ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు
3.52 లక్షలకు తగ్గుదల; 149 రోజులలో అత్యల్పం
17 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
మొత్తం కోలుకున్నవారి సంఖ్య 93.88 లక్షలు, కోలుకున్నశాతం 95%
Posted On:
14 DEC 2020 10:44AM by PIB Hyderabad
భారతదేశంలో ఈరోజుకు చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 3,52,586 కు తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా బాగా తగ్గుతూ నేటికి 3.57% కు చేరింది. ఇది గత 149 రోజుల్లో అత్యల్పం. 2020 జులై 18 నాడు 3,58,692 మంది చికిత్సపొందుతూ ఉన్నట్టు రుజువైంది. రోజువారీ కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వల్ల చికిత్సలో ఉన్నవారి సంఖ్యబాగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా గత 24 గంటలలో నికరపు కేసుల తగ్గుదల 3,960 నమోదైంది.
గత 24 గంటలలో 27,071 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 30,695 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 17 రోజులుగా కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటూ వస్తోంది.
కోలుకుంటున్నవారి మొత్తం సంఖ్య 94 లక్షలకు చేరువవుతూ 9,388,159 కు చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం 94.98% చేరింది. కోలుకున్నవారిక, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం 9,035,573 కు చేరింది.
కొత్తగా కోలుకున్న వారిలో 75.58% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా 5,258 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 3,083 మంది, పశ్చిమబెంగాల్ లో 2,994 మంది కోలుకున్నారు.
కొత్తగా వచ్చిన కోవిడ్ పాజిటివ్ కేసులలో 75.82% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నమోదైంది. గత 24 గంటలలో కేరళలో అత్యధికంగా 4,698 కేసులు నమొదు కాగా మహారాష్ట్రలో 3,717, పశ్చిమ బెంగాల్ లో 2,580 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
గత 24 గంటలలో 336 మంది కోవిడ్ బాధితులు మరణించగా వారిలో 79.46% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి. అందుకే మహారాష్ట్రలో 20.83% (70 మరణాలు) నమోదు కాగా పశ్చిమ బెంగాల్ లో 47, ఢిల్లీలో 33 మరణాలు నమోదయ్యాయి.
****
(Release ID: 1680524)
Visitor Counter : 125
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam