ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
7 రోజులుగా దేశంలో రోజుకు కొత్త కేసులు 20 వేల లోపే
మరణాలు వేగంగా తగ్గుముఖం, 20 రోజులుగా 300 లోపు
22 రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ మరణాల శాతం
తొలివిడత సేకరించిన కోవిషీల్డ్, కొవాక్సిన్ టీకా రాష్ట్రాలకు కేటాయింపు
Posted On:
14 JAN 2021 10:44AM by PIB Hyderabad
దేశంలో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉండగా గత 7 రోజులుగా రోజువారీ కెసులు 20 వేల లోపే ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో కేవలం 16,946 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 17,652 మంది కోలుకున్నారు. దీంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 904 తగ్గింది.
భారతదేశంలో రోజువారీ కోవిడ్ మరణాలు తగ్గుదల బాటలో సాగుతున్నాయి. గడిచిన 20 రోజులుగా సగటున రోజుకు 300 లోపు మరణాలు నమోదవుతూ ఉన్నాయి.
దేశంలో కోవిడ్ బాధితులలో మరణాల శాతం 1.44% గా నమోదైంది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతలలో మరణాల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,13,603కు తగ్గింది. మొత్తం పాజిటివ్ కెసులలో వీరి వాటా ప్రస్తుతం 2.03% కు తగ్గింది. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సగటు చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య 5,000 లోపు ఉంది.
భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,01,46,763 కు చేరింది. కోలుకున్నవారి శాతం 96.52% కు చేరింది. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులోనే 5,158 మంది కోలుకోగా, మహారాష్టలో 3,009 మంది, చత్తీస్ గఢ్ లో 930 మంది కోలుకున్నట్టు నమోదయ్యారు.
కొత్తగా నిర్థారణ జరిగిన కేసులలో76.45% మంది ఏడు రాష్టాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 6,004 కేసులు, మహారాష్టలో 3556 కేసులు, కర్నాటకలో 746 కేసులు వచ్చాయి.
గడిచిన 24 గంటలలో 198 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వారిలో 75.76% మంది కేవలం ఆరు రాష్టాలకు చెందినవారే ఉన్నారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రలో 70 మంది మరణించగా, కేరళలో 26 మంది, పశ్చిమ బెంగాల్ లో 18 మంది చనిపోయారు.
ఈ నెల 16న ప్రారంభిస్తున్న భారీ టీకాల కార్యక్రమానికి దేశం సన్నద్ధమైంది.
తొలివిడతగా సేకరించిన కోవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలు కోటీ 65 లక్షల డోసులు కాగా వీటిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతలలోని ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తల నిష్పత్తికి అనుగుణంగా కేటాయించారు. అందువలన టీకా డోసుల కేటాయింపులో రాష్ట్రాలపట్ల ఎలాంటి వివక్షకూ తావులేదు. అదే సమయంలో టీకాల సరఫరాలకు లోటు లేదని, అలాంటి భయాలు అర్థం లేనివని కూడా కేంద్రం స్పష్టం చేసింది.
ఒక్కోరోజుకు ఒక్కో చోట కనీస 100 టీకాలు వేసేట్టు చూడాలని, టీకామందులో కనీసం 10 శాతం వృధా కావచ్చునన్న నుందస్తు అంచనాతో అదనంగా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని కూడా రాష్ట్రాలకు కేంద్రం సలహా ఇచ్చింది. అందువలన అనవసరమైన అత్యాశ అంచనాలతో హడావిడి చెయ్యవద్దని కూడా హితవు చెప్పింది.
టీకాల కార్యక్రమం పుంజుకొని ముందుకు వెళ్ళేకొద్దీ టీకాలిచ్చే ప్రదేశాల సంఖ్య పెంచుకుంటూ పోవాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
****
(Release ID: 1688543)
Visitor Counter : 223
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam