ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీఎస్టీ అమలు నుంచి వసూలు చేసిన జీఎస్టీ ఆదాయంలో అత్యధిక ఆదాయం డిసెంబర్ 2020లో నమోదు
డిసెంబర్ మాసంలో రూ. 1,15,174 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం వసూలు
గత ఏడాది ఇదే నెల జీఎస్టీ ఆదాయాలతో పోలిస్తే డిసెంబర్ 2020లో వసూలు అయిన ఆదాయం 12% అధికం
Posted On:
01 JAN 2021 1:21PM by PIB Hyderabad
డిసెంబర్ నెల 2020కు గాను వసూలు చేసిన స్థూల జీఎస్టీ రూ. 1,15,174 కోట్లు కాగా, ఇందులో రూ. 21,365 కోట్లు సిజీఎస్టీ, రూ. 27,804 కోట్లు ఎస్జీఎస్టీ, రూ. 57,426 కోట్లు ఐజీఎస్టీ (సరుకు ఎగుమతి, దిగుమతులపై వసూలు చేసిన రూ. 27,050 కోట్లు సహా). డిసెంబర్ 31, 2020 వరకు నవంబర్ మాసపు మొత్తం జిఎస్టీఆర్- 3బి రిటర్నులు 87 లక్షలుగా ఉన్నాయి.
ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి రూ. 23,276 కోట్లను సీజీఎస్టీగా, రూ. 17,681 కోట్లను ఎస్జీఎస్టీకి సాధారణ పరిష్కారంగా నిర్ధారించింది. సాధారణ పరిష్కారం అనంతరం డిసెంబర్ 2020లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం ఆదాయం రూ. 44,641 కోట్లు సీజీఎస్టీ, రూ. 45, 485 కోట్లు ఎస్జీఎస్టీ.
ఇటీవలి కాలంలో జీఎస్టీ ఆదాయాలు కోలుకుంటున్న సరళి కనిపిస్తున్నందున, డిసెంబర్ 2020లో జీఎస్టీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% అధికంగా ఉంది. ఈ మాసంలో సరుకు ఎగుమతి, దిగుమతుల ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చినదానికన్నా 27% అధికంగా ఉండగా, దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన (సేవల దిగుమతులు సహా) పై వచ్చినది 8% అధికం.
జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి వచ్చిన జీఎస్టీ ఆదాయాలలో డిసెంబర్ 2020లో తొలిసారి రూ. 1.15 లక్షల కోట్లను దాటి అత్యధిక జీఎస్టీ ఆదాయంగా నమోదు అయింది. ఇప్పటి వరకూ అత్యధికంగా వసూలు అయిన జీఎస్టీ వసూలు రూ. 1,13,866 కోట్లుగా ఉంది, ఇది 2019 ఏప్రిల్ నాఇ సంగతి. సాధారణంగా ఏప్రిల్‌లో ఆదాయాలు అధికంగా ఉంటాయి, ఎందుకంటే అది ఆర్థిక సంవత్సరపు ముగింపు వల్ల మార్చిలో దాఖలు చేసే రిటర్న్‌ల వల్ల జరుగుతుంది. డిసెంబర్ 2020 ఆదాయం గత నెల వసూలు అయిన రూ.1,04,963 కోట్లతో పోలిస్తే చెప్పుకోదగినంతగా ఎక్కువగా ఉంది. గత 21 నెలల నుంచి వస్తున్న నెలవారీ ఆదాయాలలో ఇది అత్యధిక వృద్ధి. ఇది, మహమ్మారి అనంతరం వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ, జీఎస్టీ ఎగవేతదారులకు, నకిలీ బిల్లులు పెట్టే వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్త చర్యలతో పాటుగా ఇటీవల ప్రవేశపెట్టిన అనేక వ్యవస్థాగతమైన మార్పుల కారణంగా జరిగింది. ఈ చర్యలన్నీ కూడా మెరుగైన నిబద్ధతకు దారి తీసాయి.
జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత నేటి వరకు, జీఎస్టీ ఆదాయాలు రూ. 1.1 లక్ష కోట్ల ఆదాయాన్ని అధిగమించింది మూడు సార్లు మాత్రమే. కోవిడ్ సంక్షోభానంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న చిహ్నాలు చూపుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా మూడవ నెల జీఎస్టీ ఆదాయాలు రూ. 1 లక్ష కోట్లను దాటాయి. జీఎస్టీ ఆదాయాల సగటు వృద్ధి రెండవ త్రైమాసికంలో (-)8.2%, ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో (-) 41.0%తో పోలిస్తే గత త్రైమాసికంలో7.3%గా ఉంది.
దిగువన ఇచ్చిన చార్టులో ప్రస్తుత సంవత్సరపు నెలవారీ స్థూల జీఎస్టీ సరళులను సూచిస్తుంది. దిగువన ఇచ్చిన పట్టికలో 2019 డిసెంబర్‌తో పోలిస్తే డిసెంబర్ 2020లో ప్రతి రాష్ట్రం నుంచి వసూలు చేసిన రాష్ట్రాల వారీ జీఎస్టీ ఆదాయాలను చూపుతుంది.
***
(Release ID: 1685409)
Visitor Counter : 297
Read this release in:
Odia
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Kannada