సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కరోనా భారతదేశాన్ని తిరిగి తన అసలు మూలాల్లోకి తీసుకువెళ్ళిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు

సద్గురుతో జరిగిన ఐఐపిఎ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..సామాన్యులకు మంచి జీవనాన్ని కల్పించడమే సుపరిపాలన యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పారు.

Posted On: 09 JAN 2021 3:20PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డోనెర్)మంత్రి (స్వతంత్ర ఛార్జ్), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్షశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ..కరోనా మన అసలు భారతీయ మూలాల్లోకి తిరిగి వెళ్ళడానికి దోహదపడిందని మరియు తరచూ చేతులు కడుక్కోవడం, చేతులు జోడించి నమష్కారం చేయడం వంటి పద్ధతులు మళ్లీ వాడుకలోకి వచ్చాయి.  ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను కోవిడ్ మనందరికి మరోసారి గుర్తు చేసిందని అలాగే సామాజిక దూరం, పరిశుభ్రత, యోగా, ఆయుర్వేదం మరియు సాంప్రదాయ ఔషధం మొదలైన సద్గుణాల గురించి ప్రపంచానికి అవగాహన కలిగించింది. ఇప్పుడు వారంతా దీనిని చాలా విశ్వసించారు. మునుపటి కంటే ఎక్కువ స్థాయిలో యోగా మరియు ఆయుర్వేదం మొదలైన వాటిపై ఆసక్తి నెలకుంది. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ విశ్వసిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపిఎ)లో "ఇన్నర్ ఇంజనీరింగ్-టెక్నాలజీస్ ఫర్ వెల్ బీయింగ్"పై జరిగిన కార్యక్రమంలో సద్గురుతో ఆయన ప్రసంగించారు.



లాక్‌డౌన్‌ కాలంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక విషయాన్ని ప్రధానంగా గమనించారు. చాలా మంది ప్రజలు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు ఒంటరితనం మరియు ఆందోళన వంటి మానసిక ఇబ్బందులను అధిగమించడానికి కూడా యోగాను ఆశ్రయించారు. లాక్డౌన్ కాలంలో యోగా అలవాటుగా మారిన వారు కోవిడ్ దశ ముగిసిన తర్వాత కూడా దాన్ని అభ్యసిస్తూనే ఉంటారు. తద్వారా జీవితాలకు ఇది ఒక వరంగా మారుతుంది అని చెప్పారు.

సుపరిపాలన యొక్క అంతిమ లక్ష్యం సాధారణ పౌరులకు మంచి జీవనాన్ని అందించడమని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రజలను సంతోషంగా ఉంచడంతో పాటు వారి జీవితాలను ఆనందంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న సద్గురుకు ఆయన మద్దతు తెలిపారు.

కఠినమైన వ్యవస్థలపై నమ్మకం లేనివారు భారతదేశంలో ఎక్కువమంది ఉన్నారని సద్గురు తన ప్రసంగంలో వివరించారు. అటువంటి సంస్కృతి దేశంలో ఎప్పుడూ లేదన్నారు. అది ఎల్లప్పుడూ మనం అనుసరించాలని తద్వారా గణతంత్రం వర్ధిల్లుతుందని చెప్పారు.

బాధ్యతాయుతమైన ప్రవర్తనను కరోనావైరస్ కోరుతుందని సద్గురు అన్నారు. సామాన్యులకు ఎక్కువ మేలును అందించడానికి నాయకులకు మరియు నిర్వాహకులకు ఈ బోధన మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.


అలహాబాద్ హైకోర్టు జస్టిస్ ఎం.ఎన్.బండారి, ఐఐపిఎ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శేఖర్‌దత్, ఐఐపిఎ డైరెక్టర్ శ్రీ ఎస్.ఎన్.త్రిపాఠి, సురభి పాండే, అమితాబ్ రంజన్, నవాల్‌జిత్‌ కపూరాండ్ మరియు ఐఐపీఏ ఉన్నతాధికారులు మరియు అధ్యాపక సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1687341) Visitor Counter : 232