ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్న కేసులు మరింత తగ్గి మొత్తం కేసుల్లో.62% కు చేరిక
ఇంకా చికిత్సలో ఉన్నవారి కంటే మొత్తం నమోదైన కేసులు 90 లక్షలు ఎక్కువ
గత వారంలో ప్రతి పది లక్షల్లో మరణాలు అంతర్జాతీయంగా భారత్ లోనే అత్యల్పం
Posted On:
13 DEC 2020 10:52AM by PIB Hyderabad
గత కొద్ది వారాలుగా ఉన్న ధోరణినే భారత్ కొనసాగిస్తూ వస్తోంది. చికిత్సలో ఉన్న కేసులు భారీగా తగ్గుతూ ప్రస్తుతం ఇప్పటిదాకా నమొదైన మొత్తంకేసులో 3.62% కు తగ్గాయి. ప్రతిరోజూ కొత్తకేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య కుదించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 3,56,546 కు చేరింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 30,254 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ కాగా 33,136 మది కొత్తగా కోలుకున్నారు. దీనివల్ల గత 24 గంటలలో నికరంగా 3,273 కేసుల భారం తగ్గింది.
ప్రతి పది లక్షల జనాభాలో కోవిడ్ సోకిన వారి సంఖ్య కూడా ప్రపంచదేసాలతో పోల్చినప్పుడు భారత్ లో తక్కువగా ఉంది. గడిచిన వారంరోజుల్లో పది లక్షలకు 158 చొప్పున మాత్రమే కేసులున్నాయి. ఇది పశ్చిమార్థగోళంలోని చాలా దేశాలకంటే చాలా తక్కువ.
ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 93,57,464 కు చేరింది. కోలుకున్నవారికీ, కొత్తకెసులకూ మధ్య తేడా పెరుగుతూ 90 లక్షలు దాటి ప్రస్తుతం 90,00,918 కు చేరింది. కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 95శాతానికి దగ్గరవుతూ 94.93% అయింది.
కొత్తగా కోలుకున్నవారిలో 75.23% మంది పది రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 5,268 మంది, ఆ తరువాత మహారాష్ట్రలో 3,949 మంది, ఢిల్లీలో మరో 3,191 మంది కోలుకున్నారు.
కొత్త కేసుల్లో 75.71% పది రాష్ట్రాలలో నమోదయ్యాయి. కేరళలో 5,949 కేసులు, మహారాష్ట్రలో 4,259, పశ్చిమబెంగాల్ లో 1,935 కొత్త కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 391 మంది మరణించారు. 24 రాష్ట్రా ల్లో మరణాలు రెండంకెల లోపే ఉన్నాయి.తాజా మరణాల్లో 79.28%కేవలం పది రాష్ట్రాలకు చెందినవి కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 80, ఢిల్లీలో 47, పశ్చిమ బెంగాల్ లో 44 నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు భారత్ లో ప్రతి పది లక్షల కు గత వారం రోజుల్లో అతి తక్కువ మరణాలు నమోదయ్యాయి
***
(Release ID: 1680450)
Visitor Counter : 153
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil