ఆర్థిక మంత్రిత్వ శాఖ
జిఎస్టీ నష్టపరిహారంలో లోటును భర్తీ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ రుణంగా రాష్ట్రాలకు 8వ విడుత రూ. 6,000 కోట్లు విడుదల
నేటివరకు మొత్తం రూ. 48,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు, అసెంబ్లీలు కలిగిన యుటిలకు విడుదల
ఇది రాష్ట్రాలకు ఇచ్చిన రూ. 1,06,830 కోట్ల మేరకు అదనపు రుణాల సేకరణ అనుమతి ఇచ్చిన దానికి అదనం
Posted On:
21 DEC 2020 1:48PM by PIB Hyderabad
జిఎస్టీ నష్టపరిహార లోటును భర్తీ చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు 8వ వార్షిక వాయిదాగా రూ. 6,000 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం సొమ్ములో రూ. 5,516.60 కోట్లను 23 రాష్ట్రాలకు విడుదల చేయగా, రూ. 483.40 కోట్లను శాసన సభలు కలిగి, జిఎస్టీ కౌన్సిల్‌లో సభ్యులైన మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు (ఢిల్లీ, జమ్ము-కాశ్మీర్, పుదుచ్చేరీ)కు విడుదల చేసింది. జిఎస్టీ అమలు కారణంగా ఆదాయ అకౌంట్‌లో మిగిలిన ఐదు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కింకు ఎటువంటి లోటు ఏర్పడలేదు.
ప‌్రస్తుత సంవత్సరం -2020-2021 కాలంలో జిఎస్‌టి వసూలులో ఏర్పడిన 1.10 లక్షల కోట్ల లోటు సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక రుణ గవాక్షాన్ని సృష్టించింది. ఈ గవాక్షం ద్వారానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున భారత ప్రభుత్వం రుణాలు ఇస్తోంది. ఇప్పటివరకు 7 విడతలుగా రుణాలు విడుదల చేయడం జరిగింది. రాష్ట్రాలు కోరిన రుణాన్ని 23 అక్టోబర్, 2020, 2 నవంబర్,2020, 9 నవంబర్,2020 - 23 నవంబర్, 2020 - 1 డిసెంబర్ 2020- 7 డిసెంబర్, 2020 - 14 డిసెంబర్ 2020 - 21 డిసెంబర్ 2020న విడుదల చేయడం జరిగింది.
రాష్ట్రాలకు అందించే నిధుల 8వ విడత మొత్తాన్ని ఈ వారం విడుదల చేశారు. ఈ వారం రుణంగా తీసుకున్న మొత్తంపై వడ్డీ రేటు 4.1902%గా ఉంది. ఇప్పటివరకూ, ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా కేంద్ర ప్రభుత్వం 4.6986% వడ్డీ రేటుతో రూ. 48,000 కోట్ల రూపాయిలను రుణంగా తీసుకుంది.
జిఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన ఆదాయ లోటును పూడ్చేందుకు ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా రుణాలకు అదనంగా భారత ప్రభుత్వం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్డీపి)లో 0.50% మేరకు అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జిఎస్టీ నష్టపరిహార లోటును భర్తీ చేసేందుకు అదనపు ఆర్థిక వనరులను సమకూర్చునేందుకు ఆప్షన్ -1ని ఎంచుకున్న రాష్ట్రాలకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. మొత్తం రూ. 1,06,830 కోట్లు (జిఎస్డీపీలో 0.50%) మేరకు అదనపు నిధులను రుణంగా తీసుకునేందుకు ఈ సౌకర్యం కింద 28 రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది.
ఇప్పటివరకు అదనపు రుణ మొత్తానికి అనుమతి ఇచ్చిన 28 రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని ఇచ్చారు, ప్రత్యేక గవాక్షం ద్వారా సేకరించి, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల వివరాలను దిగువన ఇవ్వడం జరిగింది.
ప్రత్యేక గవాక్షం ద్వారా సేకరించిన మొత్తం, రాష్ట్రాల వారీగా జిఎస్డీపీలో అదనంగా21.12.2020 వరకు తీసుకున్న 0.50% మొత్తం వివరాలు.
***
(Release ID: 1682377)
Visitor Counter : 203
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam