ప్రధాన మంత్రి కార్యాలయం

వెస్ట‌ర్న్‌ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ కు చెందిన‌ న్యూ రేవారి- న్యూ మదార్ సెక్ష‌న్ ను జ‌న‌వ‌రి 7 న దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

విద్యుత్తు మార్గం లో న‌డిచే 1.5 కి.మీ. పొడ‌వైన ప్రపంచంలోకెల్లా డబుల్ స్టాక్ కంటేన‌ర్ ట్రైన్ కు ప్రారంభ సూచక ప‌చ్చజెండా ను కూడా ఆయ‌న చూప‌నున్నారు

Posted On: 05 JAN 2021 3:51PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డ‌బ్ల్యుడిఎఫ్‌సి) లో భాగ‌మైన 306 కిలో మీట‌ర్ల న్యూ రేవారీ - న్యూ మ‌దార్ సెక్ష‌న్ ను ఈ నెల 7 న ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు.  ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా న్యూ అతేలీ - న్యూ కిష‌న్‌గ‌ఢ్ మ‌ధ్య విద్యుదీక‌రించిన రైలు మార్గం లో సాగిపోయే 1.5 కి. మీ. పొడ‌వైన, ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి డబుల్ స్టాక్ కంటేన‌ర్ ట్రైన్ కు ప్రారంభ సూచక ప‌చ్చ‌జెండా ను కూడా ఆయన చూపించనున్నారు.  ఈ సంద‌ర్భం లో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్ తో పాటు రాజ‌స్థాన్, హ‌రియాణా ల గ‌వ‌ర్న‌ర్ లు, ముఖ్య‌మంత్రులు కూడా పాల్గొంటారు.

డ‌బ్ల్యుడిఎఫ్‌ సి లోని న్యూ రేవారీ - న్యూ మ‌దార్ సెక్ష‌న్ ను గురించి:

వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని న్యూ రేవారీ - న్యూ మ‌దార్ సెక్ష‌న్ హ‌రియాణా లో (ఇంచుమించుగా 79 కిలో మీట‌ర్ల మేర, మ‌హేంద్ర‌గ‌ఢ్, రేవారీ జిల్లాల పరిధి లో),  రాజ‌స్థాన్ లో ( దాదాపుగా 227 కి. మీ. మేర, జయ్ పుర్‌, అజ్మేర్‌, సీక‌డ్, నాగౌర్‌, అల్ వార్ జిల్లాల ప‌రిధి లో) నెలకొంది.  దీనిలో కొత్త‌ గా నిర్మించిన 9 డిఎఫ్‌సి స్టేశన్ లు ఉన్నాయి.  వాటిలో ఆరు క్రాసింగ్ స్టేశన్ లు.. వాటి పేరు లు న్యూ దాబ్ లా, న్యూ భ‌గేగా, న్యూ శ్రీ మాధోపుర్ , న్యూ పాచర్ మాలిక్‌పుర్‌, న్యూ స‌కున్‌, న్యూ కిశన్‌గ‌ఢ్‌ లు కాగా, మ‌రో మూడు జంక్ష‌న్ స్టేశన్ లు గా ఉన్నాయి. జంక్షన్ స్టేశన్ ల పేరు లు .. న్యూ రేవారీ, న్యూ అతేలీ, న్యూ ఫులేరా.

ఈ మార్గాన్ని ప్రారంభించ‌డం ద్వారా రాజస్థాన్, హరియాణా లలోని రేవారీ - మానేస‌ర్‌, నార్‌ నౌల్‌, ఫులేరా, కిశన్‌గ‌ఢ్ ప్రాంతాల‌ లోని వివిధ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌యోజ‌నక‌రంగా ఉండటమే కాకుండా క‌థువాస్ లో గ‌ల కాన్‌కార్ (CONCOR) కు చెందిన కంటేన‌ర్ డిపో ను కూడా మ‌రింత మెరుగైన విధంగా ఉప‌యోగించుకోవ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది.  ఈ సెక్ష‌న్ గుజ‌రాత్ లోని కాండ్‌ లా, పిపావావ్‌, ముంద్రా, ద‌హేజ్ నౌకాశ్ర‌యాల‌తో అంత‌రాయం లేన‌టువంటి సంధానానికి సైతం పూచీపడుతుంది.

ఈ సెక్ష‌న్ ను ప్రారంభించ‌డం ద్వారా, డ‌బ్ల్యుడిఎఫ్‌ సి కి, ఈస్ట‌ర్న్‌ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఇడిఎఫ్ సి) కి న‌డుమ అవ‌రోధాలు అంటూ ఉండ‌నటువంటి సంధానం సాధ్య‌ప‌డుతుంది.  ఇడిఎఫ్‌సి లో 351 కి.మీ. మేర సాగే న్యూ భావూపుర్‌ - న్యూ ఖుర్జా సెక్ష‌న్ ను ప్ర‌ధాన మంత్రి కింద‌టి ఏడాది లో డిసెంబ‌ర్ 29 న దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.  

డ‌బుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటేన‌ర్ ట్రైన్ కార్యక‌లాపాలు

డ‌బుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటేన‌ర్ ట్రైన్ 25 ట‌న్నుల  యాగ్జిల్ లోడు ను క‌లిగి ఉంటుంది.  దీనిని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డిఎఫ్‌సిసిఐఎల్) కోసం రిసర్చ్ డిజైన్స్ ఎండ్ స్టాండర్డ్ స్ ఆర్గనైజేశన్ (ఆర్‌డిఎస్ఒ) కు చెందిన సరకుల పెట్టెల విభాగం రూపొందించింది.  బిఎల్‌సిఎస్‌-ఎ, బిఎల్‌సిఎస్‌-బి వేగ‌న్ ప్రోటోటైపు ల ప్ర‌యోగాత్మ‌క ప‌రుగు ఇప్ప‌టికే పూర్తి అయింది.  సామ‌ర్ధ్య వినియోగాన్ని వీలైనంత ఎక్కువ స్థాయికి చేర్చ‌డంతో పాటు, పాయింట్ లోడింగు కు ఈ డిజైను వీలు క‌ల్పిస్తుంది.  ఈ సరకుల పెట్టె లు భార‌తీయ రైల్వేల లో ప్ర‌స్తుతం న‌డుస్తున్న కంటేన‌ర్ యూనిట్ ల‌తో పోలిస్తే నాలుగింత‌ల లోడు ను మోసుకు పోగ‌లుగుతాయి.  

డిఎఫ్‌సిసిఐఎల్ స‌ర‌కు ర‌వాణా రైళ్ళ ను భార‌తీయ రైల్వే మార్గాల‌లో ప్ర‌స్తుత గ‌రిష్ట వేగం అయిన గంట‌ కు 75 కిలో మీట‌ర్ల (75 కెఎమ్ పిహెచ్) తో పోలిస్తే గంట‌కు 100 కి. మీ. (100 కెఎమ్ పిహెచ్) గ‌రిష్ట వేగంతో న‌డ‌ప‌నుంది; కాగా, స‌ర‌కు ర‌వాణా రైళ్ళ స‌రాస‌రి వేగం సైతం భార‌తీయ రైల్వేల మార్గాల‌లో ఇప్పుడున్న గంట‌ కు 26 కి.మీ. (26కెఎమ్ పిహెచ్) వేగం నుంచి డిఎఫ్‌సి (డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్) పై గంట‌ కు 70 కి.మీ. (70కెఎమ్ పిహెచ్) కి పెర‌గ‌నుంది.



 

***


(Release ID: 1686389) Visitor Counter : 270