ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబ‌ర్ 12 న ఫిక్కి 93 వ వార్షిక సాధార‌ణ స‌మావేశం, వార్షిక క‌న్వెన్ష‌న్‌నుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 10 DEC 2020 7:04PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ డిసెంబ‌ర్ 12వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఫిక్కీ 93వ వార్షిక సాధార‌ణ స‌మావేశం, వార్షిక క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి వ‌ర్చువ‌ల్ ఫిక్కీ వార్షిక ఎక్స్‌పో 2020నికూడా ప్రారంభించ‌నున్నారు.
ఫిక్కీ వార్షిక స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా డిసెంబ‌ర్ 11,12, 14 తేదీల‌లో జ‌రుగుతుంది. ఈ సంవ‌త్స‌రం వార్షిక స‌ద‌స్సు థీమ్ ఇన్‌స్పైర్డ్ ఇండియా.ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు, ప‌రిశ్ర‌మ అధిప‌తులు, దౌత్య‌వేత్త‌లు, విదేశీ నిపుణులు, ఎంద‌రో నిష్ణాతులు పాల్గొంటారు. ఈ స‌మావేశంలో ఆర్ధిక వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ 19 ప్ర‌భావం, ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు, భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ ముందుకు వెళ్లే మార్గం త‌దిత‌ర అంశాల‌పై వివిధ స్టేక్ హోల్డ‌ర్లు చ‌ర్చిస్తారు.

ఫిక్కి వార్షిక ఎక్స్‌పో 2020 డిసెంబ‌ర్ 11న ప్రారంభమై ఒక ఏడాదిపాటు కొన‌సాగుతుంది. ఈ వ‌ర్చువ‌ల్ ఎక్స్‌పో లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ల ఎగ్జిబిట‌ర్లు త‌మ ఉత్పత్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి త‌ద్వారా త‌మ వ్యాపార అవ‌కాశాల‌ను పెంపొందించుకోవాడానికి వీలు క‌లుగుతుంది.

***


(Release ID: 1679908) Visitor Counter : 159