ప్రధాన మంత్రి కార్యాలయం

యు.కె. ప్రధానమంత్రి శ్రీ బోరిస్ జాన్సన్ ‌తో మాట్లాడిన - ప్రధానమంత్రి

Posted On: 27 NOV 2020 7:48PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు యు.కే. ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ బోరిస్ జాన్సన్‌ తో ఫోన్ ‌లో మాట్లాడారు.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఇరువురు నాయకులు తమ ఆలోచనలను పరస్పరం పంచుకున్నారు. టీకా అభివృద్ధి మరియు తయారీ రంగంలో భారతదేశం మరియు యు.కె. మధ్య మంచి సహకారాన్ని వారు ఈ సందర్భంగా సమీక్షించారు.

కోవిడ్ అనంతర, బ్రెక్సిట్ అనంతర కాలంలో భారత-యు.కె. ల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్న తమ కోరికను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రీయ పరిశోధన, నిపుణులు, విద్యార్థుల చైతన్యం, రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని పరస్పరం పెంపొందించుకోడానికి అద్భుతమైన అవకాశాలున్నాయని నాయకులిద్దరూ అంగీకరించారు.

వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం మరియు యు.కె. చేతులు కలపడంపై వారు ప్రత్యేక దృష్టి పెట్టారు.  అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి వేదికల క్రింద రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రధానులిద్దరూ ప్రశంసించారు. 

భారత-యు.కె. దేశాల మధ్య భాగస్వామ్యం కోసం ప్రతిష్టాత్మక దీర్ఘకాలిక ప్రణాళికను త్వరగా ఖరారు చేయడానికి ఇరువైపుల అధికారులు తమ కృషి ని కొనసాగిస్తారని ఇరువురు నాయకులు అంగీకరించారు.

 

*****


(Release ID: 1676636) Visitor Counter : 227