ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 4.35 లక్షలలోపే
రోజువారీ కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే అధికం
Posted On:
01 DEC 2020 12:12PM by PIB Hyderabad
భారతదేశంలో ఇంకా కోవిడ్ తో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 4,35,603 గా నమోదైమ్ 5 లక్షలకు బాగా దిగువన ఉంది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో బాగా తగ్గిపోయి ప్రస్తుతం 4.6% దగ్గర ఉంది. రోజువారీ కొత్తకేసులకంటే కోలుకుంటున్నవారి సమ్ఖ్యే ఎక్కువగా ఉంటూ వస్తోంది. గత 24 గంటలలో ఆ నికర తగ్గుదల 11,349 కేసులు.
గత 24 గంటలలో కొత్తగా 31,118 కోవిడ్ పాజిటివ్ కేసులు బైటపడ్దాయి.
గత 24 గంటలలో కొన్ని రాష్ట్రాలలో ( కేరళ, ఢిల్లీ, కర్నాటక, చత్తీస్ గఢ్) చికిత్సలో ఉన్న వారి సంఖ్య తగ్గుతూ వస్తుండగా మరికొన్ని రాష్ట్రాలలో ( ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, గోవా) కొత్త కేసులు జోడవుతునాయి.
కొత్త కేసుల సంఖ్య 31,118 కాగా, గత 24 గంటలలో కోలుకున్నవారు 41,985 మంది. దీంతో మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 88,89,585 కు చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం 93.94% కు పెరిగింది. కోలుకున్నవారికి, చికిత్సలొ ఉన్నవారికి మధ్య అంతరం పెరుగుతూ 84,53,982 కు చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 76.82% మంది పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉండగా కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 6,055 మంది, ఢిల్లీలో 5,824 మంది కోలుకున్నారు.
గడిచిన 24 గంటలలో నమోదైన కొత్త పాజిటివ్ కేసులలో 77.79% పది రాష్ట్రాలకు చెందినవే కాగా అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 3837 కేసులు, ఢిల్లీలో 3,726 కేరళలో 3,382 కేసులు వచ్చాయి.
గత 24 గంటలలో 482 మంది చనిపోగా వారిలో 81.12% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. అత్యధికంగా. 22.4% (108) మరణాలు ఢిల్లీలోనే నమోదయ్యాయి. 80 మరణాలతో మహారాష్ట, 48 మరణాలతో పశ్చిమబెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
***
(Release ID: 1677340)
Visitor Counter : 164
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam