ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజువారీగా తక్కువ కేసుల నమోదును కొనసాగిస్తున్న భారత్; గడచిన 24 గంటల్లో కొత్తగా 18,139 కేసులు

క్రియాశీల కేసులలో కొనసాగుతున్న తగ్గుదల; 2.25 లక్షలకు దిగిన సంఖ్య

82 మందిలో కనిపించిన సార్స్-కోవ్-2 వైరస్ కొత్త మ్యూటెంట్ వేరియంట్

Posted On: 08 JAN 2021 12:06PM by PIB Hyderabad

భారత్ లో క్రమేణా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్న ధోరణి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కేవలం 18,139 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NQOW.jpg

స్థిరంగా కొత్త కేసులు పతనం చెందుతుండడంతో మొత్తం క్రియాశీల సంఖ్యల్లో కూడా తరుగుదల కనిపిస్తోంది. వీటి సంఖ్య దేశవ్యాప్తంగా ఈ రోజు 2,25,449 గా నమోదయ్యాయి. కాబట్టి మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 2.16%కి తగ్గింది. 

గత 24 గుంతల్లో 20,539 మంది కోలుకోవడంతో, నికరంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,634 కి తగ్గాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZUKH.jpg

పై చిత్రం గత 24 గంటల్లో క్రియాశీల కేసుల సంఖ్యలో మార్పును సూచిస్తుంది. 307 కొత్త కేసులతో కలిసి మహారాష్ట్ర అత్యధిక పాజిటివ్ మార్పును నమోదు చేసుకుంది. కేరళలో మాత్రం 613 కేసులు తగ్గి గరిష్ఠ స్థాయిలో నెగెటివ్ మార్పు చోటుచేసుకుంది. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TNRW.jpg

మొత్తం రికవరీలు ఇటీవల ఒక కోటి మార్కును దాటాయి. రోజువారీ రికవరీలలో స్థిరమైన పెరుగుదలతో, ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇది ఈ రోజు 10,037,398 వద్ద ఉంది. రికవరీ రేటు కూడా 96.39 శాతానికి పెరిగింది. కొత్తగా కోలుకున్న కేసులలో 79.96% 10 రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నట్లు గమనించబడింది. కేరళ గరిష్టంగా ఒకే రోజు అత్యధిక రికవరీలను అంటే 5,639 కొత్తగా కోలుకున్న వారి సంఖ్య నమోదయింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 3,350 మంది కోలుకున్నారు, పశ్చిమ బెంగాల్‌లో 1,295 మంది ఉన్నారు. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0045EB0.jpg

 కొత్త వాటిలో 81.22% కేసులు 10 రాష్ట్రాలు మరియు యుటిల నుండి వచ్చినవి.

కేరళలో రోజువారీ అత్యధికంగా 5,051 కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో  3,729, ఛత్తీస్గఢ్ 1,010 కొత్త కేసులతో ఉన్నాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005INM8.jpg

గత 24 గంటల్లో 234 మరణాలు నమోదయ్యాయి. 

మొత్తం కొత్త మరణాలలో  76.50% ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధిక మరణాలు (72) సంభవించాయి. కేరళలో 25, ఢిల్లీలో 19 రోజువారీ మరణాలు నమోదయ్యాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006BW9P.jpg

మిలియన్ జనాభాకి 109 మంది చొప్పున మరణాలు భారత్ లో నమోదయ్యాయి. మిలియన్ జనాభాలో మరణాల సంఖ్య 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో  జాతీయ సగటు కన్నా తక్కువ ఉన్నాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007QNS4.jpg

మరో వైపు 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మిలియన్ జనాభాకి గాను మరణాల సంఖ్య జాతీయ సగటు కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. 

ఢిల్లీ అత్యధికంగా మిలియన్ మందికి 569 మరణాలు సంభవించాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008VUCH.jpg

యూకే లో మొదట గుర్తించిన కొత్త కరోనా వైరస్ కొత్త స్ట్రైన్ వ్యాపించిన వారి సంఖ్య ఇండియాలో 82గా నమోదయింది.   

                                                                                                                                        

****



(Release ID: 1687085) Visitor Counter : 213