ప్రధాన మంత్రి కార్యాలయం
అఖిల భారత సభాధ్యక్షుల 80 వ సమావేశం ముగింపు సభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
చట్టాలలోని భాష సరళంగాను, ప్రజలకు అర్థమయ్యేదిగాను ఉండాలి: ప‌్రధాన మంత్రి
‘ఒక దేశం, ఒక ఎన్నిక’ పై చర్చ జరగవలసిన అవసరం ఉంది: ప‌్రధాన మంత్రి
కెవైసి- మీ రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోండి అనేది ఒక పెద్ద రక్షణ గా ఉంటుంది: ప‌్రధాన మంత్రి
Posted On:
26 NOV 2020 2:58PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియా లో ఈ రోజు న అఖిల భారత సభాధ్యక్షుల 80వ సమావేశం ముగింపు సభ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ఇది గాంధీ జీ తాలూకు ప్రేరణాత్మక ఆలోచనల తో పాటు సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ నిబద్ధత ను కూడా గుర్తు కు తెచ్చుకోవలసిన రోజు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన 2008 వ సంవత్సరం లో ఇదే రోజు న ముంబయి లో జరిగిన ఉగ్రవాద దాడి తాలూకు బాధితుల ను కూడా స్మరించుకొన్నారు. భద్రత దళాల అమరవీరుల కు ఆయన శ్రద్ధాంజలి ని అర్పించారు. ప్రస్తుతం భారతదేశం ఒక కొత్త రూపు లోని ఉగ్రవాదం తో పోరాడుతోందని ఆయన అన్నారు. భద్రత దళాలకు ఆయన తన వందనాలను సమర్పించారు.
అత్యవసర పరిస్థితి ని గురించి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, 1970 ల నాటి ఈ ప్రయాస అధికార వికేంద్రీకరణ కు వ్యతిరేకంగా ఉండిందని, అయితే దీనికి జవాబు కూడా రాజ్యాంగం లోపలి నుంచే లభించిందన్నారు. రాజ్యాంగం లో అధికార వికేంద్రీకరణ, దాని ఔచిత్ం గురించిన చర్చ చోటు చేసుకొందన్నారు. అత్యయిక స్థితి అనంతరం ఈ ఘటనాక్రమం నుంచి పాఠాన్ని స్వీకరించి చట్ట సభలు, కార్యనిర్వహణ శాఖ, న్యాయ యంత్రాంగం లు వాటిలో అవి సంతులనాన్ని సంతరించుకొని బలపడ్డాయని ఆయన అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన మూడు స్తంభాల పైన 130 కోట్ల మంది భారతీయులకు బరోసా ఉన్నందువల్లనే ఇది సాధ్యపడిందని, ఇదే బరోసా కాలంతో పాటే బలవత్తరంగా మారిందని ప్రధాన మంత్రి అన్నారు.
మన రాజ్యాంగానికి ఉన్న బలం కష్టకాలం లో మనకు సహాయకారి గా నిలుస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ లోని ప్రతిఘాతుకత్వ శక్తి, కరోనా మహమ్మారి పట్ల దీని ప్రతిస్పందనలతో ఇది నిరూపితం అయిందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో పార్లమెంటు సభ్యులు మరింత ఎక్కువగా పాటుపడ్డారని, కరోనా పై జరుగుతున్న పోరాటానికి సాయపడేందుకు వారు వేతనం లో కోత ను సమ్మతించి వారి వంతు తోడ్పాటు ను అందించడాన్ని ఆయన ప్రశంసించారు.
ప్రాజెక్టులను పెండింగు లో ఉంచే ధోరణి తగదు అంటూ ప్రధాన మంత్రి హెచ్చరిక చేశారు. సర్ దార్ సరోవర్ ప్రాజెక్టు ను ఉదాహరణగా చెప్తూ, ఈ ప్రాజెక్టు ఏళ్ళ తరబడి నిలచిపోయి, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు వారు అందుకోవలసిన భారీ ప్రయోజనాలకు దూరంగా ఉండిపోయారని, అవి వారికి ఈ ఆనకట్ట ఎట్టకేలకు నిర్మాణం పూర్తి అయ్యాక అంతిమం గా అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు.
కర్తవ్య పాలన తాలూకు ప్రాముఖ్యాన్ని గురించి శ్రీ మోదీ నొక్కిచెప్తూ, కర్తవ్య పాలన ను హక్కులకు మూలవనరు గా భావించాలి అని పేర్కొన్నారు. ‘మన రాజ్యాంగం లో అనేక విశిష్ట అంశాలు ఉన్నాయి, అయితే వాటిలో ఒక విశిష్టత కర్తవ్య పాలన కు కట్టబెట్టిన ప్రాముఖ్యం అనేదే. గాంధీ మహాత్ముడు దీనిని గొప్పగా సమర్థించారు. ఆయన హక్కులకు, కర్తవ్యాలకు మధ్య చాలా సన్నిహిత బంధం ఉన్నట్టు గమనించారు. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించామా అంటే, హక్కులు వాటంతట అవే మనకు దక్కుతాయి అని ఆయన తలచారు’ అని ప్రధాన మంత్రి అన్నారు.
రాజ్యాంగం విలువలను ప్రచారం లోకి తీసుకురావలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఏ విధంగా అయితే కెవైసి- నో యువర్ కస్టమర్ (‘మీ వినియోగదారు గురించి తెలుసుకోండి) అనేది డిజిటల్ సెక్యూరిటీ కి తాళంచెవిగా ఉందో, అలాగే కెవైసి - నో యువర్ కాన్స్ టిట్యూశన్ (‘మీ రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోండి’) అనేది రాజ్యాంగ పరమైన సురక్ష కు కవచం గా నిలువగలుగుతుంది అని ఆయన అన్నారు. మన చట్టాల లోని భాష సీదాసాదా గా ఉండాలని, అది సామాన్యులకు ఇట్టే అర్థం అయ్యేదిగా ఉంటే ప్రతి ఒక్క చట్టాన్ని వారు సరిగ్గా గ్రహించగలుగుతారని ఆయన ఉద్ఘాటించారు. పాతవైన చట్టాలను ఏరివేసే ప్రక్రియ కూడా సులభంగా ఉండాలి అని ఆయన అన్నారు. మనం పాత చట్టాలను సవరిస్తే, పాత చట్టాలు వాటంతట అవే రద్దు అయ్యే ప్రక్రియను అమలులోకి తేవాలని కూడా ఆయన సూచించారు.
‘ఒక దేశం, ఒక ఎన్నిక’ పై చర్చ జరపాలని కూడా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. లోక్ సభ, విధాన సభ లు లేదా స్థానిక పంచాయతీ లు- ఇలా ప్రతి ఒక్క స్థాయి లో ఎన్నికలను ఒకే సారి నిర్వహించడాన్ని గురించి ఆయన మాట్లాడారు. దీని కోసం ఒక సామాన్య వోటరు జాబితా ను రూపొందించవచ్చు అన్నారు. ఈ కార్యానికి గాను చట్టసభల రంగం లో డిజిటల్ ఇన్నోవేశన్స్ ను ఉపయోగించుకోవాలి అని ఆయన అన్నారు.
‘విద్యార్థుల పార్లమెంటుల’ను నిర్వహించాలని ప్రధాన మంత్రి సూచన చేశారు. వాటికి మార్గదర్శకత్వం, నిర్వహణ బాధ్యతలను స్వయంగా సభాధ్యక్షులు వహించవచ్చు అని కూడా ఆయన అన్నారు.
***
(Release ID: 1676135)
Visitor Counter : 254
Read this release in:
Odia
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam