మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

దేశంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా తాజా పరిస్థితి

Posted On: 08 JAN 2021 3:33PM by PIB Hyderabad

హర్యానాలోని పంచకుల జిల్లాలోని పౌల్ట్రీ (రెండు పౌల్ట్రీ ఫాంలు)లో,  గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలోని వలస పక్షులలో, రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్, పాలి, జైసల్మేర్, మోహర్ జిల్లాలలో కాకులలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (ఏఐ) పాజిటివ్ నమూనాలను ఐసిఎఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడి ధృవీకరించిన తరువాత ఆయా ప్రభుత్వాలు నివారణ, నిరోధక చర్యలు ముమ్మరం చేశాయి. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం బాధిత రాష్ట్రాలు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని డిపార్ట్మెంట్ సూచించింది. 

ఇప్పటివరకు, ఆరు రాష్ట్రాల (కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు గుజరాత్) నుండి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. కేరళలోని రెండు జిల్లాల్లో కల్లింగ్ కార్యకలాపాలు పూర్తయ్యాయని తెలిసింది. క్రిమిసంహారక ప్రక్రియ జరుగుతోంది.

ఏఐ  చేత ఇంకా ప్రభావితం కాని రాష్ట్రాలు పక్షులలో ఏదైనా అసాధారణమైన మరణాలు సంభవిస్తే అప్రమత్తంగా ఉండాలని, వెంటనే నివేదించమని డిపార్ట్మెంట్ కోరింది, తద్వారా అవసరమైన చర్యలు వేగంగా చేపడతారు.
కేరళ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను పర్యవేక్షించడానికి  ఎపిడెమియోలాజికల్ దర్యాప్తు కోసం కేంద్ర బృందాలను నియమించారు.

 ఢిల్లీలోని డిడిఎ పార్క్ హస్తల్ విలేజ్‌లో 16 పక్షుల అసాధారణ మరణాలు కూడా నమోదయ్యాయి. ఢిల్లీలోని ఎన్‌సిటి డిపార్ట్‌మెంట్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, నమూనాలను  ఐసిఎఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడికి పంపినట్లు, పరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి గురించి పౌల్ట్రీ రైతులు, సాధారణ ప్రజలలో (గుడ్లు మరియు కోడి వినియోగదారులు) అవగాహన చాలా ముఖ్యమైనది. కోడి మరియు గుడ్ల వినియోగంపై వినియోగదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కార్యదర్శి (ఏహెచ్డి) నుండి  ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని పంపారు. ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి తగిన సలహాలు జారీ చేయాలని అభ్యర్థించారు, తద్వారా వదంతులు వల్ల వినియోగదారులలో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే, పౌల్ట్రీ లేదా పౌల్ట్రీ ఉత్పత్తుల భద్రత గురించి అవగాహన పెంచాలని రాష్ట్రాలను అభ్యర్థించారు, 

 

***



(Release ID: 1687228) Visitor Counter : 202