ఆర్థిక మంత్రిత్వ శాఖ
జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Posted On:
06 JAN 2021 5:20PM by PIB Hyderabad
జల వనరులు, నదీ అభివృద్ధి, గంగ పునరుద్ధరణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులతో బుధవారం జరిగిన సమావేశంలో జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ (ఎన్ఐపి) అమలు పురోగతిని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్షించారు. ఎన్ ఐపి ప్రాజెక్టుల పురోగతి, ఇప్పటివరకూ అయిన ఖర్చు, ప్రాజెక్టు అమలు సత్వరం చేసేందుకు తీసుకున్న చొరవలపై చర్చించడం ఈ సమావేశపు అజెండా. జాతీయ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడాన్ని పర్యవేక్షించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర శాఖలతో ఆర్థిక మంత్రి నిర్వహించిన రెండవ సమీక్షా సమావేశమిది.
కోవిడ్ మహమ్మారి వేధిస్తున్నప్పటికీ, ఎన్ ఊపి చెప్పుకోదగిన పురోగతిని సాధించిందని వివరించడం జరిగింది. ఎన్ ఐపిని 6,835 ప్రాజెక్టులతో ప్రారంభించగా, ఇప్పుడు అది 7,300 ప్రాజెక్టులుగా విస్తరించింది. ఆర్థిక సంవత్సరం 21, రెండవ త్రైమాసికంలో ప్రాజెక్టు అమలు, వ్యయంలో అనేక మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు చెప్పుకోదగిన పురోగతిని చూపాయి. ఇందుకు అదనంగా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్లు ఆర్థిక సంవత్సరం 20 లో వాస్తవ వ్యయం కన్నా కూడా మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని ఎక్కువగా ఆర్థిక సంవత్సరం 21 లో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ రెండు మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్లుకు వార్షిక లక్ష్యంగా పెట్టుకున్న, మౌలిక సదుపాయాలపై ఖర్చుకు అదనంగా చేసిన వ్యయం, వీటిని వేగవంతం చేయడానికి తీసుకున్న వివిధ చొరవలను కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. ఆరోగ్య& కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూ.80,915 కోట్ల విలువైన 24 ప్రాజెక్టులను, నీటి వనరుల శాఖ కింద గల రూ.2,79,604 కోట్ల విలువైన 10 భారీ ప్రాజెక్టులను, నదీ అభివృద్ధి & గంగ పునరుద్ధరణ ప్రాజెక్టుల ఎదురవుతున్న సమస్యలతో పాటుగా వివరణాత్మకంగా సమీక్షించారు.
తన పౌరులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించి, జీవన సౌలభ్యాన్ని కల్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చొరవల్లో ఎన్ ఐపి భాగమని, పురోగతిని సమీక్షిస్తూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని ఎన్ ఐపి ప్రాజెక్టులను ప్రభావవంతంగా అనుకున్న సమయానికి పూర్తయ్యేలా ప్రోత్సహించి, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయంగా వ్యవహరిస్తూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవలసిందిగా రెండు మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్లను ఆర్థిక మంత్రి కోరారు. భావి పెట్టుబడుదారులతో చర్చలు నిర్వహించడం ద్వారా పెట్టుబడులు పెట్టదగిన ప్రాజెక్టులను ప్రోత్సహించవలసిందిగా మంత్రిత్వ శాఖలను/ డిపార్ట్‌మెంట్లను ఆమె కోరారు. ఎటువంటి సమస్యలు లేకుండా జాతీయ మౌలిక సదుపాయాలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు వీలుగా వాటికి సంబంధించిన పురోగతిని తాజాపరుస్తూ ఉండవలసిందిగా మంత్రిత్వ శాఖలను కోరారు.
***
(Release ID: 1686625)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam