శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కరొనా వైరస్ను గుర్తించడానికి సిఎస్ఐఆర్-సిసిఎంబి వారు అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్- ప్రత్యక్ష ఆర్టి-పిసిఆర్ పద్దతికి ఐసిఎంఆర్ వారి ఆమోదం

ఈ విధానంతో అదనపు వనరుల అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న వనరులతోనే పరీక్షలను రెండు నుండి మూడు రెట్లకు పెంచుకునే సామర్థ్యం.

Posted On: 28 NOV 2020 2:58PM by PIB Hyderabad

సార్స్-కొవ్-2ను గుర్తించడానికి సిఎస్ఐఆర్ వారు చేస్తున్న పరిశోధనల్లో ఆ సంస్థవారి భాగమైన హైదరాబాద్లోని  కేంద్ర కణసంబంధిత మరియు పరమాణు జీవశాస్త్ర పరిశోధనా సంస్థ(సిసిఎంబి) ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన సరళమైన మరియు త్వరితగతిన పనిచేయు డ్రై స్వాబ్- ప్రత్యక్ష ఆర్టి-పిసిఆర్ పద్దతికి ఐసిఎంఆర్ వారి ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న గోల్డ్ స్టాండర్డ్ ఆర్టి-పిసిర్ పద్దతిలో సరళమైన మార్పులతో, అదనంగా ఎటువంటి వనరుల అవసరం లేకుండానే ఈ పద్దతి ద్వారా పరీక్షల సంఖ్య రెండు నుండి మూడు రెట్లకు పెరిగే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ఈ పద్దతిని పరీక్షించిన ఐసిఎంఆర్ ఈ పద్దతిలో అనుగుణ్యత 96.9% ఉండటం వలన మరియు తక్కువ ఖర్చుతో త్వరితంగా ఫలితాలు వస్తున్న తీరును గమనించి సిఎస్ఐఆర్-సిసిఎంబి వారి డ్రై స్వాబ్ పద్దతిని కరొనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి వినియోగించాలని సలహా ఇచ్చింది.

 


 

 చిత్రం2: కరొనా వైరస్ పరీక్ష్ కొరకు ఆర్ఎన్ఏ సంగ్రహణం లేని డ్రై స్వాబ్ విధానం  

 


 

సిఎస్ఐఆర్-సిసిఎంబి, హైదరాబాద్ వారు కొరొనా వైరస్ పరీక్షలను ఏప్రిల్ 2020 నుండి నిర్వహిస్తున్నారు. తెలంగాణాలోని ఆరోగ్య కార్యకర్తలతో  పనిచేస్తున్న వీరు పరీక్షలు ఆలస్యం కావడానికి గల కొన్ని కారణాలను గుర్తించారు. కొవిడ్-19 వైరస్ పరీక్షలను త్వరితగతిన చేయడానికిగాను ఆర్ఎన్ఏ సంగ్రహణం లేని డ్రై స్వాబ్ పద్దతిని వీరు అభివృద్ధి చేసారు.

ప్రత్యేకించి  ఈ డ్రై స్వాబ్-ప్రత్యక్ష ఆర్టి-పిసిఆర్ విధానంలో ముక్కులోని స్వాబ్ నమూనాలను పొడిదనంతో సేకరించి వాటిని తరలించడం వలన అవి బయటికి రావడం,  వైరస్ను విస్తరించడాన్ని నిలువరించడం జరుగుతుంది. రెండవది ఆర్ఎన్ఏ సంగ్రహణం లేకపోవడం వలన ఐసిఎంఆర్ వారు సూచించిన  కిట్ ద్వారా ప్రత్యక్ష ఆర్టి-పిసిఆర్ విధానంలో నమూనాల పరీక్ష నిర్వహించవచ్చు. ఆర్ఎన్ఏ సంగ్రహణాన్ని మినహాయించడం వలన సమయం ఆదా అవడంతోపాటు తక్కువ ఖర్చు సంప్రదాయ పద్దతిలో  ప్రస్తతం ఉన్న శిక్షణ పొందిన మానవ వనరులతోనే,  అదనపు వనరుల అవసరం లేకుండానే సమర్థవంతంగా రెండు నుండి మూడు రెట్లు నమూనాలను ఎక్కువగా పరీక్షించవచ్చు.

సిఎస్ఐఆర్  ప్రధాన సంచాలకులు డా. శేఖర్ సి మండే మాట్లాడుతూ  నూతనంగా అభివృద్ధి చేసిన ఈ డ్రై స్వాబ్ ప్రత్యక్ష ఆర్టి-పిసిఆర్ విధానం తక్కువ ఖర్చుతో కూడినదని, క్రొత్త కిట్లు, మానవ వనరులు అవసరం లేకుండానే  సులభంగా అమలు చేయగల విధానమని అన్నారు. ఈ విధానం వలన దేశంలో పరీక్షల సంఖ్యను పెంచడానికి ఇది ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు.

అనంతరం సిసిఎంబి సంచాలకులు డా. రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ యాంత్రీకరణ విధానంతో కూడా సుమారు 500 నమూనాల ఆర్ఎన్ఏ సంగ్రహణానికి 4గంటల సమయం పడుతుంది. విటిఎం మరియు ఆర్ఎన్ఏల సేకరణ ఖర్చుతో కూడుకున్నదే కాక  కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. సాంకేతిక మార్పు వలన పరీక్షల్లో ఖర్చును తగ్గించి సంభావ్యతను  40-50% పెంచుతుందని అన్నారు.

సిఎస్ఐఆర్-సిసిఎంబి వారి సవరించిన ఈ విధానం దేశంలోని   ప్రముఖ సంస్థలైన సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నస్టిక్స్(సిడిఎఫ్డి), ఐఐఎస్ఇఆర్- బెహ్రంపూర్, సిఎస్ఐఆర్-ఎన్ఇఇఆర్ఐ, పుణేలోని జిఎంసిహెచ్-గెనేపథ్, ఐజిజిఎంఎస్హెచ్ మరియు ఎంఏఎఫ్ఎస్యు, నాగపూర్  మరియు  అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ వంటి ఆసుపత్రుల్లో ఉపయోగించడానికి నిశ్చయించారు. సవరించిన  ఈ విధానం  సిఎస్ఐఆర్-సిసిఎంబి  వారి ప్రముఖ జర్నల్లో మరియు  ప్రపంచలోని ఇతర ప్రఖ్యాత శాస్త్ర సాంకేతిక బృందాల వారి ప్రముఖ జర్నల్లో కూడా ప్రచురించబడింది.

***



(Release ID: 1676870) Visitor Counter : 126