ప్రధాన మంత్రి కార్యాలయం

బురేవి తుఫాను కారణంగా నెలకొన్న పరిస్థితులపై తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 DEC 2020 8:13PM by PIB Hyderabad

తీవ్రమైన తుఫాను బురేవి కారణంగా, తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరు ఎడప్పాడి కె.పళనిస్వామి తో మాట్లాడారు.

 

అనంతరం ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ"తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎడప్పాడి కె.పళనిస్వామి (@EPSTamilNadu) గారితో టెలిఫోన్ లో మాట్లాడాను.  బురేవి తుఫాను కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై మేము చర్చించాము. తమిళనాడుకు అవసరమైన పూర్తి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతశ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

 

*****


(रिलीज़ आईडी: 1677865) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam