వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2 డిసెంబర్ 2020న వాణిజ్య మండలి సమావేశం

నూతన విదేశీ వ్యాపార విధానం మరియు దేశీయ ఉత్పత్తి మరియు ఎగుమతులు పెంచడానికి అనుసరించవలసిన విధానాలు మరియు తీసుకోవలసిన చర్యల పై ముఖ్యంగా దృష్టిసారించనున్న సమావేశం

Posted On: 01 DEC 2020 12:25PM by PIB Hyderabad

2 డిసెంబర్ 2020, బుధవారం రోజున కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర వాణిజ్య మండలి(బిఓటి) సమావేశం జరుగనుంది.

ఈ సమావేశంలో ప్రధానంగా నూతన విదేశీ విధానం(ఎఫ్టిపి)(2021-26)  మరియు దేశీయ ఉత్పత్తి మరియు ఎగుమతులు పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ప్రపంచ విఫణిలో భారత వ్యాపారాన్ని మెరుగుపరచడానికి అవసరమైన  చర్యల గురించి, అనుసరించాల్సిన నూతన విదేశీ వ్యాపార విధానాన్ని గురించి నిరంతరం దేశీయ వ్యాపార మరియు పరిశ్రమలతో చర్చిస్తూనే ఉంటుంది కేంద్ర వాణిజ్య  మరియు పరిశ్రమల శాఖ. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలను వారి సలహాలను తీసుకోవడంతోపాటు అంతర్జాతీయంగా వ్యాపార రంగంలో వస్తున్న మార్పులు మరియు నూతన విధానాలు, దేశీయ రంగంపై వాటి ప్రభావం మరియు అందుకు తగిన సన్నాహాలు గురించి ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వారితో చర్చిస్తుంది.

ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోం ప్రకాశ్ మరియు శ్రీ హర్దీప్ సింగ్ పూరి మండలిని ఉద్దేశించి మాట్లాడతారు. భారత ప్రభుత్వపు వివిధ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ సిఇఓ, వివిధ ప్రభుత్వ సంస్థల అధిపతులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలివారు ఈ మండలిలో సభ్యులు.

మండలి ఎగుమతులు/దిగుమతుల పరిస్థితిని సమీక్షిస్తుంది, ఆత్మనిర్భర్ భారత్ (మేక్ ఇన్ ఇండియా- సేకరణను కలుపుకుని) క్రింద పెట్టుబడుల ప్రోత్సాహక విధానాన్ని, వ్యాపార మెరుగుదలకు ఇటీవల తీసుకున్న చర్యలు, నూతన లాజిస్టిక్స్ విధానం, కస్టమ్స్ వారు తీసుకున్న వ్యాపార సులభతర చర్యలు, గత వాణిజ్య మండలి సమావేశం నుండి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మరియు సంస్కరణలు, జిఇఎం- వర్తింపు మరియు విస్తరణ, విదేశీ వ్యాపార విధానం గురించిన వివిధ సలహాలు  సూచనల గురించి  సమీక్షిస్తుంది.

***



(Release ID: 1677380) Visitor Counter : 134