PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
26 NOV 2020 5:55PM by PIB Hyderabad


(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఇబి చేపట్టిన నిజనిర్థారణ సమాచారం ఉంటుంది.)
· గత 24 గంటల్లో దేశంలో కోలుకున్న కోవిడ్ బాధితులు 36,367 మంది
· గత 24 గంటలలో కొత్తగా నిర్థారణ అయిన కోవిడ్ కేసులు 44,489
· భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,52,344. ఇవి మొత్తం కేసులలో 4.88%
· జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 93.66%
· భారత్ లో కొత్తకేసులలో 61% కొత్తకేసులు కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచే నమోదు


దేశంలో కొత్త కోవిడ్ కేసుల్లో 61% కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచే
గడిచిన 24 గంటలలో కొత్తగా 44,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60.72% కేవలం ఆరు రాష్ట్రాలలోనే వచ్చాయి. అవి కేరళ, మహారాష్ట, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఇందులో 6491 కేసులతో కేరళ మొదటి స్థానంలో ఉండగ్గా ఆ తరువాత మహారాష్ట్ర (6159), ఢిల్లీ (5246) ఉన్నాయి. గత 24 గంటలలో నమోదైన 524 మరణాలలో 60.50% కేవలం ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లోనే కేంద్రీకృతమయ్యాయి. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవటంలోను, గరిష్ఠంగా మరణాల నమోదులోనూ ఉన్న ఆరు రాష్ట్రాల జాబితాలోనూ మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉమ్మడిగా కనబడతాయి. 99 మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర (65), పశ్చిమబెంగాల్ (51) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,52,344 కు చేరింది. ఇది మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో 4.88%. ఆ విధంగా 5% లోపు ఉంచటం సాధ్యమైనట్టు చూపుతోంది. చికిత్సలో ఉన్న కేసుల్లో 65% కేవలం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఇక్కడే గరిష్ఠంగా కొత్త కేసులు, మరణాలు కూడా నమోదవుతున్నాయి. మొత్తం మరణాలలో 61% కేవలం ఈ 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి ప్రతి పది లక్షల జనాభాలో వస్తున్న కేసులు ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు అయిన 6,715 తో పోల్చినప్పుడు ఎలా ఉన్నాయో ఈ చిత్ర పటం తెలియజేస్తుంది. ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ మరణాలు జాతీయ సగటు అయిన 1.46% తో పోల్చినప్పుడు ఎలా ఉన్నాయో ఈ దిగువ చిత్రపటం తెలియజేస్తుంది. దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారు దాదాపు 87 లక్షలకు చేరుతూ 86,79,138 మందిగా నమోదయ్యారు. ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 93.66% చేరింది. గత 24 గంటలలో 36,367 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోలుకున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకున్నవారు జాతీయ సగటు కంటే తక్కువ నమోదయ్యారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676025
80వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
గుజరాత్ లోని కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గాంధీజీ స్ఫూర్తిని, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంకితభావాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు అని వ్యాఖ్యానించారు. ఇదే రోజు 2008 లో జరిగిన తీవ్రవాదుల దాడిని గుర్తు చేస్తూ, బాధితులకు, అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులర్పించారు. భారతదేశం సరికొత్త తీవ్రవాదాన్ని ఎదుర్కుంటోందన్నారు. మనకు కష్టకాలంలో సహాయపడేది మన రాజ్యాంగమేనన్నారు. కరోనా సంక్షోభం నుంచి భారత ఎన్నికల వ్యవస్థ సులభంగా కోలుకున్నదన్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువ ఫలితం అందించటంతోబాటు జీతంలో కోత భరించి కరోనామీద పోరులో తమవంతు పాత్ర పోషించిన పార్లమెంట్ సభ్యులను ప్రధాని అభినందించారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676135
లక్నో విశ్వవిద్యాలయ శతాబ్ది వ్యవస్థాపక దినంలో ప్రధాని ప్రసంగం
లక్నో విశ్వవిద్యాలయ వ్యవస్థాపక శాతాబ్ది వేడుకల సందర్భంగా జరిఒగిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శతాబ్ది స్మారక నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. అదే విధంగా భారత తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక తపాలా బిళ్లను కూడా ఆవిష్కరించారు. లక్నో పార్లమెంట్ సభ్యుడు, కేండ్ర రక్షణశాఖామంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక కళలు, ఉత్పత్తులకు సమ్బంధించిన కోర్సులు నిర్వహించాలని ప్రధాని ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి సూచించారు. స్థానిక ఉత్పత్తులకు విలువ పెంచేలా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. లక్నో చికంకారి, మొరదాబాద్ ఇత్తడి కళాకృతులు, ఆలీగఢ్ తాళాలు, భదోహీ తివాచీలు అంతర్జాతీయంగా పోటీపడేలా వాటి బ్రాండింగ్ కోసం వ్యూహం రూపొందించాలని, ఇవన్నీ విశ్వవిద్యాలయం కోర్సుల్లో భాగం కావాలని అన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675997
లక్నో విశ్వవిద్యాలయ వ్యవస్థాపక శతాబ్ది వేడుకల సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1675853
33వ ’ప్రగతి’ సమాలోచనలకు అధ్యక్షత వహించిన ప్రధాని
ఐటి ఆధారిత బహుళ నమూనా వేదిక అయిన “ ప్రగతి “ సమాలోచనలకు నిన్న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కార్యక్రమాలు సకాలంలో అమలు జరుగుతున్న తీరుమీద సమీక్ష జరిపే ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా సాగుతూ ఉంటుంది. అనేక ప్రాజెక్టులు, సమస్యలు ఈ ప్రగతి కార్యక్రమంలో సమీక్షిస్తారు. రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో సహా వివిధ విభాగాలు పది రాష్ట్రాలలోను, కేంద్ర పాలిత ప్రాంతాలలోను చేపట్టే రూ. 1.41 లక్షలకోట్ల రూపాయల విలువచేసే ప్రాజెక్టులను చర్చకు చేపట్టారు. ఇందులో ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, దాద్రా నాగర్ హవేలి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులను, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను అడిగి ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతునట్టు ధ్రువీకరించుకున్నారు.ఈ సమావేశంలో కోవిడ్-19, పిఎం ఆవాస్ యోజన, పిఎం స్వనిధి, వ్యవసాయ సంస్కరణలు, ఎగుమతుల హబ్ గా జిల్లాల అభివృద్ధి వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675994
విద్యా వవస్థను పునర్మూల్యాంకనం చేసి విలువల ఆధారితంగా సంపూర్ణంగా రూపొందించాలని విద్యారంగ నిపుణులకు, విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి
విద్యారంగ నిపుణులు, విశ్వవిద్యాలయాలు విద్యా వవస్థను పునర్మూల్యాంకనం చేసి విలువల ఆధారితంగా సంపూర్ణంగా రూపొందించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సిక్కింలోని ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయం వారి 13వ ఈ- స్నాతకోత్సవంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. వేదకాలం నాటి విద్యావిధానం నుంచి నేర్చుకున్న అంశాల నుంచి నేర్చుకోవాలని, నూతన విద్యావిధానం వెనుక ఉన్న దూరదృష్టిని అర్థం చేసుకోవాలని కోరారు. తప్పనిసరి అవసరమైన సంస్కరణగా ఆయన నూతన విద్యావిధానాన్ని అభివర్ణించారు. బహుళాంశాల అధ్యయనానికి, పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించటానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీలమీద ఉందన్నారు. కోవిడ్ లాంటి ఆకస్మిక పరిణామాలను సైతం సమర్థంగా ఎదుర్కోగల నైపుణ్యం, సామర్థ్యం అవసరమన్నారు. కోవిడ్ నేర్పిన పాఠాలను నేర్చుకుంటూ పరిష్కారాల దిశగా కృషి చేస్తే భవిష్యత్తులో సమర్థవంతంగా సన్నద్ధంగా ఉంటామన్నారు. కోవిడ్ ఇప్పుడు అందరిముందూ ఉన్న సవాలు అని చెబుతూ, దీనికి పరిష్కారం కోసం టెక్నాలజీని వాడుకోవాలన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాకుండా, ఉద్యోగాలివ్వగలిగేలా వ్యాపార ఆలోచనలకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాపార ఆలోచనలు ప్రధాని దూరదృష్టికి నిదర్శనమైన ఆత్మనిర్భర్ భారత్ మార్గంలో నడపాలన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676140
జర్మనీతో అమ్మకందార్ల-కొనుగోలు దార్ల వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసిన “ అపెడా”
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని శుద్ధి చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (అపెడా) వివిధ ఎగుమతి ప్రోత్సాహక విధానాలలో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు సహాయం చేస్తుంది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో సైతం అపెడా వర్చువల్ మాధ్యమం ద్వారా తన కార్యకలాపాలను కొనసాగించింది. అమ్మకం దారులు, కొనుగోలుదారుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇండియా మిషన్స్ అబ్రాడ్ సహకారంతో దిగుమతి చేసుకునే దేశాలతో ఈ సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో భాగంగానే జర్మన్ దిగుమతిదారులతో నవంబర్ 25న వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. తాజా పండ్లు, కూరగాయలు ఎగుమతి చేసేందుకు బెర్లిన్ లోని భారత రాయబార కార్యాలయ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో 70మ్ మందికి పైగా పాల్గొన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676273
రెండు దశాబ్దాల జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఈ-కార్యక్రమానికి శ్రీపాద నాయక్ అధ్యక్షత
జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఏర్పాటై 20 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఈ నెల 24న జరిగిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ఆయుష్ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బోర్డు 20 ఏళ్ల నివేదికను, ఆయుర్-శాకాహార ఈ-బుక్ ను ఆయన ఆవిష్కరించారు. ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటెచా, బోర్డ్ సభ్యులు ఈ బోర్డు పురోగతిని, సాధనలను, దేశంలో ఆయుర్వేద మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించిన తీరును అభినందించారు. ఇటీవలి కాలంలో ఔష్ధ మొక్కల పెంపకం బాగా పుంజుకుందన్నారు. అయితే, అడవులనుంచి సేకరించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయన్నారు. పెరుగుతున్న డిమాండ్ కు తగినట్టుగా బోర్డు అనేక వృక్ష జాతులను కాపాడాల్సి ఉందని గుర్తు చేశారు.స్థానికంగా అందుబాటులో ఉండే ఔషధ మొక్కలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్లలో, పాటశాలల్లొ వీటి పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676003
ఆయుష్మాన్ భారత్ – పి ఎం జె ఎ వై, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అమలును సమీక్షించిన మంత్రి దాక్తర్ హర్ష వర్ధన్
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు నేషనల్ హెల్త్ అథారిటీ ని సందర్శించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేసానికి అధ్యక్షత వహించారు. వైద్య రంగంలో అత్యంత కీలకమైన ఆరోగ్య సంరక్షణ పథకాలైన ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, నేషనల్ డిజిటల్ మిషన్ ఈ సమీక్షలో ప్రధానాంశాలు. ఆయుష్మాన్ - పిఎం జన్ ఆరోగ్య యోజన ఈ ఏడాది సెప్టెంబర్ 23తో రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వాటి పురోగతిని సమీక్షించారు. భారత్ పథకం పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో సైతం రూ.17,500 కోట్ల విలువచేసే 1.4 కోట్ల నగదు రహిత చికిత్సలు చేయటం వలన నిరుపేదలు కూడా ఆయుష్మాన్ భారత్ – పిఎం జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిపొందారన్నారు. కోవిడ్ తోబాటే ఇతర ముఖ్యమైన వ్యాధులపట్లకూడా జాగ్రత్త తీసుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడిందన్నారు. దీనివలన దాదాపు 35,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా అయ్యాయన్నారు. కోట్లాది అమ్ది ప్రజలు తీవ్రమైన వత్తిడికి లోనవుతున్న సమయంలో ఇది ఎంతో ఊరట ఇచ్చిందని మంత్రి అభిప్రాయపడ్దారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1676081
పిఐబి క్షేత్రస్థాయి అధికారులనుంచి అందిన సమాచారం
• మహారాష్ట్ర: మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, గోవా వెళ్లివచ్చే వారి విషయంలో ప్రామాణిక ఆచరనావిధానాలు అమలులోకి వస్తున్నాయి. వివిధ చెక్ పోస్టులు, రైల్వే స్టేషన్ల దగ్గర స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. నాసిక్ లో ప్రత్యేక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి నాలుగు రాష్ట్రాలనుంచి వచ్చే వారిని పరీక్షిస్తున్నారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ రేయింబవళ్ళూ రైల్వే స్టేషన్ లో స్క్రీనింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. మన్మాడ్, లాసల్ గావ్, నందగావ్, ఇగత్ పురి లో కూడా ఇలాంటి కేంద్రాలున్నాయి. .
• గుజరాత్: రాష్ట్రం నుంచి బైటికి వెళ్ళేవాళ్లందరూ కరోనా పరీక్ష కోసం రూ. 1000 చెల్లించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి కుమార్ కనాని బుధవారం ప్రకటించారు. ఈ నెలలో రెండో విడత గుజరాత్ లో ఒక్క రోజులో కోవిడ్ పాజిటివ్ ల సంఖ్య 1540 దాటింది. 1500 దాటటం ఇది మూడోసారి కూడా. ఇప్పటిదాకా గుజరాత్ లో 2,01,949 కేసులు నమోదు కాగా నేదు 14 మంది మరణించటంతో మొత్తం మరణాలు 3,906 కు పెరిగాయి.
• రాజస్థాన్: ఒక్క సారిగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్ వివాహాలకు హాజరయ్యే అతిథులకు ఉద్వేగపురితమైన పిలుపునిచ్చారు. నవంబర్ 25-డిసెంబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో 20 వేల పెళ్ళిళ్ళు జరుగుతాయని అంచనావేయగా ఒక్క జైపూర్ లోనే 6,000 జరుగుతున్నాయి. అందుకె పెళ్ళిళ్లకు హాజరయ్యే వారందరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వ్యాపించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన వరుస ట్వీట్లు చేసారు. ఈ ఫంక్షన్లలో మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం తప్పకుండా అమలు జరగాలన్నారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య ప్రస్తుతం 26,320 గా ఉంది.
• మధ్య ప్రదేశ్: రాష్ట్రంలోఫ్ గత వారం నుంచి ఇండోర్, గ్వాలియర్, విదిస, శివపురి సహా డజన్ జిల్లాల్లో కోవిడ్ పెరుగుతోంది. భోపాల్ లో పాజిటివ్ శాతం 12, ఇండోర్ లో 10 % పెరిగాయి. ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ అన్ని కోవిడ్ జాగ్రత్తలూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించటం కూడా తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో నవంబర్ 3 నుంచి కేసులు పెరుగుతున్నాయి. చికిత్సలో ఉన్నవారి సంఖ్య 12,979 కి చేరింది. సగటు పాజిటివ్ శాతం 5.5 కు చేరింది. .
• చత్తీస్ గఢ్: చత్తీస్ గఢ్ లో వాక్సినేషన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాధాన్యతా క్రమంలో వాక్సిన్ ఇవ్వటానికి 98% ఆరోగ్యకార్యకర్తల సమాచారం సిద్ధమైంది. 2800 స్థలాలు, 8000 కు పైగా వాక్సినేటర్లను ఎంపిక చేశారు. ఆరోగ్య శాఖ అధికారుల అంచనా ప్రకారం 630 శీతల కేంద్రాలను వాక్సిన్ నిల్వ కోసం సిద్ధం చేశారు. కోవిడ్ పరీక్షలు పెద్ద ఎత్తున జరుపుతున్నారు. . వెలుపలి నుంచి వచ్చే వారికి పరీక్షలు జరిపేందుకు రాయ్ పూర్ లోను, జగదల్పూర్ విమానాశ్రయాల్లోను ఏర్పాట్లు చేశారు.
• గోవా: : గోవాలో బుఅధవారం నాడు తాజాగా 125 కెసులు నమోదు కాగా మొత్తం కెసుల సంఖ్య 47,193 కు చేరింది. మరో నలుగురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 683 కు చేరింది
• సిక్కిం: సిక్కింలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,819 కి చేరింది. బుధవారం నాడు 42 కొత్త కేసులు వచ్చాయి. ఇలా ఉండగా 44 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,395 కు చేరింది. .
• కేరళ: కోవిడ్ మృతులను తాకకుండా అంత్యక్రియలు జరుపుకోవటానికి కేరళ ప్రభుత్వం అనుమతించింది. ప్రార్థనలు జరుపుకోవటం, నీళ్ళు చల్లుకోవటం లాంటి కార్యక్రమాలను అనుమతించారు. రాష్ట్రంలో మొత్తం సంపిల్స్ 60 లక్షలు పైబడటంతో రాష్ట్రం మరో మైలురాయి దాటింది. అయితే పరికరాలు సరిగా పనిచేయటం లేదన్న విమర్శలు వినవచ్చాయి. ఈ మధ్యనే కేరళ 32,122 పరికరాలను ఈ కారణంగానే మహారాష్ట్రకు తిప్పిపంపటం తెలిసిందే.
• తమిళనాడు: పాండిచ్చేరిలోని తుపాను శిబిరాల దగ్గర కోవిడ్ పరీక్షలు మొదలయ్యాయి. కోవిడ్ భయంతో ప్రజలు దూరంగా ఉంటున్నారు. కమ్యూనిటీ హాల్స్ లో, పాఠశాలల్లో 250 సహాయ శిబిరాలు ఏర్పాటయ్యాయి. అయితే 10 శిబిరాలు మాత్రమే నిండాయి. ఒకవైపు కరోనా, మరోవైపు నివర్ తుపాను వరద భయంతో చెన్నై అధికారులు తీవ్ర కలవరం చెందారు. రోజువారీ స్థాయిలో కాకపోయినా జోనల్ స్థాయిలో కరోనా పరీక్షలు కొనసాగించారు. 1,534 కొత్త కోవిడ్ కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 7,74,710కి, మరణాలు 11,655 కి చేరాయి. .
• కర్నాటక: కోవిడ్ కేసులు బాగా తగ్గుతూ ఉండటంతో రాత్రిపూట కర్ఫ్యూ ఉందకపోవచ్చునని భావిస్తున్నారు. అవసరాన్నిబట్టి మాత్రమే విధించే అవకాశం ఉన్నా, ప్రస్తుత పరిస్థితిలో ఆ అవసరం కనబడటం లేదు. కంటెయిన్మెంట్, నిఘా మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటున్నట్టు ఆరోగ్య కమిషనర్ పంకజ్ కుమార్ పాండే చెప్పారు. కోవిడ్ నష్టాలున్ చాలవన్నట్టు స్టీల్ ధరల పెరుగుదలతో వ్యాపార నష్టాలు తప్పకపోవచ్చునని సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భయపడుతున్నాయి. స్టీల్ ధరలు తగ్గించటమో లేదా ధరలను నియంత్రించటమే చేయాలని చిన్న తరహా పరిశ్రమ సంఘం కర్నాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
• ఆంధ్రప్రదేశ్: కొవాక్సిన్ మూడో దశ పరీక్షలు గుంటూరులోని ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రిలో మొదలయ్యాయి. జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద కుమార్ లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఆస్పత్రికి క్లినికల్ ట్రయల్స్ కోసం 1000 డోసులు అందించారు. కరోనా కెసులు తగ్గుముఖం పట్టటంతోమ్ ప్రకాశం జిల్లా అధికారులు అన్ని ప్రైవేత్ కోవిడ్ ఆస్పత్రులనూ డీనోటిఫై చేయటం ద్వారా ఇతర చికిత్సలకు వీలు కుదిరింది. కోవిడ్ బాధితులు ఇప్పుడు రిమ్స్ లో మాత్రమే చికిత్స పొందుతారు.
• తెలంగాణ: బిజెపి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మానిఫెస్టో విడుదలచేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా వాక్సిన్, పరీక్షలు జరుపుతామన్నారు. తెలంగాణ లో ఈరోజు 862 కొత్త కోవిడ్ కేసులు రావటంతో మొత్తం సంఖ్య 2,66,904 కు చేరింది. మరో ముగ్గురు కోవిడ్ తో చనిపోవటంతో మృతుల సంఖ్య 1,444 కు చేరింది.
నిజ నిర్థారణ




*******
(Release ID: 1676278)
Visitor Counter : 269