ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్న కేసులు 2.13 లక్షలకు తగ్గుదల
రోజువారీ కొత్త కేసుల తగ్గుదల; గత 24 గంటల్లో 15,590
Posted On:
15 JAN 2021 1:10PM by PIB Hyderabad
భారత్ లో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అది 2,13,027 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 2.03% మాత్రమే.
రోజువారీ వస్తున్న కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోజుకు 20 వేలలోపే ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో 15,590 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో15,975 మంది కోలుకున్నారు. ప్రతి పది లక్షల జనాభాలో కొత్త కేసులు 87 గా రికార్డయ్యాయి. ఇది ప్రపంచంలో అతి భారత్ ను అతి తక్కువ నమోదైన దేశాల్లో ఒకటిగా మార్చింది. రష్యా, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇటలీ అమెరికా, యుకె లాంటి దేశాలకంటే ఇది తక్కువ.
ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,01,62,738 కాగా కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 99 లక్షలు దాటి 99,49,711 కు చేరింది. ఈ తేడాశాతం ఈ రోజుకు 96.52% అయింది.
కొత్తగా గత 24 గటలలో కోలుకున్నవారిలో 81.15% కేవలం 10 రాష్ట్రాలలో నమోదు కాగా కేరళలో అత్యధికంగా 4,337 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 3,309 మంది, చత్తీస్ గఢ్ లో 970 మంది కోలుకున్నారు.
కొత్తగా పాజిటివ్ గా నమోదైన కేసులలో 77.56% మంది 7 రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 5,490 కేసులు, మహారాష్ట్రలో 3,579, పశ్చిమ బెంగాల్ లో 680 నమోదయ్యాయి.
గత 24 గంటలలో 191 మంది కోవిడ్ బాధితులు మరణించగా ఆరు రాష్ట్రాల్లోనే 73.30% మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 70, కేరళలో 19, పశ్చిమ బెంగాల్ లో 17 మంది మరణించారు.
భారత్ లో గత వారం రోజుల్లో ప్రతి పది లక్షలమందిలొ ఒకరి మాత్రమే కరోనాతో మరణించినట్టయింది. మరణాలశాతం 1.44% కాగా ప్రతిపదిలక్షల జనాభాలో మరణాల శాతం పరంగా ప్రపంచంలోనే భారత్ అతి తక్కువ స్థాయిలో ఉంది. ,
***
(Release ID: 1688797)
Visitor Counter : 177