ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల తగ్గుముఖం, చికిత్సలో ఉన్నది 2.5 లక్షల లోపు 37 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
प्रविष्टि तिथि:
03 JAN 2021 9:55AM by PIB Hyderabad
భారత్ లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 2,47,220 కి చేరింది.

29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్న కేసులు 10,000 లోపే ఉన్నాయి.

రోజువారీ కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. 37 రోజులుగా ఇదే ధోరణి కనబడుతూ ఉంది. గత 24 గంటలలో నమోదైన కొత్త కేసులు 18,177 కాగా కోలుకున్నవారు 20,923 మంది.
కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉండటంతో కోలుకున్న శాతం 96.16% కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 99,27,310 అయింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవరికి మధ్య తేడా 96,80,090 కు చేరింది.

కొత్తగా కోలుకున్నవారిలో 78.10% మంది 10 రా ష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా ఒకే రోజు 4,985 మంది, మహారాష్ట్రలో 2,110 మంది, చత్తీస్ గఢ్ లో 1,963 మంది కోలుకున్నారు.

81.81% కొత్త కేసులు 10 రాష్ట్రాలకు చెందినవి కాగా కేరళలో అత్యధికంగా కొత్త కేసులు వచ్చాయి.

గత 24గంటలలో 217 మంది మరణించగా, వారిలో 69.59% మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 51మంది మరణించగా కేరళలో 28మంది, పశ్చిమబెంగాల్ లో 21 మంది చనిపోయారు.

***
(रिलीज़ आईडी: 1685858)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam