శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ -2020ను రేపు ప్రారంభించనున్న ప్రధాని

డిసెంబర్ 25, 2020న ఐఐఎస్ఎఫ్ -2020 ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు

"శాస్త్రవేత్తలు తమ ప్రతిభను ఇప్పటికే చూపించారు. కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొగలరని మరోసారి నిరూపిస్తారు": డాక్టర్ హర్షవర్ధన్

ఈ 2020 సంవత్సరాన్ని సైన్స్ మురియు సైంటిస్టుల సంవత్సరంగా పిలుస్తారు: డా. హర్షవర్ధన్

ఐదు విభాగాలలో గిన్నిస్ రికార్డుల సాధనకు ఐఐఎస్‌ఎఫ్‌-2020లో ప్రయత్నం

Posted On: 21 DEC 2020 6:12PM by PIB Hyderabad

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 6 వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం మెగా సైన్స్ ఫెస్టివల్ డిసెంబర్ 22 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభోపన్యాసంతో ప్రారంభమవుతుంది. ఐఐఎస్ఎఫ్‌ యొక్క ప్రయాణం 2015 సంవత్సరంలో ప్రారంభమైంది. కొవిడ్ పరిస్థితిల కారణంగా ఐఐఎస్‌ఎఫ్‌-2020 ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతోంది. అలాగే ఇది వర్చువల్‌ విధానంలో జరుగుతున్న అతిపెద్ద సైన్స్ ఫెస్టివల్‌ కాబోతుంది''  అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మరియు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు న్యూ ఢిల్లీలో తెలిపారు. ఐఐఎస్‌ఎఫ్ -2020 కర్టెన్ రైజర్ విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్  ప్రారంభోపన్యాసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేయనుండగా, 2020 డిసెంబర్ 25 న జరిగే ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారని ఆయన మీడియాకు తెలియజేశారు.


కొవిడ్-19 వంటి సంక్షోభ సమయంలో సైన్స్‌తో పాటు మన శాస్త్రవేత్తలు సవాళ్లను అదిగమిస్తూ ముందుకు సాగారని డా. హర్షవర్ధన్ ప్రముఖంగా ప్రశంసించారు. “భారతీయ శాస్త్రవేత్తలు ఈ సందర్భానికి తగిన విధంగా అభివృద్ధి చెందారని తక్కువ వ్యవధిలో శానిటైజర్స్, ఫేస్ మార్కులు , వెంటిలేటర్లు, పిపిఇ కిట్లతో పాటు కోవిడ్ -19 వైరస్‌కు కొత్త మందులు, టీకాలు మరియు జన్యు పరిణామాలను కనుగొన్నారని ” వివరించారు.


మన దేశంలో సైన్స్ ప్రశంసనీయమైన పురోగతిని సాధించిందని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. మనదేశానికి చెందిన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను తెలుసుకుని మనమంతా గర్వపడాలని చెప్పారు. "అందుకే భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని మరియు శాస్త్రవేత్తలను గుర్తించాలన్న భావనతో 2015 నుంచి ప్రతి సంవత్సరం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరుపుతున్నాం. ఇందులో ప్రజలంతా పాల్గొని సైన్స్ ఉత్సవాన్ని జరుపుకుంటారు" అని వివరించారు.


ప్రస్తుతం ఉన్న కొవిడ్-19 వైరస్ యొక్క కొత్త జాతుల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి “శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించుకున్నారు..కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను మళ్లీ ఎదుర్కోగలరని” అని హామీ ఇచ్చారు. అలాగే “ఆరోగ్య సమస్యలపై భారతీయులంతా అప్రమత్తంగా ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరియు అటువంటి పరిస్థితులలో తగిన ప్రవర్తనను అనుసరించడం ద్వారా ప్రజలు తమను తాము రక్షించుకోవడం గురించి తెలుసుకున్నారు ” అని వివరించారు.

డాక్టర్ హర్షవర్ధన్ మరింత వివరిస్తూ “ఐఐఎస్ఎఫ్ వార్షిక కార్యక్రమం. ఇది భారత ప్రభుత్వంతో పాటు డీఎస్‌టీ, డీబిటీ, ఎంవోఈఎఫ్, ఎంవోహెచ్‌డబ్లుఎఫ్‌ అలాగే సీఎస్‌ఐఆర్‌ విజ్ఞానభారతి(విభ) మరియు పెద్ద సంఖ్యలో ఇతర సంస్థల సహకారంతో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం  ఐఐఎస్ఎఫ్ ప్రపంచ ప్రఖ్యాత భారత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస్ రామానుజన్ పుట్టినరోజున డిసెంబర్ 22,2020 న ప్రారంభమై 2020 డిసెంబర్ 25 న ముగుస్తుంది అది మన  భారత మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టినరోజు ”. "ఈ సైన్స్ ఫెస్టివల్ ఒక సైన్స్ ఉద్యమంగా మారింది, దేశంలోని యువత మరియు ప్రజలలో అవగాహన కల్పించడానికి మరియు శాస్త్రీయ నిగ్రహాన్ని పెంపొందించడానికి ఒక శాస్త్రం అని ఆయన అన్నారు.  " సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అండ్ గ్లోబల్ వెల్ఫేర్ " అనే థీమ్‌తో ఈ సంవత్సరం ఉత్సవం జరుగుతుంది. అలాగే ఇది ఆత్మనిర్భర్ భారత్ మిషన్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి శాస్త్రీయ మరియు సాంకేతిక ప్రయత్నాల సహకారాన్ని ప్రదర్శిస్తుంది" అని ఆయన చెప్పారు. ఈ సైన్స్ ఫెస్టివల్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు.

ఐఐఎస్ఎఫ్ -2020 లో జరిగే ఈ భారీ కార్యక్రమంలో భారతదేశంతో పాటు విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, యువతతో పాటు సాధారణ ప్రజలు పాల్గొనడానికి  వర్చువల్ ప్లాట్‌ఫామ్ కొత్త మార్గాలను తెరిచిందని డాక్టర్ హర్షవర్ధన్‌ వివరించారు. గతంలో జరిగిన ఐఐఎస్‌ఎఫ్‌ కార్యక్రమాల విజయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. మరియు మహమ్మారి ఉన్నప్పటికీ, “ఐఐఎస్ఎఫ్-2020 ప్రజలు మరియు కొత్తగా జోడించిన సంఘటనలలో పాల్గొనడంలో కొత్త రికార్డులను సృష్టించవచ్చు, భవిష్యత్తులో ఐఐఎస్ఎఫ్‌లలో వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లను జోడించడం గురించి మనం ఆలోచించవచ్చు” అని అన్నారు. 2020 సంవత్సరాన్ని “సైన్స్ అండ్ సైంటిస్ట్స్ ఇయర్” అని పిలవడం సముచితమన్నారు.

తన స్వాగత ప్రసంగంలో డాక్టర్ శేఖర్ సి. మాండే, డిజి-సిఎస్ఐఆర్ మరియు కార్యదర్శి-డిఎస్ఐఆర్, ఐఐఎస్ఎఫ్ 2020 యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ మెగా సైన్స్ ఫెస్టివల్ లో మొత్తం రిజిస్ట్రేషన్ లక్షను దాటిందని ఆయన అన్నారు. "ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ద్వారా తాము చాలా ప్రోత్సహించబడుతున్నామని  ప్రజలు సైన్స్ ఫెస్టివల్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని మరియు సైన్స్ ను సమాజానికి తీసుకెళ్లడానికి ఐఐఎస్ఎఫ్ ఒక ప్రధాన వేదికగా అవతరించింది" అని ఆయన అన్నారు.

చీఫ్ కోఆర్డినేటర్ మరియు నోడల్ ఇన్స్టిట్యూట్ (సిఎస్ఐఆర్-నిస్టాడ్స్) డైరెక్టర్ డాక్టర్ రంజనా అగర్వాల్ తన ప్రారంభ వ్యాఖ్యలలో మొత్తం సంఘటన గురించి మాట్లాడారు “వర్చువల్ ప్లాట్‌ఫాం సుదూర ప్రాంతాలలో కూడా నివసించే ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. సమాజాన్ని శాస్త్రంతో అనుసంధానించే ప్రత్యేకమైన పండుగ ఇది. ఈ ఉత్సవంలో 41 విభిన్న కార్యక్రమాలు ఉన్నాయి, ఇందులో 13 కొత్త విభాగాలు చేర్చబడ్డాయి మరియు ఈ సైన్స్ ఫెస్టివల్‌లో సమాజంలోని ప్రతి వర్గానికి జ్ఞానోదయం అవుతుంది ” అన్నారు. ఐఐఎస్ఎఫ్ యొక్క ఒక ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జిడబ్ల్యుఆర్)కు ప్రయత్నిస్తున్నామని ఆమె మీడియాకు వివరించారు. ఈ సంవత్సరం మేము ఐదు విభాగాలలో గిన్నిస్ రికార్డులను నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఐఐఎస్ఎఫ్ 2020 లో "సైన్స్ ఫర్ మాస్, సైన్స్ ఫర్ స్టూడెంట్స్, న్యూ ఫ్రాంటియర్స్, ఇండస్ట్రీ అండ్ ఎంఎస్ఎంఇ, సైన్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, సుస్థిర అభివృద్ధి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అనుసంధానాలు మరియు సుస్థిర అభివృద్ధి అనే 9 విభాగాలు ఉన్నాయని వివరించారు.


విజ్ఞానభారతి (విభ) జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీజయంత్ సహస్రబుధే మాట్లాడుతూ ఎస్టీఐ పురోగతిని ముందంజలోనికి తీసుకురావడమే కాక, చరిత్ర, తత్వశాస్త్రం, కళలు, విద్య వంటి మానవీయ శాస్త్రాలతో అనుసంధానం చేయడంతో కొత్త సంఘటనలు ఆలోచనాత్మకంగా రూపొందించబడ్డాయన్నారు. "ఇటువంటి సంఘటనలు పండుగకు విలువను పెంచుతాయి, ఎందుకంటే ఇది మన పురాతన గ్రంథాలలో వేదాలు మరియు ఉపనిషత్తులను కలిగి ఉన్న భారతీయ విజ్ఞాన శాస్త్రం యొక్క గొప్ప సంప్రదాయాన్ని హైలైట్ చేస్తుంది. ఇటువంటి సంఘటనలు పురాతన భారతదేశానికి బలం చేకూర్చిన గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు సాంకేతిక విజయాలు గురించి అవగాహన ద్వారా మంచి విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించే ఉత్సుకతను సృష్టిస్తాయి ”అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఎస్ కార్యదర్శి డాక్టర్ మాధవన్, ఎన్. రాజీవన్, డీబీటీ కార్యదర్శి, డాక్టర్ రేణు స్వరూప్, సైంటిస్ట్ "జీ"డీఎస్టీ, డాక్టర్ సంజీవ్ వర్షిని మురియు ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


ఐఐఎస్ఎఫ్ -2020 గురించి అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా పిఐబి చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, శ్రీ కుల్దీప్ ధత్వాలియా సమాచారం ఇచ్చారు మరియు బ్యూరో ఐఐఎస్ఎఫ్ -2020 లో పిఐబి వెబ్‌సైట్‌లో మైక్రోసైట్‌ను కూడా నిర్మించిందని వివరంగా చెప్పారు. .

ఐఐఎస్ఎఫ్ 2020 ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్), సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి), ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగం (డిబిటి), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంయుక్తంగా విజ్ఞానభారతి సహకారంతో నిర్వహిస్తున్నాయి.. ఈ సంవత్సరం సైన్స్ ఫెస్టివల్‌కు నోడల్ సంస్థ సిఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్ (నిస్టాడ్స్) న్యూఢిల్లీ.

***



(Release ID: 1682559) Visitor Counter : 214