ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ రోద్దం న‌ర‌సింహ క‌న్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 15 DEC 2020 9:55AM by PIB Hyderabad

శ్రీ రోద్దం న‌ర‌సింహ మృతి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘శ్రీ రోద్దం న‌ర‌సింహ భార‌త‌దేశ జ్ఞానం, శోధ‌న ల అత్యుత్త‌మ సంప్ర‌దాయానికి ప్ర‌తిరూపంగా నిలచారు.  ఆయ‌న ఒక శ్రేష్ఠ శాస్త్రవేత్త‌ గా ఉండడం తో పాటు విజ్ఞాన‌శాస్త్రం, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ ల తాలూకు శ‌క్తియుక్తులను భార‌త‌దేశం ప్ర‌గ‌తి కి  వినియోగించడం ప‌ట్ల ఎంతో ఉద్వేగాన్ని క‌న‌బ‌ర‌చారు కూడాను.  ఆయ‌న మ‌ర‌ణం న‌న్నెంతో బాధ‌పెట్టింది.  ఆయ‌న కుటుంబానికి, ఆయ‌న స్నేహితుల‌కు ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***
 


(Release ID: 1680731) Visitor Counter : 133