు  శంకుస్థాప‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 18న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ రెండు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్‌, కేంద్ర హోమ్ శాఖ మంత్రి, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల‌శాఖ మంత్రి పాల్గొననున్నారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల కార‌ణంగా ఈ రెండు న‌గ‌రాల్లో ప‌ర్యావ‌ర‌ణ హిత ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మ‌వుతుంది. 
అహ‌మ్మ‌దాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో ద‌శ‌
అహ‌మ్మ‌దాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో ద‌శ‌లో 28.25 కిలోమీట‌ర్ల పొడ‌వైన రెండు కారిడార్ల‌ను నిర్మిస్తారు. మొద‌టి కారిడార్ 22.8 కిలోమీట‌ర్ల పొడవు వుంటుంది. ఇది మొతేరా స్టేడియంనుంచి మ‌హాత్మా మందిరంవ‌ర‌కూ నిర్మిస్తారు. రెండో కారిడారు పొడ‌వు 5.4 కిలోమీట‌ర్లు. ఇది జిఎన్ ఎల్ యు నుంచి గిప్ట్ సిటీ వ‌ర‌కూ నిర్మిస్తారు. ఈ రెండో ద‌శ‌ను పూర్తి చేయ‌డానికిగాను రూ. 5, 384 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. 
సూర‌త్ మెట్రో రైలు ప్రాజెక్టు
సూర‌త్ మెట్రో రైలు ప్రాజెక్టును రెండు కారిడార్లుగా నిర్మిస్తున్నారు. కారిడార్ 1 అనేది 21. 61 కిలోమీట‌ర్ల పొడ‌వు వుంటుంది. దీన్ని సార్తానానుంచి డ్రీమ్ సిటీవ‌ర‌కూ నిర్మిస్తారు. కారిడార్ 2 ను 18.74 కిలోమీట‌ర్లు నిర్మిస్తారు. ఇది భీసేన్ నుంచి స‌రోలివ‌ర‌కూ నిర్మిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికిగాను రూ. 12, 020 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తారు. 

 

*****


(Release ID: 1689551) Visitor Counter : 165