ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తగ్గుదల బాటలో చికిత్సపొందుతున్న కేసులు;

136 రోజుల తరువాత 4.10 లక్షల దిగువకు

8 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారు అధికం

Posted On: 05 DEC 2020 11:13AM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్ చికిత్సపొందుతున్నవారి సంఖ్య 4.1 లక్షల కంటే దిగువకు చేరి ప్రస్తుతం  4,09,689 దగ్గర ఉంది. 136 రోజుల తరువాత ఇదే చాలా తక్కువ.  ఈ ఏడాది జులై 22న 4,11,133మంది చికిత్సలో ఉన్నట్టు నమోదైంది. కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వలనే ఈ ధోరణి సాధ్యమైంది.  ఫలితంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 4.26% మాత్రమే ఇంకా చికిత్సలో ఉన్నట్టు లెక్క. కొత్తగా కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య  6,393 తగ్గింది.  

 

గడిచిన ఎనిమిది రోజులుగా రోజు వారీ నమోదవుతున్న కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉంటున్నారు.   గత 24 గంటలలో నమోదైన కొత్త కేసులు 36,652 కాగా కోలుకున్నవారు  42,533 మంది.  ఇలా కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం కేసులలో కోలుకున్నవారి శాతం పెరుగుతూ ప్రస్తుతం  94.28% కు చేరింది.

ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 9,058,822 కి చేరింది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా 86.50 లక్షలకు చేరువగా ప్రస్తుతం 8,649,133 దగ్గర ఉంది. కోలుకున్నవారిలో 78.06% మంది పది రాష్ట్రాలకు చెందినవారుగా తేలింది.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 6,776 మంది కోలుకోగా కేరళలో  5,496  మంది, ఢిల్లీలో 4,862  మంది కోలుకున్నారు.

 

WhatsApp Image 2020-12-05 at 10.12.04 AM.jpeg

కొత్తగా పాజిటివ్ గా తేలిన కేసులలో 76.90%  కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 5,718 కొత్త కేసులు రాగా,  మహారాష్ట్రలో 5,229 , ఢిల్లీలో 4,067 వచ్చాయి.

WhatsApp Image 2020-12-05 at 10.10.04 AM.jpeg

గత 24 గంటలలో 512 మంది చనిపోయారు,. వీరిలో 78.32% మంది పది రాష్ట్రాలకు చెందినవారే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 127 మరణాలు, ఆ తరువాత ఢిల్లీలో 73. పశ్చిమ బెంగాల్ లో 52 నమోదయ్యాయి.

 

WhatsApp Image 2020-12-05 at 10.11.08 AM.jpeg

                                                                                                 ****


(Release ID: 1678628)