ప్రధాన మంత్రి కార్యాలయం
శాంతి, సుసంపన్నత,ప్రజల కోసం భారతదేశం- వియత్ నామ్ ల సంయుక్త దార్శనికత
Posted On:
21 DEC 2020 7:51PM by PIB Hyderabad
భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోదీ, వియత్ నామ్ సమాజవాది గణతంత్రం ప్రధాని మాననీయ శ్రీ గుయెన్ జువాన్ ఫుక్ లు 2020 వ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ న వర్చువల్ పద్ధతిలో జరిగిన శిఖర సమ్మేళనానికి సహా
ధ్యక్షత వహించారు. ఈ సందర్భం లో వారు ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు సహా విస్తృత శ్రేణి అంశాలకు సంబంధించి వారి వారి అభిప్రాయాలను ఒకరితో మరొకరు వెల్లడి చేసుకొన్నారు. భారతదేశం- వియత్ నామ్ భావి సమగ్ర వ్యూహౄత్మక భాగస్వామ్యం, శాంతి, సుసంపన్నత, ప్రజలకు సంబంధించి ఈ కింద ప్రస్తావించినటువంటి సంయుక్త దార్శనికత ను వారు ముందుకు తీసుకువచ్చారు.
శాంతి:
1. వ్యూహాత్మక సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్ష ను ఉభయ పక్షాల నాయకులు వ్యక్తం చేశారు. సంస్థాగతం గా క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి సంస్థాగత సంభాషణలను కొనసాగించాలని, చారిత్రకంగా , సంస్కృతి పరంగా ఉభయ దేశాల మధ్య గల సంబంధాలు పునాది గా ఈ సంభాషణలను కొనసాగించాలని, ఉభయ పక్షాలు అనుసరించే విలువలు, ప్రయోజనాలు, పరస్పర వ్యూహాత్మక విశ్వాసం, అవగాహన, అంతర్జాతీయ చట్టానికి నిబద్ధత వంటి వాటిని కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి , ఒక పక్షం జాతీయ అభివృద్ధి కి మరొక పక్షం మద్దతివ్వడం తో పాటు శాంతియుతమైన, సుస్థిరమైన, భద్రమైన, స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన, సమ్మిళితమైన, నిబంధనలకు లోబడిన ప్రాంతం సాధన కు కృషి చేయాలని నిర్ణయించారు.
2. ఈ ప్రాంతంలోనూ, ఈ ప్రాంతానికి ఆవల భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక స్థితిగతులు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో పరస్పర సహకారానికి గల ప్రాధాన్యాన్ని ఉభయ దేశాల నేతలు గుర్తించారు. భారతదేశం, వియత్ నామ్ ల మధ్య విస్తారిత రక్షణ సంబంధ భాగస్వామ్యం, భద్రత సంబంధ భాగస్వామ్యం ఇండో- పసిఫిక్ ప్రాంతం లో స్థిరత్వానికి ఒక కీలక అంశం కాగలుగుతుందని వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఇరువైపులా తమ సైనిక దళాల నుంచి సైనిక దళాలకు మార్పిడులు, శిక్షణ, సామర్ద్యాల పెంపు, అలాగే రక్షణ పరిశ్రమ రంగం లో పరస్పర సహకారం ,వియత్ నామ్ కు భారత డిఫెన్స్ క్రెడిట్ లైన్స్ వర్తింపు విషయం లో సహకారం వంటి వాటిని తీవ్రతరం చేయనున్నారు. పరస్పర లాజిస్టిక్ మద్దతు ద్వారా రక్షణ రంగ మార్పిడులను సంస్థాగతం చేయనున్నారు. అలాగే రెగ్యులర్ శిప్ విజిట్ లు,సంయుక్త విన్యాసాలు, సైన్యం, విజ్ఞానశాస్త్రం & సాంకేతిక విజ్ఞానం రంగం లో పరస్పర ఇచ్చి పుచ్చుకోవడాలు, మిలిటరీ సైన్స్ & టెక్నాలజీ , సమాచార మార్పిడి, ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ లో సహకారం వంటివి ఇందులో ఉన్నాయి. సైబర్, సముద్ర రవాణా రంగాలు, ఉగ్రవాదం వంటి అంశాలలో సంప్రదాయకంగా, సంప్రదాయేతరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇరువైపులా మరింత సన్నిహితంగా సంస్థాగత చర్చలు కొనసాగనున్నాయి. అవసరమైన సందర్భాలలో న్యాయ, చట్టపరంగా కూడా సహకరించుకుంటారు.
3. సుసంపన్నత, భద్రత లకు సంబంధించి ఉన్న సంబంధాన్ని అనుసంధానిస్తూ దక్షిణ చైనా సముద్ర ప్రాంతం లో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రత, సుస్థిరత ను, శాంతి ని కాపాడాల్సిన ఆవశ్యకత ను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. బల ప్రయోగానికి, బెదరింపులకు ఆస్కారం లేకుండా అంతర్జాతీయ చట్టాల ప్రకారం వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రత్యేకించి 1982 నాటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (యు ఎన్ సిఎల్ఒ ఎస్) ప్రకారం శాంతియుతం గా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం. ఈ ప్రాంతం లో శాంతి, సుస్థిరతకు వీలుగా అలాగే ఈ ప్రాంతం లో నిస్సైనికీకరణ ప్రాధాన్యాన్ని ఇరువురు నాయకులూ గుర్తించారు. అలాగే ఈ ప్రాంతం లో అన్ని దేశాలు సంయమనం పాటించాలని, ఈ ప్రాంతం లో శాంతికి , సుస్థిరతకు ఏమాత్రం భంగం కలగకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. యుఎన్‌సిఎల్ ఒ ఎస్ ఫ్రేమ్‌వర్క్ కు లోబడి మహాసముద్రాలు, సముద్రాలకు సంబంధించిన కార్యకలాపాలను కొనసాగించాలని, సముద్ర జల రవాణాకు సంబంధించి న హక్కుకు యుఎన్‌సిఎల్ ఒఎస్ ప్రాతిపదికగా ఉండాలని , అలాగే సముద్ర రవాణా జోన్ విషయంలో సార్వభౌమత్వ హక్కులు, పరిధి, చట్టబద్ధ ప్రయోజనాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతం లో కోడ్ ఆఫ్ కాండక్ట్ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయ పడ్డారు. ప్రత్యేకించి యుఎన్‌సిఎల్ఒఎస్ చట్టబద్ధ హక్కులకు ఏమాత్రం భంగం కలిగించరాదని, ఈ చర్చలలో సంబంధం లేని పక్షాల ప్రయోజనాలకు కూడా భంగకరం కారాదని అభిప్రాయపడ్డారు.
4. ఈ ప్రాంతంలో శాంతిని, సుస్తిరతను , సుసంపన్నత ను కొనసాగించడంలో ఆసియాన్ -ఇండియా ప్రాధాన్యాన్ని ఉభయ నాయకులు గుర్తించారు. ఆసియాన్- ఇండియా ల మధ్య కీలక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు గల అవకాశాలను ఉభయ నాయకులు స్వాగతించారు. ఇండియా- పసిఫిక్, భారతదేశానికి చెందిన ఇండో- పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్(ఐపిఒఐ), ఇండో పసిఫిక్ ప్రాంతం లో , ఆసియాన్ కేంద్రిత అంశాలపై ఉమ్మడి అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సముద్ర ఆర్ధిక వ్యవస్థ, జలమార్గ రవాణా భద్రత, రక్షణ, సముద్ర పర్యావరణం, సుస్థిరత, సముద్ర వనరుల వినియోగం, సముద్ర మార్గ అనుసంధానత వంటి వాటి విషయం లో నూతన ,వాస్తవిక సహకారానికి కృషి చేయాలని, సామర్ధ్యాలను నిర్మించేందుకుగల అవకాశాలను ఉభయ పక్షాలూ అవకాశాలను పరిశీలించనున్నాయి.
5. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల విషయం లో తమ ఉమ్మడి వైఖరులలోని బలాలలను స్వీకరిస్తూ అంతర్జాతీయ చట్టాలు , నిబంధనల ఆధారిత ఆర్డర్‌పట్ల వారికి గల గౌరవానికి, అంతర్జాతీయ అంశాల విషయంలో సమష్టితత్వం, సమానత్వం పట్ల గల విశ్వాసానికి గౌరవమిస్తూ ఉభయ పక్షాలూ ఐక్యరాజ్య సమితితో సహా బహు పక్ష, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాయి. ఆసియాన్ నాయకత్వ యంత్రాంగాలు, మెకాంగ్ సబ్ రీజనల్ సహకారం ఇందులో ఉన్నాయి.
ఉభయ పక్షాలూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలు సంస్కరణలతో కూడిన బహుపక్షీయ సంస్థలుగా ఎదగడానికి, అవి మరింత ప్రాతినిధ్యం కలిగి ఉండేలా , సమకాలీనత ను కలిగి ఉండేలా, ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేలా ఉండాలా చేయడానికి బహుళ పక్ష విధానాన్ని చురుకు గా ప్రోత్సహించనున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణ విషయంలో ఆయా దేశాల అనుభవాలను పంచుకోవడానికి , ఆరోగ్య రంగ ప్రొఫెషనల్స్‌కు ఆన్‌లైన్ శిక్షణ కు మద్దతు, వాక్సిన్ అభివృద్ధి లో సంస్థాగత మద్దతు, ఓపన్ సప్లయ్ చెయిన్ ల ప్రోత్సాహం, ప్రజలు అత్యవసర పనుల నిమిత్తం సరిహద్దులు దాటేందుకు వీలు కల్పించడం,ప్రపంచ ఆరోగ్ సంస్థవంటి బహుళపక్ష సంస్థలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండాలని ఉభయ పక్షాలూ నిర్ణయించాయి.
6. ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్నముప్పు, హింసాత్మక అతివాదం, సమూల సంస్కరణవాదం వంటి వాటి నుంచి ప్రపంచ శాంతి కి, మానవాళి కి ఎదురౌతున్న ముప్పు ను ప్రస్తావిస్తూ, సీమాంతర ఉగ్రవాదం తో సహా అన్నిరూపాలలోని ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనాలని, ఇందుకు మరింత సహకారం తో పాటు ద్వైపాక్షిక కృషి ని, ప్రాంతీయ కృషి ని, అంతర్జాతీయ కృషి ని కొనసాగించాలని ఉభయపక్షాలూనిర్ణయించాయి. ఉగ్రవాదులకు నిధులను సమకూర్చే నెట్‌వర్క్ లు వంటి వాటిపై ద్వైపాక్షిక, ప్రాంతీయ , అంతర్జాతీయ స్థాయిలలో పరస్పర సహకారంతో మరింత సమన్వయంతో ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఉభయ పక్షాలూ అంతర్జాతీయ ఉగ్రవాదం పై సమగ్ర కన్వెన్షన్‌ను వీలైనంత త్వరగా చేపట్టేందుకు బలమైన ఏకాభిప్రాయ సాధనకు సంయుక్త కృషి సాగించాలని ఉభయ పక్షాలూ నిర్ణయించాయి.
సుసంపన్నత :
7. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఏర్పడిన సవాళ్లు,తెచ్చిన అవకాశాలను ఉభయ పక్షాలూ గుర్తిస్తూ,రెండు వైపులా నమ్మకమైన,సమర్ధమైన, సప్లయ్ చెయిన్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేయనున్నాయి. అలాగే మానవ కేంద్రిత ప్రపంచీకరణకు కృషి చేస్తాయి. వీలైనంత త్వరగా 15 బిలియన్ అమెరికన్‌డాలర్ల వాణిజ్య టర్నోవర్ సాధనకు ఉభయపక్షాలూ కృషి చేస్తాయి. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి పటిష్టమైన ప్రణాళికతో, ఆయా దేశాలలోని నూతన సప్లయ్ చెయిన్ ల ఉన్నతస్థాయి లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయనున్నారు.
8. భారతదేశానికి గల భారీ దేశీయ మార్కెట్, స్వావలంబనకు గల దార్శనికత ఒకవైపు, వియత్ నామ్ లో పెరుగుతున్న ఆదేశ ఆర్ధిక వ్యవస్థ, సామర్ద్యాలు మరోవైపు ఉన్నాయి. ఉభయపక్షాల వైపున తమ ద్వైపాక్షిక ఆర్ధిక కార్యకలాపాలను నిరంతరం స్థాయి పెంచనున్నారు. దీనితో ఒక దేశం మరో దేశ ఆర్ధిక వ్యవస్థ లో దీర్ఘ కాలిక పెట్టుబడులకు అవకాశం కల్పించడం, సంయుక్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, నూతన అంతర్జాతీయ వాల్యూ చెయిన్‌లలో పాలు పంచుకోవడం, భౌతిక, డిజిటల్ అనుసంధానత, ఈ కామర్స్‌కు ప్రోత్సాహం, బిజినెస్ ట్రావెల్స్ కు వీలు కల్పించడం,ప్రాంతీయ వాణిజ్య వ్యవస్థ స్థాయి పెంపు, పరస్పరం పెద్ద ఎత్తున మార్కెట్‌కు అనుసంధానత కల్పించడం వంటివాటి స్థాయి పెంచుతారు.
2024 వ సంవత్సం కల్లా భారతదేశం 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఆర్ధిక వ్యవస్థ గా ఎదిగేందుకు పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా భారతదేశం భాగస్వామ్యాలకు సృష్టించిన నూతన అవకాశాలు, మరోవైపు 2045వ సంవత్సరం కల్లా ఉన్నత స్థాయి ఆర్ధిక వ్యవస్థగా ఎదిగేందుకు వియత్ నామ్ పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణం గా ఆర్ధిక వ్యవస్థలోని అన్ని రంగాలలో గల అవకాశాలను పూర్తి స్థాయి లో సద్వినియోగం చేయడం జరుగుతుంది. ఉభయ దేశాలకు చెందిన ఎం.ఎస్.ఎం.ఇలతో పాటు ఫార్మింగ్ కమ్యూనిటీ ల విషయంలోనూ అవకాశాలను సద్వినియోగం చేయడం జరుగుతుంది.
9. అభివృద్ధి, సుసంపన్నతకు ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా రెండు ఆర్ధిక వ్యవస్థలు యువతరాన్ని కలిగిఉన్నాయి. భారతదేశం, వియత్ నామ్ ల మధ్య అభివృద్ధి భాగస్వామ్యం నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, డిజిటైజేషన్, సుపరిపాలన, ప్రజల సాధికారత, సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి ల ఆధారంగా ముందుకు సాగనున్నాయి.
ఇందుకు సంబంధించి ఇరువైపులా భారతదేశానికి చెందిన డిజిటల్ ఇండియా మిషన్, వియత్ నామ్ వారి డిజిటల్ సొసైటీ విజన్, శాంతియుత అవసరాలకు అణు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లలో ట్రాన్స్‌ఫర్మేటివ్ టెక్నాలజీలు,సముద్ర విజ్ఞానం, సుస్థిర వ్యవసాయం, జలవనరుల నిర్వహణ,సమగ్ర ఆరోగ్య సంరక్షణ, ఫార్మాసూటికల్స్, స్మార్ట్ సిటీలు, స్టార్టప్‌ల వంటి వాటిలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తారు.
10. సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులకు సంబంధించినచర్యల విషయంలో తమ నిబద్ధతను ఇరుదేశాల పునరుద్ఘాటించాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా తమ ఇంధన భద్రత సమస్యను పరిష్కరించుకుంటూ ఇరు పక్షాలూ నూతన, నవీకరణయోగ్య శక్తి వనరులను, శక్తి ఆదా, జల వాయు పరివర్తన లను తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పరస్పరం భాగస్వామ్యం వహించనున్నాయి. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) లో వియత్ నామ్ చేరే అవకాశం ఉండడంతో సౌర ఇంధన రంగం లో సహకారానికి నూతన అవకాశాలను ఏర్పరచనుంది. ఇది పెద్ద మొత్తంలో సౌర ఇంధనానికి వీలు కల్పిస్తుంది. అదే సమయంలో చమురు, వాయువు రంగంలో ఎంతోకాలంగా తమ మధ్య ఉ న్నభాగస్వామ్యాన్ని ఉభయదేశాలూ మరింత బలోపేతం చేసుకోనున్నాయి. తృతీయ దేశాలలో అన్వేషణ ప్రాజెక్టులు,డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టులలో కొలాబరేషన్లు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. రెండు వైపులా వాతావరణ మార్పులకు సంబంధించి తమ మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకుంటాయి.ఈ దిశగా సమీపభవిష్యత్తులో విపత్తులను తట్టుకునే మౌలికసదుపాయాల విషయంలో గల కూటమి లో వియత్ నామ్ చేరగలదని భారతదేశం భావిస్తోంది.
11. తమ అభివృద్ధి భాగస్వామ్యం స్థానిక కమ్యూనిటీల విషయంలో నిర్మాణాత్మక, వైవిద్యం తో కూడిన ప్రయోజనాలను అందించగల కీలక పాత్ర ను గుర్తిస్తూ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు తోడ్పాటునందిస్తూ, వియత్ నామ్ లో భారతదేశం అభివృద్ధి సహాయాన్ని, సామర్ధ్యాల నిర్మాణాన్ని మరింత దృఢతరం చేయనున్నారు. అలాగే మెకాంగ్- గంగా సత్వర ప్రభావ ప్రాజెక్టులు, ఐటిఇసి, ఈ- ఐటిఇసి కార్యక్రమాలు భిన్న రంగాలలో విస్తరించనున్నారు.
ప్రజలు:
12. భారతదేశం , వియత్ నామ్ ల మధ్య గల ప్రగాఢ సాంస్కృతిక చారిత్రక బంధాన్ని గుర్తిస్తూ ఇరువైపులా ఉభయ దేశాల సాంస్కృతిక, నాగరిక వారసత్వంపై అవగాహన పరిశోధన ను ప్రోత్సహించడం అలాగే బౌద్ధ ,చామ్ సంస్కృతులు, సంప్రదాయాలు, పురాతన గ్రంధాలపై అవగాహన పరిశోధనను పెంపొందించడం ఉమ్మడి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో పరస్పరసహకారం అభివృద్ధి భాగస్వామంలో కీలక స్తంభంగా ఉండనుంది. సంప్రదాయ వైద్యవిధానలు ఉభయ దేశాలకూ 2వ,3వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఎంతో కీలకమైనవి. వేలాది సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి ని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య వ్యవస్థ లు, వియత్ నామ్ వారి సంప్రదాయ వైద్యం ఆరోగ్యానికి సంబంధించి ఉభయ దేశాలలో ఎన్నో ఉమ్మడి అంశాలను కలిగి ఉన్నాయి. శాంతికి, సామరస్యానికి చిహ్నం గా యోగా రూపుదిద్దుకుంది. ఉభయదేశాలూ తమతమ సంప్రదాయ వైద్య విధానాలను బలోపేతం చేసేందుకు పరస్పరం సహకరించుకోనున్నాయి. అలాగే భారతదేశం - వియత్ నామ్ సాంస్కృతిక, నాగరిక సంబంధాలకు సంబంధించి ఒక ఎన్‌సైక్లోపేడియా ను తీసుకురానున్నారు. దీనిని భారతదేశం- వియత్ నామ్ దౌత్య సంబంధాల 50 వ వార్షికోత్సవాల సందర్భంగా 2022 వ సంవత్సరం లో తీసుకు రానున్నారు.
13. ఇరు దేశాల ప్రజల స్నేహ పూర్వక విశ్వాసాల నుంచి ఉభయ దేశాల సంబంధాలకు మద్దతు, బలం లభించిన వాస్తవాన్ని గుర్తిస్తూ,ఉభయ దేశాలూ ప్రజలకు- ప్రజలకు మధ్యగల సంబంధాలను మరింత పెంచడంతో పాటు, ఉభయదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపడం, సులభతర వీసా ప్రక్రియలను , సదుపాయాలను కల్పించడం ద్వారా రాకపోకలను సులభతరం చేయడం., పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు నిర్ణయించడం జరిగింది. అలాగే పార్లమెంటరీ ఆదాన ప్రదానం, భారతీయ రాష్ట్రాలు, వియత్ నామ్ ప్రావిన్సుల మధ్య సంబంధాల పెంపు, విద్యా సంస్థల మధ్య సమన్వయం, మీడియా, ఫిల్మ్, టివి శో లు, క్రీడా రంగాల మధ్య రాకపోకల పెంపు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశం- వియత్ నామ్ సంబంధాలకు సంబంధించిన అంశాలను ఇరు దేశాల పాఠశాల పాఠ్యపుస్తకాలలో చేర్చనున్నారు.
14. భారతదేశం, వియత్ నామ్ ల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పైన పేర్కొన్న ఉమ్మడి దార్శనిక లక్ష్యాలు కీలకం కానున్నాయని ఉభయ దేశాల ప్రధాన మంత్రులు వారి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2021-23 మధ్య కాలానికి ఉభయ దేశాలూ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ను చేపట్టనున్నాయి.
ఫలితాలు:
(ఎ) ఈ సంయుక్త ప్రకటన ను స్వీకరిస్తూ ఉభయదేశాల నాయకులు 2021-23 కాలానికి కార్యాచరణ ప్రణాళిక పై సంతకం చేయడాన్ని స్వాగతించారు.
(బి) వియత్ నామ్ కు భారతదేశం అందించిచిన డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ 100 మిలియన్ అమెరికన్ డాలర్ల కింద వియత్ నామ్ బార్డర్ గార్డ్ కమాండ్ కోసం హై స్పీడ్ గార్డ్ బోట్ తయారీ ప్రాజెక్టు విజయవంతం గా అమలు జరగుతుండడం పట్ల ఇరువురు ప్రధాన మంత్రులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే పూర్తి అయిన హెచ్.ఎస్.జి.బి ని వియత్ నామ్ కు అప్పగించడం, భారతదేశం లో తయారైన హెచ్.ఎస్.జి.బి ల ఆవిష్కరణ,వియత్ నామ్ లో తయారైన హెచ్.ఎస్.జి.బి. ల పై ఉభయ ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు.
(సి) వియత్ నామ్ లోని నిన్హ్ థువాన్ ప్రావిన్స్ లో స్థానిక సముదాయ ప్రయోజనం కోసం 1.5 మిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని భారత దేశం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అసిస్టెన్సు లో భాగంగా ఏడు అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి కావడం పట్ల ఇరువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
డి) ఎం.ఒ.యులపై సంతకాలు, ఒప్పందాల అమలు ఏర్పాట్లు, వివిధ రంగాలో ద్వైపాక్షిక సహకారంపై ఉభయ ప్రధాన మంత్రులు సంతృప్తి ని వ్యక్తం చేశారు.
సంతకాలు జరిగిన ఎంఓయులు, ఒప్పందాలు :
1. రక్షణ పరిశ్రమ సహకారానికి సంబంధించిన కార్యాచరణ కై ఒప్పందం.
2. న్హా ట్రాంగ్ లోని నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనివర్సిటీ ఆర్మీ సాఫ్ట్ వేర్ పార్క్ కోసం 5 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాంటు కు సంబంధించిన ఒప్పందం.
3. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ లో సహకారానికి సియుఎన్ పికెఒ, విఎన్‌డిపికెఒ ల మధ్య కార్యాచరణ సంబంధిత అవగాహన.
4. భారత అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, వియత్ నామ్ ఏజెన్సీ ఫర్ రేడియేషన్, న్యూక్లియర్ ఎనర్జీ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒయు).
5. సిఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కు, వియత్ నామ్ పెట్రోలియం ఇన్స్ టిట్యూట్ కు మధ్య ఎమ్ ఒయు
6. నేషనల్ సోలర్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా, వియత్ నామ్ క్లీన్ ఎనర్జీ అసోసియేషన్ కు మధ్య ఎమ్ ఒయు.
7. టాటా మెమోరియల్ సెంటర్ కు, వియత్ నామ్ నేశనల్ కేన్సర్ హాస్పిటల్ కు మధ్య ఎమ్ ఒయు.
ప్రకటనలు :
1. సత్వర ప్రభావం కలిగివుండే పరియోజనలను ప్రస్తుతం ఒక సంవత్సరానికి 5 గా ఉండగా, వాటిని పెంచి 2021-2022 ఆర్థిక సంవత్సరం కల్లా ఒక సంవత్సరానికి 10 గా చేయడం.
2. వియత్ నామ్ వారసత్వ పరిరక్షణ (మై సన్‌లోని ఎఫ్ బ్లాక్ ఆలయం, క్వాంగ్ నామ్ లో డోంగ్ డువోంగ్ బౌద్ధ మఠం, ఫు యెన్ లో న్హాన్ చామ్ టవర్) లో కొత్త అభివృద్ధి భాగస్వామ్య పరియోజనల ను చేపట్టడం.
3. భారతదేశం- వియత్ నామ్ నాగరిక, సాంస్కృతిక సంబంధాలపై విజ్ఞాన సర్వస్వం కోసం ఉద్దేశించిన ఒక ద్వైపాక్షిక పరియోజన ను మొదలుపెట్టడం.
***
(Release ID: 1682869)
Visitor Counter : 319
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam