ఆర్థిక మంత్రిత్వ శాఖ

న‌వంబ‌ర్ 2020లో వ‌సూలు అయిన రూ.1,04,963 కోట్ల స్థూల జిఎస్‌టి ఆదాయం

Posted On: 01 DEC 2020 1:45PM by PIB Hyderabad

న‌వంబ‌ర్ మాసంలో వ‌సూలు అయిన‌ స్థూల జిఎస్‌టి ఆదాయం రూ. 1,04,963 కోట్లు కాగా, అందులో 19,189 కోట్లు సిజిఎస్‌టి, 25,540 కోట్ల ఎస్‌జిఎస్‌టి, 51,992 కోట్లు ఐజిఎస్‌టి (దిగుమ‌తి చేసుకున్న వ‌స్తువుల‌పై వ‌సూలు చేసిన రూ.22,078 కోట్లు), సెస్ రూ.8,242 కోట్లు (దిగుమ‌తి చేసుకున్న వ‌స్తువుల‌పై వ‌సూలు అయిన రూ.809 కోట్లు స‌హా)గా ఉన్న‌ది. న‌వంబ‌ర్ నెల‌లో 30వ తేదీ వ‌ర‌కు దాఖ‌లు చేసిన మొత్తం జిఎస్‌టిఆర్‌-3బి రిట‌ర్న్స్ రూ.82 ల‌క్ష‌లుగా ఉంది.
ప్ర‌భుత్వం రూ. 22,293 కోట్ల‌ను సిజిఎస్‌టిగా, ఐజిఎస్‌టి నుంచి రూ.16,286 కోట్ల‌ను ఎస్‌జిఎస్‌టిగా సాధార‌ణ ప‌రిష్కారంగా నిర్ణ‌యించింది. న‌వంబ‌ర్, 2020కి గాను సాధార‌ణ ఒప్పందంగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆర్జించిన మొత్తం ఆదాయం సిజిఎస్‌టికి  రూ.41,482 కోట్లు, ఎస్‌జిఎస్‌టికి రూ.41,826 కోట్లు. 
జిఎస్‌టి ఆదాయంలో ఇటీవ‌లి కాలంలోని రిక‌వ‌రీకి అనుగుణంగా, న‌వంబ‌ర్ 2020 నెల‌కు గాను ఆదాయాలు, గ‌త ఏడాది ఇదే నెల జిఎస్‌టి ఆదాయంతో పోలిస్తే 1.4% అధికంగా ఉంది. ఈ నెల‌లో దిగుమ‌తి చేసుకున్న స‌రుకుపై ఆదాయం గ‌త ఏడాది ఇదే నెల‌లో స‌మ‌కూరిన ఆదాయంక‌న్నా  4.9% అధికంగా ఉండ‌గా, దేశీయ లావాదేవీలు (దిగుమ‌తి సేవ‌లు స‌హా)పై ఆదాయం 0.5% అధికంగా ఉంది. 
దిగువ‌న ఇచ్చిన చిత్ర‌ప‌టం ప్ర‌స్తుత సంవ‌త్స‌రంలో నెల‌వారీ స్థూల జిఎస్‌టి ఆదాయాల స‌ర‌ళిని చూపుతుంది. ఈ ప‌ట్టిక న‌వంబ‌ర్ 2019తో పోలిస్తే న‌వంబ‌ర్ 2020లో ప్ర‌తి రాష్ట్రం వ‌సూలు చేసిన జిఎస్‌టి గ‌ణాంకాల‌ను రాష్ట్రాల వారీగా చూపుతుంది. 
న‌వంబ‌ర్ 2020 (1)లో రాష్ట్రాల వారీగా జిఎస్‌టి ఆదాయాల వృద్ధి 

***
 


 



(Release ID: 1677377) Visitor Counter : 249