ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో కొత్త కోవిడ్ కేసుల్లో 61% కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచే
Posted On:
26 NOV 2020 12:03PM by PIB Hyderabad
గడిచిన 24 గంటలలో కొత్తగా 44,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60.72% కేవలం ఆరు రాష్ట్రాలలోనే వచ్చాయి. అవి కేరళ, మహారాష్ట, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఇందులో 6491 కేసులతో కేరళ మొదటి స్థానంలో ఉండగ్గా ఆ తరువాత మహారాష్ట్ర (6159), ఢిల్లీ (5246) ఉన్నాయి.
గత 24 గంటలలో నమోదైన 524 మరణాలలో 60.50% కేవలం ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లోనే కేంద్రీకృతమయ్యాయి. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవటంలోను, గరిష్ఠంగా మరణాల నమోదులోనూ ఉన్న ఆరు రాష్ట్రాల జాబితాలోనూ మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉమ్మడిగా కనబడతాయి. 99 మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర (65), పశ్చిమబెంగాల్ (51) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,52,344 కు చేరింది. ఇది మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో 4.88% . అ విధంగా 5% లోపు ఉంచటం సాధ్యమైనట్టు చూపుతోంది. చికిత్సలో ఉన్న కేసుల్లో 65% కేవలం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఇక్కడే గరిష్ఠంగా కొత్త కేసులు, మరణాలు కూడా నమోదవుతున్నాయి.
మొత్తం మరణాలలో 61% కేవలం ఈ 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి
ప్రతి పది లక్షల జనాభాలో వస్తున్న కేసులు ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు అయిన 6,715 తో పోల్చినప్పుడు ఎలా ఉన్నాయో ఈ చిత్ర పటం తెలియజేస్తుంది.
ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ మరణాలు జాతీయ సగటు అయిన 1.46% తో పోల్చినప్పుడు ఎలా ఉన్నాయో ఈ దిగువ చిత్రపటం తెలియజేస్తుంది.
దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారు దాదాపు 87 లక్షలకు చేరుతూ 86,79,138 మందిగా నమోదయ్యారు. ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 93.66% చేరింది. గత 24 గంటలలో 36,367 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోలుకున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.
20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకున్నవారు జాతీయ సగటు కంటే తక్కువ నమోదయ్యారు.
***
(Release ID: 1676025)
Visitor Counter : 235
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam